కారెక్కనున్న కాంగ్రెస్ సీనియర్ ఎవరు?
Publish Date:Jul 12, 2021
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారక రామా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ మున్సిపాలిటీల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇతర చోటా మోటా నాయకులు తెరాసలో చేరిన సదర్భంగా .. వీళ్ళే కాదు,సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు సైతం తెరాస వైపు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. అయితే, ఆనేతలు ఎవరన్నది అయన చెప్పలేదు. కేటీఆర్ ప్రకటనతో ఆ నేతలు ఎవరన్న దానిపై ఉహాగానాలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే పీసీసీ మాజీ అధ్యక్షుడ ఉత్తమ కుమార్ రెడ్డి బంధవు, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు,ఆయనే,హుజూరాబాద్ నుంచి పోటీ చేసే తెరాస అభ్యర్ధిగా ప్రకటించుకున్న ఆడియో ఒకటి పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి తెరాసలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో కేటీఆర్ చెప్పినట్లు టీఆర్ఎస్ లో చేరబోతున్న సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు ఎవరు అని చూస్తే.. ఉత్తమకుమార్ రెడ్డే కావచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో వినవస్తోంది. ముందు తమ బంధువర్గాన్ని ఆ తర్వాత తమ అనుచర గణాలను కారెక్కించి, చివరాఖరులో ఉత్తమ్ కుమార్ కూడా కారెక్కేస్తారా అన్న అనుమానాలు కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఉత్తమ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్’ కి మధ్య గుడ్’నైట్ రిలేషన్స్ ఉన్నాయని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సో. కేటీఆర్ చెప్పిన, తెరాస వైపు చూస్తున్న సుదీర్ఘ అనుభవం ఉన్నసీనియర్ నాయకు దు ఆయనేనా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా నియమించినప్పుడే, కాంగ్రెస్ అధినాయకత్వం, ఇలాంటి పరిణామాలు ఉంటాయని ఉహించిందని, సీనియర్ నాయకులు కొందరు చికాకులు సృష్టిస్తారని తెలిసినా, పార్టీ భవిష్యత్ దృష్ట్యా పార్టీని పైకి తీసుకు పోయే సత్తా ఉన్న రేవంత్ రెడ్డికి పట్టం కట్టాలని నిర్ణయించిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/uttamkumar-reddy-will-join-trs-soon-25-119416.html





