సినిమా పేరు: గోదారి గట్టుపైన
నటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, లైలా, సుదర్శన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్
ఎడిటింగ్: అనిల్ పసల
మ్యూజిక్:నాగవంశీ
నిర్మాత:అభినవ్ రావు
సమర్పణ: ఏషియన్ సినిమాస్
బ్యానర్ :రెడ్ పపేట్ ప్రొడక్షన్స్
రచన,దర్శకత్వం: సుభాష్ చంద్ర
రిలీజ్ డేట్ : మే 8 , 2026
అందమైన టైటిల్ తో తెరకెక్కిన 'గోదారి గట్టుపైన' ఈ రోజు థియేటర్స్ లో తన సత్తా చాటడానికి అడుగుపెట్టింది. మూవీపై నమ్మకంతో మేకర్స్ నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో నడుకునే మధ్య తరగతి యువకుడు. చదువు కూడా పెద్దగా అబ్బదు. మాయ (నిధి ప్రదీప్) కొంచం రాష్ గా ఉండే అమ్మాయి. తండ్రి శ్యామ్ బాబు (జగపతి బాబు) అంటే ప్రాణం. శ్యామ్ బాబుకి కూడా కూతురంటే ప్రాణం. సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. తన కూతురు లైఫ్ లాంగ్ బాగుండాలంటే బాగా చదువుకున్న వాడు, స్థితిమంతుడు అల్లుడుగా రావాలనే బలమైన కోరికతో ఉంటాడు. మాయ, రాజు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. కానీ హఠాత్తుగా మాయ బ్రేక్ అప్ చెప్తుంది. మాయ బ్రేక్ అప్ కి కారణమేంటి? మాయ నిర్ణయంతో రాజు ఏం చేసాడు? శ్యామ్ బాబు కోరిక నెరవేరిందా? లేక రాజు, మాయ ఒక్కటవుతారా లేదా? అనేదే గోదారి గట్టుపైన
ఎనాలసిస్
ఈ కథలో ఏం కొత్త పాయింట్ ఉందని తెరకెక్కించారో అర్ధం కాదు. ఇలాంటి కథలు రాని శుక్రవారం లేదు. సీన్స్ పరంగా చూసుకున్నా,క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నా ఏ ఒక్క అంశం మెప్పించలేదు. ఇలాంటి చిత్రాలకి కామెడి సూపర్ గా ఉండాలి. కానీ ఒక్క కామెడీ సీన్ కూడా పండదు. గోదారి గట్టుపైన అనే అందమైన టైటిల్ ని పెట్టుకొని గోదారి అందాలని కూడా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్టార్టింగ్ సన్నివేశాలతో మంచి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సీన్ బై సీన్ వచ్చే కొద్దీ నీరుగారిపోతుంటాం. మాయ, రాజు మధ్య పరిచయం సీన్స్ కొత్తగా ఉన్నాయి. ఆ తర్వాత రొటీన్ గా సాగాయి. సాగడమే కాదు స్వచ్ఛమైన ప్రేమ కాకుండా ఆకర్షణ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సుదర్శన్, రాజ్ కసిరెడ్డి, రాజు అండ్ బ్యాచ్ మధ్య వచ్చిన కామెడీ సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. శ్యామ్ బాబు,మాయ మధ్య సీన్స్ కూడా రొటీన్. ఇంటర్వెల్ సీన్ పెద్దగా పేలింది లేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే శ్యామ్ బాబు కి మాయపై అనుమానం వచ్చిన తర్వాత కధనం స్పీడ్ గా వెళ్తుందని అనుకుంటాం. కానీ ప్రతి సన్నివేశం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ నే బెటర్ అనుకుంటాం. అనవసరమైన సీన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాజు చెల్లలి పెళ్లి ఎపిసోడ్ నే అంధుకు ఉదాహరణ. ప్రీ క్లైమాక్స్ లో రాజు మంచి తనాన్ని ఎలివేట్ చెయ్యడానికి వచ్చిన సీన్ మాత్రం సో సో. క్లైమాక్స్ మాత్రం సూపర్. తండ్రి,కూతురు డ్రామాలు ఆడుతున్నారనే సదరు క్లైమాక్స్ పాయింట్ నే బేస్ చేసుకొని గోదారి గట్టుని ప్రారంభం నుంచి అందంగా మలుచుకోవాల్సింది
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
రాజుగా సుమంత్ ప్రభాస్ పెర్ఫార్మ్ లో పెద్దగా మెరుపులు లేవు. క్యారక్టర్ కి మాత్రం సెట్ అయ్యాడు. నిధి ప్రదీప్ తన క్యూట్ పెర్ఫార్మ్ తో మెప్పించింది. కళ్ళతోనే తన భావాలు పలికించిన తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. మూవీ మొత్తానికి తన నటనే హైలెట్. జగపతి బాబు, దేవిప్రసాద్ తమ పరిధి మేరకు బాగానే చేసారు. మిగతా వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఓవర్ యాక్టింగ్ అని అర్థమయ్యేలా తన పెర్ఫార్మ్ చూపించారు. సుభాష్ చంద్ర దర్శకుడిగా, రచయితగా పర్ఫెక్ట్ గా ఫెయిల్ అయ్యాడు. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు కూడా అదే పరిస్థితి.
బలాలు
1 . హీరో, హీరోయిన్ మధ్య నడిచిన కొన్ని సీన్స్
2 . తండ్రి విషయంలో హీరోయిన్ తీసుకునే నిర్ణయం
3 . హీరోయిన్ పెర్ ఫార్మెన్స్
4 . క్లైమాక్స్
బలహీనతలు
1 . కథ, కథనం
2 . దర్శకత్వం
3 . మ్యూజిక్
4 .ఫొటోగ్రఫీ
5 . హీరో క్యారక్టరేజేషన్
6 . కామెడీ
చివరిగా చెప్పాలంటే గోదారి గట్టుకి అందరు కలిసి అన్యాయం చేసారు. ఒక్క హీరోయిన్ తప్ప .
రేటింగ్ 2 .25 /5 అరుణాచలం