అక్రమ సంబంధం బయటపడకూడదని కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. ఈ ఢటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వామి, మౌనికలకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే మౌనిక తనకన్నా వయస్సులో చిన్న వాడైన సంపత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. విషయం తెలిసిన భర్త స్వామి పలుమార్లు ఆమెను తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది. ఈ నేపథ్యంలోనే గత నెల 22న ఇంట్లో భర్త నిద్రపోతుండగా.. ప్రియుడు సంపత్ ను ఇంటికి పిలిచింది. ప్లాన్ ప్రకారం ఇరువురూ కలిసి స్వామి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని నేరెళ్ల కుంటలో పడేశారు. మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయాడు కట్టుకథ అల్లి అందర్నీ నమ్మించాలని ప్రయత్నించిన మౌనికకు స్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో మౌనిక నేరం ఒప్పుకుంది. ఆమెను, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్టు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wife-murfer-ger-husband-36-211953.html
రహస్యంగా మేకలు, గొర్రెల వంటి మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరించి, బయటకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది.
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు
కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది.
పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బర్సీ దేవా, చదువు మధ్యలోనే ఆపి మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.
డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది.
ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది.
ఈ నిర్ణయంతో బీసీసీఐ బంగ్లాదేశ్ లో క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.