ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తారు వీళ్లు..!
Publish Date:Mar 25, 2026
Advertisement
ఎప్పుడూ ఏడుస్తూ కంప్లైంట్లు చేసే వ్యక్తులు.. జీవితంలో ఏ మంచినీ చూడని వాళ్ళు వీళ్ళు. వాతావరణం బాగుంటే, ఎండ వేడిమి గురించి ఫిర్యాదు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే, తమ బాస్‌ను విమర్శిస్తారు. వారి దృక్పథం ఎంత ప్రతికూలంగా ఉంటుందంటే, వారి పక్కన కూర్చోవడం కూడా మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సానుకూల శక్తిని హరించివేస్తారు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం. స్వప్రయోజనాలు చూసుకునేవారు.. స్నేహితులలో, బంధువులలో చాలామంది స్వార్థంగా ఉంటారు. మాట్లాడి చాలా రోజులు అయింది అంటూ మాటలు కలిపి తమ స్వప్రయోజనాల కోసం సహాయం అడుగుతుంటారు. ఇలాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లో ఉంటారు.వీళ్ళు కేవలం తమకు సహాయం కావాలన్నా లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా మాత్రమే ఎదుటి వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. పని పూర్తయిన వెంటనే మాయమైపోతారు. ఇలాంటి స్వార్థపరులు ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు. చాడీలు చెప్పేవారు.. ఒకరి గురించి ఇంకొకరు దగ్గర చాడీలు చెప్పేవారు.. ఏదో ఒకరోజు ఎదుటి వారికి మీ గురించి చాడీలు చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి నిజాయితీ ఉండదు. వారు సంబంధాలను పాడుచేయడానికి కల్పిత కథలను మాత్రమే చెబుతారు. జీవితంలో మనశ్శాంతి కావాలంటే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. అసూయ పరులు.. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. అయితే, కొంతమంది మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, కానీ రహస్యంగా మీ పురోగతిని చూసి అసూయపడతారు. మీరు కొత్త కారు కొన్నా, పదోన్నతి పొందినా, వారు మిమ్మల్ని అభినందిస్తారు, కానీ వారి కళ్ళలో, మాటల్లో ఒక వింతైన అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ మంచిని ఎప్పటికీ కోరుకోలేరు. నిరాశ పరిచేవారు.. నువ్వు చేయలేవు.. నీకు చేతకాద.. నీకు సాధ్యం కాదు.. నువ్వు ఫెయిల్ అవుతావు.. వంటి మాటలు చెప్పే వ్యక్తులే మీ కలలకు, ధైర్యానికి అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా కొత్తగా, సానుకూలంగా చేయాలని అనుకున్నప్పుడల్లా, వాళ్ళు తమ మాటలతో మిమ్మల్ని భయపెట్టి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, వాళ్ళ మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయాలి. పైన చెప్పుకున్న లక్షణాలు గల వ్యక్తులు ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇలాంటి వ్యక్తుల మాటలను ఎంత తక్కువ పరిగణలోకి తీసుకుంటే అంత మంచిది. లేకపోతే సంతోషాన్ని చెదపురుగుల్లా తినేసి, మనిషిని అశాంతికి గురిచేస్తారు. *రూపశ్రీ.
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు. డబ్బు సంపాదిస్తారు, నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు.. ఇలా సంతోషంగా ఉండటానికి చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఇన్నిచేసినా సరే.. కొందరు సంతోషంగా ఉండరు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మంది ఆలోచించరు. కేవలం అసంతృప్తి దగ్గరే ఆగిపోతారు. కానీ క్షుణ్ణంగా గమనిస్తే.. ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సంతోషపెట్టే విషయాలు ఉన్నా ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం లేదంటే.. ఆ వ్యక్తి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులే కారణం అయ్యే అవకాశం ఉంటుంది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తుంటారు. పైశాచిక ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తారు. పక్కవాళ్ల సంతోషాన్ని నాశనం చేసే ఆ వ్యక్తులు ఎవరు? వారి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/be-careful-with-these-types-of-people-35-216139.html




