అమ్మ భాషపై మరో కుట్ర! జగన్ రెడ్డి కొత్త కథ?
Publish Date:Jul 12, 2021
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగు భాషంటే, ఏహ్య భావం, అసహ్యం, ఛీ ... ఇదీ ఒక భాషేనా అనే చులక భావం,తెలుగు భాషను శాశ్వతంగా సమాధి చేయాలనే సంకల్పం నిజంగా ఉన్నాయో లేవో గానీ, ఆయన చర్యలు, ఆయన ప్రభుత్వంతీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం,అలాగే ఉంటున్న్నాయి. బహుశా ఆయన చిన్న తనంలో, తెలుగు పదం నోటెంట వస్తే మూతికి వాతలు పెట్టే క్రైస్తవ మిషనరీ స్కూల్స్’లో చదువుకున్నారో ఏమో మనకు తెలియదు,కానీ, గత రెండేళ్లుగా ఆయన తెలుగు భాషను చావచితక కొట్టే నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ముందున్నారు. అధికారంలోకి వస్తూనే, పేదరిక నిర్మూలనకు ఇంగ్లిష్ మీడియం చదువులు దివ్య ఔషధం అన్నట్లుగా, ఆ వంకన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ 81, 85 జీవోలను జారీ చేశారు. అదేమంటే తల్లి తండ్రుల కమిటీలు కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇంకో అడుగు ముందుకేసి, పేద పిల్లలు పైకి రావడాన్ని ప్రతిపక్షాలు, భాషా పండితులు అడ్డుకుంటున్నారని విరుచుకు పడ్డారు. అయితే హైకోర్టు ఆ జీవోలను రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని హై కోర్ట్ గట్టిగా అక్షింతలు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి గట్టిగా తలంటింది. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత చూసినా.. 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్, విద్యా జాతీయ విధానం, ఇతర నివేదికల మేరకు నిస్సందేహంగా 1 నుంచి 8వ తరగతి వరకు బోధనా మాధ్యమం తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నాయని హైకోర్టు తెలిపింది. అందువల్ల ఈ జీవోలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కావని పేర్కొంటూ ధర్మాసనం ఏకంగా 92 పేజీల తీర్పు వెలువరించింది. తెలుగు భాష గొప్పతనం తెలుసుకునే తీరిక, ఓపిక ఆ రెంటినీ మించి అవగాహన లేకపోవడం వలన చేత కావచ్చు, అప్పుడు, గుడ్డిగా తెలుగు బోధనపై వేటు వేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పడు,తెలుగు అకాడమీ పేరును రాష్ట్ర తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చింది. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఏమో కానీ, మాజీ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర సభ ఉప సభాపతి మండలి బుద్ధా ప్రసాద్ సహా అనేక మంది తప్పు పట్టారు.చంద్రబాబు నాడు అన్నట్లుగా జగన్ రెడ్డి తెలుగు అకాడమీ అంటే అదేదో తెలుగు దేశం పార్టీకి సంబందించింది అనుకున్నారో ఏమో,ఒక్క సరిగా తెలుగు అకాడమీ పేరును మార్చేశారు. నిజంగా సంస్కృత భాషను ప్రోత్సహించాలనుకుంటే, అందుకోసం ప్రత్యేకంగా మరో అకాడమీని ఏర్పటు చేయవచ్చును, కానీ, ముఖ్యమంత్రి ఉద్దేశం అది కాదు,తెలుగు అకాడమీ చుట్టూ ఒక వివాదాన్ని సృష్టించి తెలుగు భాషనూ, అకాడమీని చులకన చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకే ప్రభుత్వం తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని జోడించడంతో పాటుగా, అకాడమీ పాలకమండలికి తెలుగుభాష, సైన్సు, సోషల్ సైన్సు, వృత్తి విద్య సబ్జెక్టుల్లో ప్రత్యేక పరిజ్ఞానమున్న నలుగురు సభ్యులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. అందుకే తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిది కాదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. అలాగే, ముఖ్యమంత్రి జగన్ తెలుగు అకాడమీ చరిత్ర, లక్ష్యాలను తెలుసుకోవాలని, బుద్ధప్రసాద్ హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో 1968లో తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారని.. పరిశోధనలు, ఆధునీకరణ, భాషా వ్యాప్తికి కృషి చేయడం ఈ సంస్థ లక్ష్యమని గుర్తు చేశారు. అప్పటి విద్యా శాఖ మంత్రి పీవీ నరసింహారావు తెలుగు అకాడమీకి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు, ‘మన మాతృభాషను గౌరవించుకోవడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాల్సింది పోయి, తెలుగు భాషను అంతం చేయడానికి పుట్టినట్లు వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికే మాతృభాష మాధ్యమానికి మంగళం పాడారు. ఇక తెలుగు సంస్థల వంతు వచ్చినట్లుందని , బుద్ధా ప్రాసాద్ అవేదన్ వ్యక్తం చేశారు.అయితే, ముఖ్యమంత్రి లక్ష్య, గమ్యం వేరు. ఆ దేవుడు చెప్పిందే వేదం.. అయితే,ఆయన లక్ష్యం అంట తేలిగ్గా నెరవేరేది కాదు. అయినా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుగు భాషా ద్వేషం ఏమిటో .. ఎందుకో ..
ఒక ప్రాంతీయ భాషగా, మాతృ భాషగా తెలుగుకు ఎంతో చరిత్ర వుంది. తెలుగు భాష అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఏంటి కృషి చేశాయి. బహు భాషా కోవిదుడు పీవీ నరసిమః రావు, రాష్ట్ర విద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, తెలుగు భాషాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను చర్చించి మార్గదర్శనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ‘అధికార తెలుగు భాషా సంఘం, తెలుగు అకాడమి’ ఆవిర్భవించాయి. కమిటీ సిఫారసుల మేరకే ప్రాథమిక, ఉన్నత విద్యలో తెలుగు బోధనా మాధ్యమంగా నిర్ణయించారు.
http://www.teluguone.com/news/content/why-jagan-reddy-change-telugu-acadamy-name-25-119413.html





