ప్రధానిగా మోడీ కొనసాగుతారా? ఆర్ఎస్ఎస్ కరుణ చూపుతుందా?

Publish Date:Aug 17, 2025

Advertisement

మోడీ రిటైర్మెంట్ పై సాగుతున్న చర్చకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష కూటమి చేపట్టిన ఓటు చోరీ ఆందోళన నేపథ్యంలో మరో సారి మరింత బలంగా మోడీ రిటైర్మెంట్ చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోడీ రిటైర్మెంట్  అంశాన్ని వార్తలో నిలిచేలా పదే పదే ప్రస్తావిస్తూ సవాళ్లు విసురుతోంది. మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీల విషయంలో  మోడీ, షా వ్యవహరించిన తీరును ఎత్తి చూపుతూ.. 75 ఏళ్ల నిబంధన నుంచి మోడీకి మినహాయింపు ఏమైనా ఉందా? అంటూ ఎద్దేవా చేస్తోంది.  వచ్చే నెలతో అంటే సెప్టెంబర్ తో సెప్టెంబర్‌తో మోదీకి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. దీంతో బీజేపీ తనంతట తానుగా విధించుకున్ననిబంధన ప్రకారం మోడీ రిటైర్ కావలసి ఉంటుంది. 

బీజేపీ పొలిటికల్ మెంటార్ లాంటి ఆర్ఎస్ఎస్ కూడా అదే చెబుతోంది. అయితే పార్టీలోనే మోడీ రిటైర్మెంట్ నుంచి మినహాయింపు కోసం ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చను తెరపైకి తెస్తున్నవారిలో  మోడీ ప్రధానిగా కొనసాగాలనుకుంటున్న వారితో పాటు ఆయన వైదొలగాలని కోరుకుంటున్నవారు కూడా ఉన్నారు. అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ కూడా మోడీ ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాల కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు చేస్తున్నది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత  జైరాం రమేశ్‌   మోదీ పదవీకాలం సెప్టెంబర్‌ తర్వాత కొనసాగడం అన్నది ఆర్ఎస్ఎస్ పైనే ఆధారపడి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.   
 బీజేపీ విధాన నిర్ణయాలలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకమన్నది బహిరంగ రహస్యమే అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు లేకుండా మోదీ 75 ఏళ్ల నిబంధన నుంచి మినహాయింపు పొందే అవకాశం ఇసుమంతైనా లేదన్నది పరిశీలకుల విశ్లేషణ.   ఈ నేపథ్యంలోనే మోడీ ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుడ్ లుక్స్ లో పడేందుకు మోడీ శతధా ప్రయత్నిస్తున్నారనడానికి ఆయన ఇటీవలి ప్రసంగాలలో ఆర్ఎస్ఎస్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగుడుతున్న విధానమే తార్కనంగా పరిశీలకులు చెబుతున్నారు.   

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలను సాధించడంలో  ఆ ఎన్నికల ప్రచారాన్నంతా భుజాలపై వేసుకుని మోసిన మోడీ వైఫల్యం ఆయనను బీజేపీలో బలహీన నేతగా మార్చిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని పదవిలో 75 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కూడా కొనసాగాలంటే ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడం వినా మరో మార్గం లేదనీ, అందుకే మోడీ ఆ ప్రయత్నాలలో మునిగిపోయారని చెబుతున్నారు.  గత దశాబ్ద కాలంగా బీజేపీని బలమైన నాయకత్వంతో ముందుకు నడిపించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు బలాన్ని కోల్పోయారనీ, గత ఎన్నికలలో పార్టీకి మెజారిటీ సీట్లు సాదించడంలో ఆయన వైఫల్యం ఇప్పుడు ఆయన ముందరి కాళ్లకు బంధంగా మారిందనీ చెబుతున్నారు. ఇక ఆయన సెప్టెంబర్ తరువాత ప్రధానిగా కొనసాగడమన్నది ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాలపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆర్ఎస్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో? 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.