పోస్కో.. ఎవరికెంతో తెలుసుకో! విశాఖ ఉక్కుకు పెద్దల తుప్పు? 

Publish Date:Feb 11, 2021

Advertisement

మీ ఇంట్లో మీకో ఐరన్ షాప్ ఉందనుకోండి. ఆ షాపులో సగ భాగం మీకు పోటీగా ఇంకొకరు ఐరన్ షాప్ పెట్టుకునేందుకు మీరు పర్మిషన్ ఇస్తారా? ఇవ్వనే ఇవ్వరు కదా. మీరే కాదు ప్రపంచంలో ఎవరూ ఆ పని చేయరు. కానీ, కేంద్రం, రాష్ట్రం, విశాఖ ఉక్కు కర్మాగారం కలిసి ఆ పిచ్చి పని చేసేశాయి. ఆ తెలివి తక్కువ నిర్ణయం వెనుక కొందరు తెలివైన పెద్దలకు బోలెడు లాభముందని అంటున్నారు. కేంద్రం, రాష్ట్ర పాలకుల కనుసన్నల్లో.. విశాఖ ఉక్కును మొత్తానికి మొత్తంగా కాజేసే కుట్ర దాగుందని అనుమానిస్తున్నారు. 2 లక్షల కోట్ల విలువైన భూములను అప్పనంగా కొట్టేసే కుతంత్రమంటూ ప్రచారం. కొన్ని వేల కుటుంబాలను రోడ్డున పడేసే ఆ పాపం వెనుక మహా మంత్రాంగమే నడిచిందని చెబుతున్నారు. కొన్ని ఒప్పందాలు, అవి జరిగిన తేదీలు చూస్తుంటే ఈ అనుమానం మరింత బలపడుతోంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ విషయం ముఖ్యమంత్రి జగన్ కు ముందే తెలుసని.. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతోందనేందుకు అనేక ఆధారాలు చూపిస్తున్నారు. రాజ్యసభలో కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన లిఖిత పూర్వక వివరణతో మరింత క్లారిటీ వచ్చేసింది. 

పోస్కో వెనక పక్కా ప్లాన్ !
ఉక్కు కర్మాగారానికి విశాఖలో 22వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సగం మేర కర్మాగార నిర్మాణం ఉంది. మిగతా సగం ఖాళీ భూముల్లో విశాఖ ఉక్కు కంపెనీకి పోటీగా మరో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు దక్షిణ కొరియాకు  చెందిన పోస్కో కంపెనీ ముందుకొచ్చింది. భూమండలం మీద ఇంకెక్కడా స్థలమే లేదన్నట్టు.. అప్పటికే ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి పోటీగా.. ఆ సంస్థ భూముల్లోనే పాగా వేసేందుకు రెడీ అయింది. అందుకు, కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విడ్డూరం. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ సమయానికి జగన్ సీఎంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలీకుండా ఈ ఒప్పందం జరిగే అవకాశమే లేదు. అంటే, జగన్ కు తెలిసే.. పోస్కో వైజాగ్ లో ఎంట్రీ ఇచ్చిందనేగా అర్థం? అందుకు తగిన ఆధారాలు కూడా చూపుతున్నారు. 

అంతా ఆయనే చేశారా?
2019 మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 21న సీఎం జగన్మోహన్ రెడ్డిని పోస్కో ప్రతినిధులు కలిసినట్టు నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. అదే నిజమైతే.. ఈ తేదీలను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే.. 2019 జూన్ 21న జగన్ తో పోస్కో ప్రతినిధుల సమావేశం.. ఆ తర్వాత నాలుగు నెలలకే.. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అగ్రిమెంట్. ఆశ్చర్యకరంగా లేదూ ఈ డీల్. అంటే.. జగన్ కు తెలిసే.. జగన్ ను కలిసే.. జగన్ తో చర్చించాకే.. విశాఖలో పోస్కో పునాది రాయి వేసిందంటున్నారు విశ్లేషకులు. ఇదంతా.. తమకు తెలీదని ప్రభుత్వం తప్పించుకోడానికి లేదు. ఎందుకంటే.. 2020 అక్టోబరు 29న జగన్‌ ను క్యాంప్ కార్యాలయంలో.. పోస్కో సీఎండీ పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు అధికారికంగా కలిశారు. పోస్కో ప్రతినిధులతో సమావేశం తర్వాత ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు  పోస్కో ముందుకు వచ్చిందని ప్రకటించింది. అంటే, పోస్కో మీద రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతమైన ప్రేమ ఉన్నట్టేగా..? పోస్కో జ‌గ‌న్‌రెడ్డిని కలిసిన రెండు రోజుల తరువాత 2020 అక్టోబర్ 31న.. పోస్కో కోసం సీఎం జగన్ విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘ నాయకులతో మాట్లాడారని చెబుతున్నారు. పోస్కోకు సహకరించాలని ముఖ్యమంత్రి కోర‌గా అందుకు కార్మికులు తిరస్కరించారు. 

నష్టాల సాకు.. భూములపై సోకు!
సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఢిల్లీ స్థాయిలో పావులు కదిలాయని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది కేంద్రం. కుక్కను చంపాలంటే ముందుగా దాని మీద పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలంటారు. అప్పుడిక పని మరింత సులువవుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ అదే జరుగుతోంది. 2019 నాటికి 95 కోట్ల లాభంతో నడుస్తోంది RINL. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ తగ్గింది. ఆ ప్రభావం విశాఖ స్టీల్ మీదా పడింది. అన్ని కంపెనీల మాదిరే దీనికీ నష్టాలు తప్పలేదు. ఇది సాకుగా చూపించి మొత్తానికి మొత్తం గంప గుత్తగా అమ్మేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ లో కేంద్రం వంద శాతం ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా ఇనుప గనులు కేటాయిస్తే.. మంచి లాభాల్లో నడవడం ఖాయం. పక్కనే ఒడిషా, చత్తీస్ గఢ్ లో ఐరన్ ఓర్ ఉన్నా వాటిని కేటాయించడానికి అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయని చెబుతున్నారు. ఆ అదృశ్య శక్తులు ఇంకెవరు..?

 విశాఖ ఉక్కు కర్మాగారం ఖాళీ భూములను పోస్కోకు కేటాయించడంపైనే విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఇక RINLను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించడం మరింత వివాదాస్పదంగా మారింది. పక్కనే ఇంటర్నేషనల్ కంపెనీ పోస్కోను పెట్టుకొని.. దానికి పోటీగా RINLలో వాటాలు ఎవరు కొంటారు? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సైతం పోస్కో పరం కావాల్సిందేగా? అంటే.. ముందుగా పోస్కోను రంగంలోకి దించి.. ఉక్కు కంపెనీ పక్కలో బల్లంలా ఉంచి.. విశాఖ ఉక్కు కంపెనీని పూర్తిగా కబ్జా చేసేలా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగిందనేది కార్మికుల అనుమానం. విలువైన భూములను కొట్టేసేందుకే ఇంతటి స్కెచ్ వేశారని అరోపిస్తున్నారు. 22వేల ఎకరాల్లో విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరించి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దీని విలువ కేవలం 2వేల కోట్లు మాత్రమే. కానీ, బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ 2 లక్షల కోట్లకు పైనే. ఇంత ఖరీదైన భూములను, ప్రైవేటీకరణ పేరుతో అతితక్కువ ధరకు కాజేసే ప్రయత్నం జరుగుతోందనేది విపక్షాల మాట. ఈ డీల్ వెనుక జగన్ రెడ్డి, పోస్కో మధ్య పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో నడిచిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటికే ఆరోపించారు. మరి, ఇందులో నిజమెంతో ఆ జగన్ కే ఎరుక..! 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.