పశ్చిమ ఆసియా శాంతి స్థాపనలో భారత్ కీలకం

Publish Date:Apr 14, 2026

Advertisement

కంఠమనేని సీతారాం

అంతర్జాతీయ రాజకీయ యవనికపై పశ్చిమ ఆసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న  ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.  ముఖ్యంగా పాకిస్తాన్ గడిచిన ఆదివారం జరిగిన శాంతి చర్చలు చివరి నిముషంలో విఫలం కావడం పరిస్థితిని మరింత దిగజార్చి, ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశలో గురువారం (ఏప్పిల్ 14) మరో విడత చర్చలకు రంగం సిద్ధమైనా అవి ఏ మేరకు ఫలితాలిస్తాయన్న అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి.  ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం అనుసరిస్తున్న సంతులన దౌత్య విధానం పట్ల ఇరాన్ అగ్రనేతలు ప్రశంసలు కురిపించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.   

ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి  ఉన్న పరిస్థితుల్లో,  ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.  ఆ ఒక్క ఫోన్ కాల్  శాంతి ప్రక్రియను పట్టాలు తప్పించింది.  ఇరాన్ డిమాండ్లు,  పాక్ పాత్రపై సందేహాలు.. ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా వైఖరిని ఎండగట్టారు. తమ దేశ హక్కులను గౌరవించి, ఆధిపత్య ధోరణిని వీడితేనే చర్చలు సఫలమవుతాయని ఆయన కుండబద్దలు కొట్టేశారు.  ఇదే సమయంలో ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ సామర్థ్యంపై అమెరికా మాజీ సైనిక అధికారి డగ్లస్ మాక్‌గ్రెగర్ తీవ్ర విమర్శలు చేశారు. కాలిపోతున్న భవనంలో ఆశ్రయం ఇచ్చిన చందంగా పాక్ ప్రయత్నాలు ఉన్నాయని, ఇజ్రాయెల్ వంటి దేశాలు పాకిస్తాన్‌ను ఏమాత్రం విశ్వసించవని ఆయన నిర్మొహమాటంగా, నిష్కర్షగా చెప్పారు. పాక్ కంటే భారత్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సయీద్ రెజా మోసయెబ్ మోట్లాగ్ భారతదేశం పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ప్రత్యేకంగా అభినందించారు. యుద్ధం లేదా సైనిక జోక్యం కంటే దౌత్యపరమైన పరిష్కారాలకే భారత్ మొగ్గు చూపుతోందని, ఇది ప్రాంతీయ స్థిరత్వానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. చైనా, రష్యాలతో పాటు భారత్ శాంతిని నెలకొల్పడంలో నిజాయితీగా వ్యవహరిస్తోందని  కితాబు ఇచ్చారు. ప్రధాని మోదీకి ఉన్న అంతర్జాతీయ పలుకుబడి,  ప్రపంచ నేతలతో ఆయనకున్న సంబంధాలు ఈ సంక్షోభ నివారణకు ఎంతో తోడ్పడతాయని విదేశీ నిపుణులు సైతం చెబుతున్నారు. 
 
ఇదే సమయంలో ఇజ్రాయెల్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. పాకిస్తాన్‌ను బహిరంగంగానే  ఉగ్రవాద దేశంగా ఇజ్రాయెల్ అభివర్ణించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇరాన్‌తో పాక్ సంబంధాలు,  ఉగ్రవాదానికి ఆ దేశం ఇస్తున్న మద్దతును ఇజ్రాయెల్  తప్పుబట్టింది. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. శాంతి చర్చల పరోగతికి  భారత్ వంటి దేశాల చొరవ అనివార్యమని ప్రపంచ దేశాలు సైతం భావిస్తున్నాయి.  

By
en-us Political News

  
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.