రేవంత్ పాదయాత్ర.. ఉంటుందా? ఉండదా?

Publish Date:Jan 13, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా అవాంతరాలు ఎదురౌతున్నాయా? ఆయన ముందుగా ప్రకటించినట్లు ఈ నెల చివరి నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నారు. ఎన్నికల ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పాదయాత్రతో ముందుకు సాగాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఆయన ఉన్నా.. హై కమాండ్ నుంచి అనుమతి, రాష్ట్రంలో ఆయన వ్యతిరేకుల అడ్డంకులతో యాత్ర తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు.  

పాదయాత్రతో ప్రజల్లోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీ కేడర్ , ద్వితీయ శ్రేణి నాయకులు, వరుస ఓటములతో డీలా పడిన క్యాడర్ లో నూతనోత్సాహం నింపాలన్నది రేవంత్ లక్ష్యంగా చెబుతున్నారు. అలాగే మరోవైపు రాజకీయంగా దూకుడు మీద ఉన్న బీజేపీకి కూడా తన పాదయాత్రతో చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడంతో... కాంగ్రెస్ హైకమాండ్ తన పాదయాత్రకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని.. అనుమతి కూడా లభిస్తుందని రేవంత్ విశ్వాసంతో ఉన్నారు.  

తన పాదయాత్ర ద్వారా  కాంగ్రెస్  ప్రచారం కూడా జరుగుతుందని, ప్రజల్లోకి కాంగ్రెస్ చేసిన పనులు, చేపట్టిన పథకాలు మరోసారి తీసుకెళ్ళొచ్చని రేవంత్ చెబుతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులను గమనిస్తే ఆయన పాదయాత్ర మొదలు పెట్టడం, కొనసాగించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకవర్గం రేవంత్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణిక్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తరువాత సంక్షోభ నివారణ యత్నాలు మళ్లీ మొదటి నుంచీ ప్రారంభమయ్యాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి నేతలను బుజ్జగించడమే లక్ష్యంగా ఠాక్రే వ్యవహరిస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను జిల్లా కమిటీలనూ, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఇసుమంతైనా ఖాతరు చేయబోనని ఠాక్రేతో సమావేశం తరువాత ప్రకటించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చర్జ్  ఠాక్రే వస్తూనే  రాష్ట్ర పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు.     కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి పాదయాత్ర అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జ్ ముందు ఇప్పటికే ప్రస్తావించి ఆయన  ఒక్కరే పాదయాత్ర చేస్తే ఎలా.. ఆయనకు అనుమతి ఇవ్వడం ద్వారా కొత్త పంచాయతీ సృష్టించవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో తెలంగాణలోని పలువురు సీనియర్లు, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న నేతలంతా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించారని అంటున్నారు.

రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తే.. తాము కూడా పాదయాత్ర చేస్తామని.. తమకు కూడా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తామొంటూ   సీనియర్ నేతలు ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి అనుమతి ఇచ్చి.. ఇతర నేతలకు ఇవ్వకపోతే కొత్త సమస్య వస్తుందని   సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావ్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అయితే తాను అనుకున్న విధంగానే పాదయాత్రతో ముందుకు సాగాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఈ విషయంలో హైకమాండ్‌ను ఏదో రకంగా ఒప్పించాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఒక వేళ హై కమాండ్ అనుమతి లభించకుంటే.. అధిష్ఠానాన్ని ధిక్కరించైనా సరే పాదయాత్రతో ముందుకు సాగాలని రేవంత్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  మొత్తానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీకి కారణమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.