కేరళలో భార్యల మార్పిడి..సమాజం ఎటు పోతోంది..!

Publish Date:May 14, 2016

Advertisement

భారతీయ కుటుంబ వ్యవస్థ..భార్యాభర్తల సంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయనడానికి కేరళలోని కొచ్చి నావల్ బేస్‌లో జరిగిన..జరుగుతున్న వ్యవహారమే పెద్ద నిదర్శనం. బైకులు..కార్లు..ఫోన్లు మార్చకున్నట్టు భార్యల్ని మార్చుకునే అనాగరికమైన కల్చర్‌ భారతదేశంలో సంచలనం సృష్టించింది. కేరళలోని కొచ్చి నావల్ కమాండ్‌లో పనిచేసే ఒక అధికారికి ఒక మహిళతో 2012 మార్చిలో వివాహం అయ్యింది. వీరిద్దరూ కొచ్చిలోనే కాపురం పెట్టారు. ఐతే ఆమె భర్త సహ అక్కడ పనిచేసే చాలామంది అధికారులకు వైఫ్ స్వాపింగ్ పార్టీలు చేసుకోవడం అలవాటు. అలాంటి పార్టీలో తనను పాల్గొనాల్సిందిగా సాక్షాత్తూ భర్త ఒత్తిడి చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అందుకు ఒప్పుకోనందుకు తనను భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నట్లు 2013 ఏప్రిల్ 4న కొచ్చి హార్బర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కేసు పెట్టింది ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు తన భర్త ఓ సీనియర్ ఆఫీసర్ భార్యతో సన్నిహితంగా ఉండటం చూశానని ఫిర్యాదులో పేర్కొంది.

 

ఈ సంఘటనతో సభ్య సమాజం ఉలిక్కిపడింది. మనం ఉంటుంది భారతదేశంలోనా లేక మరెక్కడైనా అని ప్రశ్నించుకుంటోంది. అసలేంటి ఈ వైఫ్ స్వాపింగ్.. రెండు లేదా అంతకంటే ఎక్కువ జంటలు ముందుగా మాట్లాడుకుని భార్యల మార్పిడి చేసుకోవడం. ఒకరి భార్యతో ఇంకొకరి భర్త శారీరకంగా కలవడమే ఈ భార్యల మార్పిడి. వైఫ్ స్వాపింగ్, వైఫ్ షేరింగ్, వైఫ్ ఎక్స్చేంజ్ పేరేదైనా దీని సారాంశం ఒక్కటే. ఉన్నత వర్గాల్లో, విచ్చలవిడితనం మాత్రమే అలవాటు ఉన్న కుటుంబాల్లో ఈ భార్యల మార్పిడిల వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది. కాని రాను రాను ఈ విష సంస్కృతి అన్ని వర్గాలకు పాకుతోంది. ప్రత్యకించి ఇలాంటి వ్యవహారం దేశ భద్రతలో కీలకంగా ఉన్న నేవీలో బయటపడటమే అన్నింటి కంటే ఆశ్చర్యకరం.

 

నేవిలో పనిచేసే వారి జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. కుటుంబాల ఒంటరితనం, చిన్న చిన్న కుటుంబాలు, నెలల కొద్ది జీవిత భాగస్వాములను వదిలి ప్రయాణాలు చేయడం అందుకే గత కొద్ది సంవత్సరాలుగా ఈ విచ్చలవిడి లైంగిక క్రీడ ప్రారంభమైంది. ఇష్టపడి చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అలాంటి వెధవ పనులకు మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో..భర్తతో కాకుండా వేరే మగాడితో కలవడానికి ఇష్టపడని మహిళలను సదరు భాగస్వామి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రపంచం మొత్తం కీర్తించే భారతీయ సమాజానికి ఇలాంటి సంఘటనలు మాయని మచ్చ తెస్తున్నాయి.

 

మన జీవన విధానం, సనాతన ధర్మాలు, ఆచారాలు స్త్రీలకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించాయి. అనాదిగా పరాయి వ్యక్తి భార్యను అమ్మలా, అక్కలా, చెల్లిలా, వదినలా గౌరవించే గడ్డ మనది. ఇటువంటి వికృత క్రీడలు మనదేశంలో చెల్లవు. ఒప్పుకోవడం అటుంచి జనం దాన్ని అసహ్యించుకుంటారు. కానీ ఈ అంశంలో మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత భాగస్వామితో కాకుండా ఒకసారి మరోకరితో లైంగిక ఆనందాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి వల్ల కూడా పరాయి స్త్రీ లేదా పరాయి పురుషుడితో సంబంధాల్ని  ఏర్పరిచే ఈ స్వాపింగ్ పార్టీకు అలవాటు పడుతున్నారు.

 

ఈ దుష్ట సంప్రదాయం మీద సుప్రీం సీరియస్ అయ్యింది..ఈ కల్చర్‌ను తప్పుబడుతూ నేవీ ఆఫీసర్ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మనం కనీసం ఊహించుకోవడానికి కూడా ఇబ్బంది పడే విషయం ఇది. దీనిని మొగ్గలోనే తుంచివేయకపోతే సమాజానికి తీవ్ర నష్టం కలుగుతుంది, తరాలు నాశనం అయిపోతాయి.
 

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.