పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య ప్రేమ ఎందుకు తగ్గుతుంది? ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?
Publish Date:Sep 20, 2025
Advertisement
వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ, ఉత్సాహం, ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం, బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు. దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం, గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు. పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు, పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి. ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు, ఇతర పనుల మధ్య, ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి, ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను, సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది. ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య మునుపటిలా ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు. ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా ఇద్దరూ సంతోషంగా ఉండటానికి మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం... డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది. అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది. సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/why-does-love-between-husband-and-wife-diminish-after-a-few-years-of-marriage-35-206528.html





