బాలినేనితో విడదల రజనీ భేటీ.. ఇక జనసేన తీర్థమేనా?

Publish Date:Feb 15, 2025

Advertisement

2024 ఎన్నికలలో ఘోర పరాజయంతో వైసీపీ పనైపోయిందన్నది స్పష్టమైపోయింది. నభూతో న భవిష్యత్ అన్న రీతీలో ఐదేళ్ల అధికారంలో ఉన్న పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించి జనం మీ సేవలింక చాలు అని విస్పష్టంగా జగన్ కు తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం జగన్ అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వాళ్లందరూ ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించి, తమ తప్పులకు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించాల్సిన రోజు ఎప్పుడొస్తుందో అన్న భయంతో బతుకీడుస్తున్నారు. 

ఇప్పటికే పలువురు జగన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని భావించి,  వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. కూటమి పార్టీలలో చేరిపోయారు. అలా అవకాశం లేని విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీ యాలకే గుడ్ బై చెప్పేశారు. అదే దారిలో మరింత మంది ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల వరకూ కూడా అవసరం లేదు... స్వయంగా జగన్ పార్టీ నుంచి మరి కొందరు వెళ్లిపోయేలా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై మాట్లాడిన జగన్ ఆ సందర్భంగానే విజయసాయిలా క్యారెక్టర్ లేని మరో ఇద్దరు ముగ్గురు పార్టీని వీడిపోతారని చెప్పేశారు. వైసీపీ పరిస్థితి అలా తయారైంది. ఏ నాయకుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి ఉంది. జగన్ వినా మరెవరికీ పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న నమ్మకం వీసమెత్తైనా లేని పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

ఈ తరుణంలో చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజనీ ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు సమీప బంధువు అన్న సంగతి తెలిసిందే. అటువంటి బాలినేని పార్టీ పరాజయం తరువాత వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు.  అటువంటి బాలినేనితో విడదల రజినీ ఇటీవల బేటీ అయ్యారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దీంతో విడదల రజనీ జనసేన బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 విజయం సాధించిన విడదల రజినీకి జగన్ తన క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యి కూడా కేబినెట్ బెర్త్ దక్కించుకున్న విడదల రజినీ మంత్రి హోదాలో దోచుకో.. దాచుకో అన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. సరే 2024 ఎన్నికలు వచ్చే సరికి విడదల రజినీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చేశారు జగన్.  చిలకలూరి పేట నియోజకవర్గంలో ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనీ, జనం ఆమెను ఓడించాలన్న నిర్ణయానికి వచ్చేశారనీ, అందుకే ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారనీ అప్పట్లో వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్పాయి. సరే 2024 ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుంచి ఆమె పరాజయం పాలయ్యారు. జగన్ పార్టీ కూడా అధికారం కోల్పోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

అప్పటి నుంచీ విడదల రజనీ దౌర్జన్యాలు, ఆక్రమణలు, అక్రమ వసూళ్లపై ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం భయంతో నోరుమెదపని బాధితులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కరొక్కరుగా  బయటకు వచ్చి ఫిర్యాదులు చేశారు. దీంతో ఆమెపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. తాజాగా రజినీపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆమె వైసీపీని వీడి సేఫ్ జోన్ లోకి వెళ్లాలన్న ప్రయత్నాలు మొదలు పెట్టారు.  తాజాగా ఆమె మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ కావడంతో ఆమె వైసీపీకి గుడ్ బై  చెప్పేయడం ఖాయమైనట్లునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.