ఓట్ల చోరీ.. భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు?

Publish Date:Aug 17, 2025

Advertisement

భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన, ఆరోపణలకు బలం చేకూరుతోంది.  బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు  భారత ఎన్నికల కమిషన్ పనితీరుపై సందేహాలను లేవనెత్తుతోంది. బీహార్ ఓటర్ల జాబితా లో 65 లక్షల మందిని తొలగించారని,ఎన్నికల సంఘంతో ప్రభుత్వం కుమ్మక్కైందని పార్లమెంటులో 15 రోజులుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించినట్లు ఆరోపిస్తున్న 65 లక్షల ఓటర్ల పేర్లు, వివరాలను 48 గంటల్లో అధికారిక వెబ్ సైట్లో పెట్టాలని ఆదేశించింది. తొలగించడానికి కారణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. సుప్రీంకోర్టు  ఆదేశాలు ఎన్నికల కమిషన్ ను షాక్  అనే చెప్పాలి. ఓటర్ల సవరణ పేరుతో తొలగించడం అక్రమమని కాంగ్రెస్ సహా  ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.   సుప్రీంకోర్టు జోక్యం తో ఓట్ల చోరీ కేసులో నిజాలు బయటకు వస్తాయా, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవాలు తేలతాయా అంటే ఇతమిథ్ధంగా చెప్పలేమన్నది విశ్లేషకుల మాట.  త్వరలో బీహార్ ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై ఇలాంటి అక్రమానికి పాల్పడిందన్నది కాంగ్రెస్, ఇండియా కూటమి ఆరోపణ.  ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న విడుదల చేసింది. దాని ప్రకారం 65.6 లక్షల ఓటర్ల పేరు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఉన్న ఓటర్లలో తొలగించింది 9 శాతం. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. అలాగే గత (2020 ఎన్నికలు), 2024 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఈసారి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి. 1977 తరువాత ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం. సగటున ఇదే 9 శాతం దేశవ్యాప్తంగా పరిగణలో తీసుకుంటే 9 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతయ్యాయి.   ఈ సంఖ్య బ్రిటన్ లోని ఓటర్ల సంఖ్యకు ఒకటిన్నరెట్లు అధికం.  బీహార్లో 30 లక్షల ఓటర్లు అర్హత ఉండి కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్రించుకోలేకపోయారన్నది వాస్తవం.  

ఓటర్ల జాబితా లో మృతిచెందారని పేర్కొన్న వారితో ఫోటోలు దిగి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.   మృతులతో ఫోటోలు దిగే భాగ్యం కల్పించినందుకు కృతజ్ణతలు అంటూ ఆయన వ్యంగ్యంగా చేసిన పోస్టు హాట్ ను మరింత పెంచేసింది.  మరణించారంటూ ఓటరు జాబితా నుంచి తొలగించిన వారితో ఆయన చాయ్ తాగుతూ దిగిన ఫొటోను సామాజిక మాధ్యమలో పోస్టు చేశారు.  ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు 300 మంది పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకూ ఓట్ల చోరీ నినాదంతో భారీ ప్రదర్శన చేసారు. ఈ ప్రదర్శనలో ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,  రాహూల్, ప్రియాంకగాంధీ సహా   పలువురి అరెస్టు చేశారు.  తమది రాజ్యాంగాన్ని కాపాడే పోరాటమని, ఓటర్ల చోరీ ఉద్యమం మహోద్యమం గా మారుతుందనడంలో సందేహంలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఓట్ల చోరీ అంటూ రాహుల్ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది.

ఓట్ల చోరీ జరిగిందని ప్రామాణిక పత్రంపై సంతకం చేసి ఇస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అలా చేయకపోతే  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే రాహుల్ ఆరోపణలపై కర్ణాటక,హర్యానా ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసారు. రాహుల్ లేవనెత్తిన అంశానికి  ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వకుండా ప్రమాణాలు చేయ్యాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మోడీ హయాంలో సందేహాలకు తావిచ్చేదిలా ఉందనడంలోసందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు  మోదీ హయాంలో ఎన్నికల కమిష న్ ను  నిర్వీర్యం చేసారన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. శేషన్ హయాంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఎలా ఉండవచ్చో చూపించారు. అయితే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్  వెన్నెముక లేని సంస్థగా మారిపోయిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను సామాన్యులు సైతం సమర్ధిస్తున్నారు. 

బీహార్ లో ఓటర్ల తొలగింపు అంశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోరాటంతో భారత ఎన్నికల సంఘం, కేంద్రంలోని మోడీ సర్కార్ డిఫెన్స్ లో పడ్డాయనడంలో ఇసుమంతైనా సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.  ఇక తాజాగా తొలగించిన ఓటర్ల వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్షాల వాదన సరైనదేన్న భావన సర్వత్రా కలిగేలా చేశాయి.   

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.