ప్రేమోన్మాది ఘాతుకం.. ఏకంగా తుపాకితో కాల్చి యువతి హత్య
Publish Date:May 9, 2022
Advertisement
ఏపీలో క్రైమ్ తప్ప మరో టాపిక్ వినిపించని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళల పట్ల అత్యాచారాలు, హత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయాయి. అమ్మాయిలకు ఏ మాత్రం సేఫ్ కాని రాష్ట్రంలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పవచ్చు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒక యువతిని తుపాకితో కాల్పి హత్య చేశాడు. ఆ అమ్మాయి చేసిన నేరం సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడమే. అమ్మాయిలనై అఘాయిత్యాలలో తుపాకీ వాడటం కొత్త ట్రెండా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కరుడుగట్టిన నేరస్థులు, ప్రొఫెషనల్ గ్యాంగ్స్ మాదిరిగా ఆ ప్రేమోన్మాది ఏకంగా తుపాకితో ఆ అమ్మాయిని కాల్చి చంపేశాడు. ఆ తరువాత అదే తుపాకితో తనను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. సురేష్ రెడ్డి అనే సాప్ట్ వేర్ ఉద్యోగి కరోనా టైం నుంచి వర్క్ ఫ్రం చేస్తున్నారు. కావ్య అనే యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కావ్యను పెళ్లి చేసుకుంటానంటూ తన బంధువుల ద్వారా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడించారు. అయితే వారు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. అదే కావ్య నేరమైంది. కావ్యపై ద్వేషం పెంచుకున్న సురేష్ రెడ్డి ఆమెను చంపడానికి ఏకంగా తుపాకి తెచ్చుకున్నాడు. కాల్చిచంపాడు. తుపాకీ ఎక్కడిదన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అది లైసెన్స్‌డ్ తుపాకీ కాదని పోలీసులు చెబుతున్నారు. అక్రమ పద్దతుల్లో మాఫియా ద్వారా సేకరించి ఉంటారని భావిస్తున్నారు. తుపాకితో ప్రొఫెషనల్‌గా షూట్ చేసి చంపడం.. తర్వాత తనను తాను కాల్చుకోవడం ఎలా సాధ్యమన్న అనుమానం పోలీసుల్లో వ్యక్తమౌతోంది. ప్రేమోన్మాది తుపాకితో ఒక అమ్మాయిని కాల్చి చంపడం రాష్ట్రంలో శాంతి భద్రతల అధ్వాన స్థితికి అద్దంపడుతోంది. ఏపీలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందన్న విషయాన్ని ఈ తాజా సంఘటన మరోసారి తేటతెల్లం చేసింది. మాఫియా అడ్డాగా ఏపీ మారిపోయిందనడానికి ఒక సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అన్ లైసెన్స్ డ్ తుపాకినీ సేకరించగలగడమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
http://www.teluguone.com/news/content/women-murser-dor-redusibg-marriage-25-135658.html





