సమ్మర్‌లో ఏసీ రోజంతా వాడినా సరే.. తక్కువ కరెంట్ బిల్ రావడానికి ఈ సీక్రెట్  ట్రిక్స్ మీకోసం..!

Publish Date:Mar 13, 2026

Advertisement


వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది.  ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది.  ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్  ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే..

టెంపరేచర్...

చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు.  ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది.  ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది.

ఏసీ, ప్యాన్ కాంబినేషన్..

ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు.  ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు.  కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి.  ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు.

డోర్స్, విండోస్..

చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు.  డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు.  దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది.

కర్టెన్లు..

కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది.  అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి.  ఇలా చేస్తే వేడి లోపలికి రాదు.

ఫిల్టర్..

చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ,  ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.  ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి.  వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.  శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

స్లీప్ మోడ్ లేదా టైమర్..

వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని  ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది.  ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు.

పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు.  ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.

                                       *రూపశ్రీ.

By
en-us Political News

  
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే....
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది...
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక...
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది...
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.