తల్లిదండ్రులు ఈ అలవాటు వదిలిస్తే.. పిల్లల జీవితం ఎంత బాగుంటుందో..!
Publish Date:Feb 16, 2026
Advertisement
పోల్చడం.. పిల్లలను ఇతరులతో పోల్చడం అనేది ముఖ్యంగా భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారు మరింత ఉత్సాహం తెచ్చుకుని చదువుతారు, మంచి పనులు చేస్తారు అనుకుంటే పొరపాటు. దానికి బదులుగా పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలను ఇతరులతో పోల్చే అలవాటు మానుకోవాలి. ఇష్టాలు రుద్దడం.. తరచుగా తల్లిదండ్రులు తాము సాధించలేక పోయిన కలలను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. మాకు అవకాశం, ఆర్థిక స్థితి సహకరించలేదు, అందుకే మేము సాధించలేకపోయాము, కాబట్టి మీరు వీటిని సాధిస్తే సంతోషం అని చెబుతుంటారు. దీనివల్ల పిల్లలు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోలేకపోతారు,నచ్చిన పని చేయలేకపోతారు. ఇది జీవితాంతం అసంతృప్తికి దారితీస్తుంది. పిల్లలకు మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. అలాగే వారికి నచ్చిన వృత్తిని ఎంచుకునే అవకాశం ఇవ్వడం వారి తల్లిదండ్రుల బాధ్యత. జోక్యం.. పిల్లల జీవితంలోని ప్రతి అంశంలోనూ తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవడానికి తరచుగా ఆంక్షలు విధిస్తారు, కానీ నిరంతరం ఇలా వ్యవహరించడం వల్ల పిల్లలు బలహీనపడతారు.తమకు స్వేచ్ఛ లేదని, తమ ఇష్టాలతో తల్లిదండ్రులకు పని లేదని అనుకుంటారు. తల్లిదండ్రులకు ఎదురు తిరిగే వైపుగా ఈ పరిస్థితి దారితీస్తుంది. పర్పెక్ట్ గా ఉండాలని అనుకోవడం.. పిల్లలు చదువులో రాణించాలి, ఆటలు, ఇతర యాక్టివిటీస్.. ఇలా ప్రతిదానిలోనూ పర్పెక్ట్ గా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. అలా చేయడం వల్ల బిడ్డ ఒత్తిడికి గురవుతాడు. ఎవరూ పర్పెక్ట్ గా ఉండరు అనే విషయం గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా లేనప్పుడు పిల్లలు ఉండాలని అనుకోవడం ఎంత వరకు సమంజసం. మనుషులు తప్పులు చేయడం, తప్పులు చేసిన తర్వాత అనుభవాల నుండి నేర్చుకోవడం చేస్తారు. కాబట్టి పిల్లలు అన్నింటిలో పర్పెక్ట్ గా ఉండాలని కోరుకోవడం తప్పు. *రూపశ్రీ.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు అన్ని ఆనందాలను పొందాలని, జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు. అందుకే నేటికాలంలో మేము కష్టాలు పడినా, మా పిల్లలు కష్టపడకూడదు అనుకునే తల్లిదండ్రులే ఎక్కువ. అయితే తల్లిదండ్రులు చాలా వరకు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, తమకు తెలియకుండానే తమ పిల్లల ఆనందాన్ని దెబ్బతీసే తప్పులు చేస్తారు. తల్లిదండ్రులలో అలాంటి అలవాట్లు ఉంటాయి. వెంటనే ఆ అలవాట్లు వదిలేస్తే తమ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. పిల్లల జీవితం ఎంతో బాగుంటుంది. తల్లిదండ్రులు వీలైనంత తొందరగా వదులుకోవాల్సిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/habits-parents-need-to-give-up-for-their-child-35-214166.html





