వ్యాపారానుకూల దేశాలలో మెరుగుపడిన భారత్ ర్యాంకింగ్

Publish Date:Oct 29, 2015

Advertisement

 

భారతదేశంలో వ్యాపారానికి అత్యంత అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుజరాత్ తరువాత రెండవ స్థానంలో ఉందని కొన్ని రోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఈసారి ప్రపంచ దేశాలలో వ్యాపారానుకూల వాతావరణం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ఉన్న189 దేశాల జాబితాను ప్రపంచ బ్యాంక్ నిన్న ప్రకటించింది. ఆ జాబితాలో భారత్ కి 130వ స్థానం దక్కింది. గత ఏడాది ఇదే సమయానికి భారత్ 142వ స్థానంలో ఉండగా, ఏడాది సమయంలోనే 12 స్థానాలు మెరుగుపడి 130వ స్థానానికి భారత్ చేరుకోవడం విశేషం.

 

ఈ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోడి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీధే నని ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. మోడీ ప్రధానిగా భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వ్యవస్థలలో అనేక సంస్కరణలు చెప్పట్టారు. అభివృద్ధి నిరోధకాలుగా ఉన్న అనేక అవరోధాలను గుర్తించి తొలగిస్తున్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తత్ఫలితంగా పాలనలో పారదర్శకత, వేగం పెరిగాయి. గత ఏడాదిన్నర కాలంలో మోడీ చేసిన విదేశీ పర్యటనలలో భారత్ పట్ల ప్రపంచ దేశాలకున్న నిశ్చిత దురాభిప్రాయలను పటాపంచలు చేసి, భారత్ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అని అక్కడ వ్యాపారావకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయనే విషయం ప్రపంచాదేశాలకి చాటి చెప్పారు. తత్ఫలితంగా భారత్ పట్ల ప్రపంచ దేశాల అభిప్రాయాలు కూడా మారడం మొదలయ్యాయి.

 

భారత్‌ లో ప్రస్తుతం సంస్కరణలు చాలా వేగంగా జరుగుతున్నాయని, ఒకవేళ ఇదే ఊపు కొనసాగిస్తే వచ్చే ఏడాదినాటికి భారత్ ర్యాంక్ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని గ్లోబల్‌ ఇండికేటర్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ లోపెజ్‌ క్లారోస్‌ అన్నారు. భారత్ లేకుండా ఇంటర్నెట్ తో ప్రపంచ దేశాలను అనుసంధానం చేయడం సాధ్యం కాదని, భారత్ లో విస్తృతంగా వ్యాపారావకాశాలు ఉన్నాయని ఫేస్ బుక్ సి.ఈ.ఓ. మార్క్ జూకర్ బెర్గ్ చెప్పడమే అందుకు చక్కటి ఉదాహరణ.

 

గమ్మతయిన విషయం ఏమిటంటే ఒక ప్రపంచ ప్రసిద్ధి పొందిన గొప్ప ఆర్ధికవేత్త డా.మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ 142స్థానంలో ఉంటే, బస్టాండులో టీ అమ్ముకొనే వ్యక్తి నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే ఏడాది కాలంలోనే ఒకేసారి 12స్థానాలు ఎగ్రబ్రాకి 130కి చేరుకొంది.

 

ప్రపంచ బ్యాంక్ ‘డూయింగ్‌ బిజినెస్‌ 2016’ పేరిట నిన్న విడుదల చేసిన జాబితాలో సింగపూర్‌ నెంబర్:1 స్థానంలో నిలవగా ఆ తరువాత స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, బ్రిటన్‌, అమెరికా దేశాలు నిలిచాయి. ఈ జాబితాలో చైనాకు 84వ స్థానం, పాకిస్థాన్‌కు 138వ స్థానం దక్కింది. గతేడాదితో పోలిస్తే పాకిస్థాన్‌ ర్యాంకు 10 స్థానాలు దిగజారగా భారత్ 12 స్థానాలు ఎగ్రబ్రాకి 130కి చేరుకొంది.

 

ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వంపై పట్టు కోల్పోయారని, డా.మన్మోహన్ సింగ్ వద్ద ఆర్ధిక పాఠాలు నేర్చుకొన్నారని ఎగతాళి చేసేవారికి చెంపదెబ్బ వంటిదని చెప్పవచ్చును.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.