ముఖ్యమంత్రి రేవంత్ కు కోపమొచ్చింది.. ఎందుకో తెలుసా?

Publish Date:May 29, 2025

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత, ఆయనలో మార్పు వచ్చిందా?  గతానికి భిన్నంగా.. ముఖ్యంగా అధికారుల విషయంలో కొంత కఠినంగా, ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా?  అధికారులపై, కల్లెక్టర్లపై కోపంగా ఉన్నారా?  అలాగే.. మంత్రులకు మంరిత దగ్గరయ్యే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అంటే ఇటు అధికార వర్గాల నుంచి, అటు రాజకీయ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది. 

ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి.. మంగళవారం(మే28)  జిల్లా కల్లెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. అఫ్కోర్స్  రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలతో పాటుగా.. ఇంచార్జి మంత్రుల జిల్లా పర్యటనలు, జూన్ 3వ తీదీ నుంచి 20వ వరకు జరగనున్న భూభారతి రెవెన్యూ సదస్సులు, ధాన్యం సేకరణ, తదితర అంశాలపై చర్చించేందుకే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉండవచ్చును. అయితే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన చేసిన వ్యాఖ్యలు  కొంత భిన్నంగా ఉన్నాయని అంటున్నారు.

ఈసందర్భంగా జిల్లా కల్లెక్టర్లు కార్యాలయాలకు పరిమితం అయితే కుదరదని ముఖ్యమంత్రి కరాఖండిగా  చెప్పారు. మంత్రులు జిల్లా కల్లెక్టర్లు క్షేత్ర  స్థాయిలో పర్యటించి, ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ సీజన్  వ్యసాయ కర్యకాలపాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.  జిల్లాల ఇంచార్జి మంత్రులు మే 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించి ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు,ఖ రీఫ్ సీజన్ వ్యవసాయ కర్యకాలపాల అమలు తీరును సమీక్షించి..  నివేదికను జూన్ 1 వ తేదీ, సాయంత్రం 4 గంటల లోపు  సీఎంవోకు అందచేయాలని ఆదేశించారు.  

అంతే అయితే, అదో రకం కానీ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. జిల్లా కల్లెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా కల్లెక్టర్లు  క్షేత్ర స్థాయి  పర్యటనలు చేసి తీరాలని లేదంటే, ప్రత్యామ్నాయం చూసుకోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. అంతే కాదు.. ఇక పై ప్రమోషన్లు, పోస్టింగులకు  క్షేత్ర స్థాయి పని తీరు ప్రధాన కొలమానంగా ఉంటుందని స్పష్టం చేశారు.  
అంతే కాదు.. జిల్లా కల్లెక్టర్లు ఎవరికైనా క్షేత్ర స్థాయి పర్యటనలకు ఏ కారణంగా అయినా.. ఎలాంటి ఇబ్బంది,అభ్యంతరం ఉన్నా,  వారి స్థానంలో ప్రత్యామ్నాయం చూసుకుంటామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  మాట వినక పోతే సహించేది లేదని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు.

అలాగే..  ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీడియా, సోషల్ మీడియా చేస్తున్నతప్పుడు ప్రచారం విషయంలో కల్లెక్టర్లు మౌనంగా ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన  ముఖ్యమంత్రి,  కల్లెక్టర్లు వాస్తవాలను చెప్పకపోవడం వలన తప్పుడు ప్రచారాన్ని  ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి వస్తోందని అన్నారు. అధికారులు, ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో క్రియాశీలంగా ఉండాలని, వాస్తవ సమాచారం ఇచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారం కొనసాగితే.. అందుకు బాధ్యులైన వారిపై పోలీసు కేసులు పెట్టాలని మఖ్యమంత్రి   ఆదేశించారు.  ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోక పోవడం వలన, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, జిల్లా కల్లెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనల వలన వాస్తవ విషయాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి, కల్లెక్టర్లు సహా అధికారుల పనితీరు పట్ల సంతృప్తిగా లేరనే విషయం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైందని అంటున్నారు.

అదలా ఉంటే ముఖ్యమంత్రి అసంతృప్తికి, ఆయన మూడు రోజులఢిల్లీ పర్యటనకు  ఏదైనా సంబంధం ఉందా..  కొన్ని పత్రికల్లో వచ్చినట్లు ప్రభుత్వ పనితీరు పట్ల పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్త చేసిననేపథ్యంలోనే ముఖ్యమంత్రి  అత్త మీది కోపాన్ని దుత్త మీద చూపినట్లు అన్న చందాన అధికారుల మీద చూపించారా  అనే  కొత్త చర్చ మొదలైంది. అలాగే.. ముఖ్యమంత్రి, మంత్రులకు మధ్య  సయోధ్య సరిగా లేదని వస్తున్న కధనాలకు సమాధానంగానే..  ముఖ్యమంత్రి తమ నివాసంలో విందు ఇచ్చారా ? అనే ప్రశ్న కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.