నందిగం సురేష్ దగ్గరకి జగన్ ఎందుకు వెళ్తున్నట్టో...?!

Publish Date:Sep 10, 2024

Advertisement

వైసీపీ నాయకుడు జగన్ ప్రస్తుత రొటీన్ ఏంటంటే... తాడేపల్లి, బెంగళూరు, లండన్ మధ్య ఆసులో కండెలాగా తిరగడం... రాజకీయాలు చేయడానికి శవాల కోసం అన్వేషించడం... కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా విషం కక్కాలా అని ఆలోచించడం, జైల్లో పడుతున్న తన పార్టీ నాయకులను పరామర్శించి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మీద నోరు పారేసుకోవడం... ఇదీ ఆయన టైమ్ ‌టేబుల్. ఈ టైమ్‌ టేబుల్‌లో భాగంగానే జగన్ బుధవారం నాడు గుంటూరు జైలుకు వెళ్ళనున్నారన్న వార్తలు వస్తున్నాయి. 2021లో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా వున్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. ఆటలో అరటిపండు, పాటలో పనసపండు లాంటి అవుతు శ్రీనివాసరెడ్డిని పక్కన పెడితే, జగన్ ఇప్పుడు గుంటూరు జైలుకు ముఖ్యంగా వెళ్తున్నది నందిగం సురేష్‌ని పరామర్శించడానికి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, నిజానికి జగన్ గుంటూరు జైలుకు వెళ్తున్నది, నందిగం సురేష్‌తో మిలాఖత్ అవుతున్నది ఆయన్ని పరామర్శించడానికా? లేక తనతో మిలాఖత్ అయి చేసిన ఘోరమైన నేరం విషయంలో తన పేరు బయట పెట్టొద్దని బెదిరించడానికా? ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.

అధికారంలో వున్నంతకాలం జగన్ తన విధ్వంస కార్యకలాపాలను నిర్వహించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలను దారుణంగా వాడేశారు. వాళ్ళని వీధి రౌడీలకంటే కింద స్థాయికి దిగజార్చేసి, తెలుగుదేశం నాయకులను దుర్భాషలాడటానికి, దాడులు చేయడానికి ఉపయోగించారు. అందులో భాగంగానే నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. రాజకీయంగా ఏ స్థాయీ లేని తనను ఎంపీ చేసిన జగన్ అంటే నందిగం సురేష్‌కి చెప్పలేనంత అభిమానం. అందుకే జగన్ చూసిరమ్మంటే కాల్చి వచ్చేస్తూ వుంటారు. అధికారంలో వున్నప్పుడు ఇలాంటి పనులు ఎన్నో చేసిన నందిగం సురేష్, అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ చెప్పినట్టే చేశారు. అదేంటో తెలుసా? కృష్ణా బ్యారేజ్‌ ధ్వసం అయ్యే విధంగా బోట్లను వదలటం. 

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రకాశం బ్యారేజ్‌ని బోట్లు ఢీకొనడం వెనుక జగన్ హస్తం వుంది. జగన్ ఆదేశించారు. వైసీపీ నాయకులు ఆచరించారు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి బోట్లను అడ్డంగా పెట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చాలని సజ్జలకు జగన్ చెప్పారు. అదే విషయాన్ని నందిగం సురేష్, తలశిల రఘురాంలకు సజ్జల వాట్సాప్ కాల్ ద్వారా చెప్పారు. వరద నీటిలో బోట్లను వదిలిన అనంతరం పని అయిపోయిందని సజ్జలకి తలశిల రఘురాం, నందిగం సురేష్ వివరించారు. కాబట్టి, ప్రకాశం బ్యారేజ్‌ని ధ్వంసం చేయడం ద్వారా లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసే కుట్ర జగన్ దగ్గర ప్రారంభమైంది. సజ్జల, నందిగం సురేష్, తలశిల రఘురాం తదితరుల ద్వారా అమల్లోకి వచ్చింది. కొండపైన కొలువుండి అంతా చూస్తు్న్న కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఈ ఘోరం జరగక్కుండా ఆగింది.

ప్రస్తుతం గుంటూరు జైల్లో వున్న నందిగం సురేష్ చాలా డిప్రెషన్లో వున్నట్టు తెలుస్తోంది. అట్టడుగు స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి.. ఇప్పుడు ‘ఎస్ బాస్’ అంటూ ఏ అడ్డమైన పని చెప్పినా చేసే ఒక కిరాయి రౌడీ స్థాయికి దిగజారి జైల్లో పడ్డానే అన్న బాధలో ఆయన వున్నట్టు తెలుస్తోంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్టు సమాచారం. ఇలాంటి మానసిక పరిస్థితిలో ఆయన ఇక ఇలాంటి జీవితం వద్దు అనుకుని మారిపోతే పరిస్థితి ఏమిటి? అప్రూవర్‌గా మారిపోయి తనతో ఈ నేరాలన్నీ చేయించింది జగన్ అనే విషయాన్ని స్పష్టంగా చెబితే ఏమవుతుంది? ఇంకేమవుతుంది? జగన్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఈ ప్రమాదాన్ని ఊహించిన జగన్ ప్రకాశం బ్యారేజ్ ఘటన వెనుక వున్నది నందిగం సురేష్ హస్తం అనే విషయం బయటపడుతూ వుండగానే, అప్పటి వరకు లేని గుంటూరు జైలుకు వెళ్ళి నందిగం సురేష్‌ని పరామర్శించే ప్రోగ్రామ్‌ని సడెన్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు జగన్ గుంటూరు జైలుకు వెళ్తున్నది నందిగం సురేష్‌తో మిలాఖత్ అయి పరామర్శించడానికి కాదు... ప్రకాశం బ్యారేజ్ బోట్ల ప్రమాదం విషయంలో తనతో నందిగం సురేష్ మిలాఖత్ అయిన విషయం బయటపెట్టొద్దని బెదిరించడానికే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.