కాంగ్రెస్ ఆఫర్ పీకే ఎందుకు కాదన్నారు?
Publish Date:Apr 28, 2022
Advertisement
పీటల దాక వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే, అందుకు పెద్ద కారణమే ఉండి ఉంటుంది, లేదంటే అందాక వచ్చిన పెళ్లి ఆగిపోదు.అందుకే,కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గడపదాకా వచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎందుకు వెనక్కి వెళ్లారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీకే వెనక్కి వెళ్ళిపోవడం వెనక కూడా చాలా పెద్ద కారణమే ఉండి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి, పీకే కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తాలు వచ్చిన నేపధ్యంలో హస్తం పార్టీలో కొంత ఉత్సాహం కనిపించింది. కొంతవరకు అయినా కష్టాలు తీరినట్లే అనే ఆశలు చిగురించాయి. అలాగే, ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో మంతనాలు జరపడంతో హస్తవాసి మారుతుందన్న ఆశలూ బలపడ్డాయి. పార్టీ నాయకులు,కార్యకర్తలతో పాటుగా సామాన్య ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల ఆసక్తి చూపించారు. మీడియాలో విస్తృతంగా చర్చలు జరిగాయి. పీకే ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయన్న చర్చ జోరుగా సాగింది. పీకేకున్న ట్రాక్ రికార్డు కారణంగా కావచ్చును ఆయన మూలంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మెరుగుపడుతుందనే ఆశ ఆ పార్టీ వాదుల్లో తొణికిసలాడింది. అయితే చివరకు పీకే, గడపదాకా వచ్చి గుడ్ బై’ చెప్పి వెళ్ళిపోయారు. ఈనేపధ్యంలో, ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. పీకే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు? అంతలోనే ఎందుకు కాదనుకున్నారు? అనే చర్చ ఇప్పుడు అదే స్థాయిలో జరుగుతోంది. అయితే, కర్ణుడి చావుకు లాగా., పీకే ఫీచేముడ్’కు కూడా అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ కోరుకున్న పోజిషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదని, అందుకే ఆయన పార్టీలో చేరేందుకు నిరాకరించారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అదొక్కటే కారణమా, అంటే కాదుట, ఇంకా చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో, ఒకటి ప్రియాంక ఫాక్టర్. కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకు ఇవ్వాలని పీకే చేసిన సూచన, అందరి సంగతి ఎలా ఉన్నా. సోనియా గాంధీకే రుచించలేదని, ఏదో విధంగా రాహుల్ గాంధీకి పార్టీని అప్పగించాలని, అందుకోసమే ఆమె పీకే పార్టీలోకి ఆహ్వానించారని అయితే, పీకే కూడా రాహుల్ కంటే ప్రియాంక బెస్ట్ ఛాయిస్ అవుతారని సూచించడమే కాకుండా, ప్రధాని అభ్యర్దిగానూ రాహుల్ గాంధీ కాకుండా వేరొకరిని ప్రతిపాదించాలని సూచించారని అంటున్నారు. అయితే, ప్రియాంకకు పగ్గాలు అప్పగించడం సోనియా ఇష్టం లేదని అందుకే ఆమె, కావాలనే పీకేను పోమ్మనకుండానే పంపించారని అంటున్నారు. అదలా ఉంటే, ఇప్పుడు తాజాగా, పార్టీ పగ్గాలు టం చేయి దాటకుండా చూసుకునేందుకు సోనియా గాంధీ కొత్తగా పార్టీ సీనియర్ నాయకుడు, సోనియా నమ్మినబంటు, ఏకే ఆంటోనీ తెర మీదకు వచ్చారు. నెహ్రూ-గాంధీ కుటుంబం కాంగ్రెస్‌కు మార్గదర్శనం చేసే శక్తి అని పేర్కొన్నారు. ఆ కుటుంబీకులు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో 99 శాతం మందికి ఆ పార్టీ ఆమోదయోగ్యం కాదన్నారు. అంటే, నాయకత్వ మార్పుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని మరోమారు స్పష్టమైందని అంటున్నారు. ఈ నేఅప్ధ్యంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందనేడి కాలమే నిర్ణయించవలసి ఉంటుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-pk-refused-congress-offer-39-135106.html





