భజన చేసేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే..!

Publish Date:Jan 18, 2024

Advertisement

 దేవాలయాలలో కానీ, ఇళ్లలో కానీ, సత్సంగాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ దేవుళ్ల భజన చేస్తన్నప్పుడు, కీర్తనలు ఆలపిస్తున్నప్పుడు భక్తులు ఆనంద పారవశ్యం అవుతూ చప్పట్లు కొడుతుంటారు. అసలు ఇలా చప్పట్లు కొట్టే ఆచారం ఎప్పుడు ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

మతపర ప్రాముఖ్యత..

గ్రంధాల ప్రకారం చప్పట్లు కొడుతూ భజన లేదా కీర్తనలు చేయడం, హరినామాన్ని జపించడం వల్ల పాపాలు తొలగిపోతాయని అంటారు. చెట్టు కింద నిలబడి చప్పట్లు కొట్టగానే చెట్టు పైనున్న పక్షులన్నీ ఎలాగైతే ఎగిరిపోతాయో.. అదేవిధంగా  చప్పట్లు కొట్టడం, హరినామాన్ని జపించడం వల్ల  మనిషిలో ఉన్న భౌతిక విషయాల మీద వ్యామోహాలు ఎగిరిపోతాయట.

సాధారణంగా గుడిలో గంట కొట్టి దేవుడికి తమ ఉనికిని తెలియజేయడం అని  ఒక నమ్మకం. అయితే అదే విధంగా చప్పట్లతో కూడిన భజన దేవుడి దృష్టి భక్తుల వైపు మళ్లేలా చేస్తుందని నమ్ముతారు. భజన, కీర్తన లేదా హారతి సమయంలో చప్పట్లు కొట్టడం ద్వారా భక్తులు తమ బాధలను చెప్పుకోవడానికి దేవుణ్ణి పిలుస్తారని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల భగవంతుని దృష్టి భక్తుల వైపు మళ్లుతుంది. భజన-కీర్తన లేదా ఆరతి సమయంలో చప్పట్లు కొట్టడం ప్రతికూలతను తొలగిస్తుంది.  మనస్సుకు శాంతిని కూడా ఇస్తుంది.  మనిషి స్పృహలో ఉండగలుగుతాడు. వ్యక్తి  దృష్టి భగవంతునిపై కేంద్రీకృతమై ఉంటుంది.

పురాణాలు ఏం చెతున్నాయి..

పురాణాల ప్రకారం  హిరణ్యకశ్యపుని తనయుడు అయిన ప్రహ్లదుడు సంగీత వాయిద్యాలు వాయిస్తూ విష్ణునామ స్మరణ చేస్తన్నాడు.    ఇది హిరణ్యకశ్యపుడికి మింగుడు పడలేదు.  ప్రహ్లదుడిని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా  హరణ్యకశ్యపుడు నెగ్గలేదు. తను ఓడిపోయాననే  కోపంలో హిరణ్యకశ్యపుడు  ప్రహ్లదుని  వాయిద్య పరికరాలు అన్నీ ధ్వంసం చేసాడు. కానీ ప్రహ్లదుడు మాత్రం తన హారినామ స్మరణ మానలేదు. తన చేతులనే వాయిద్య పరికరాలుగా మార్చి చప్పట్లు కొడుతూ హరినామస్మరణ చేయడం మొదలు ప ెట్టాడు. ఇదే తాళం అనే లయను సృష్టించింది. అప్పటి నుండి భజనలలోనూ, కీర్తనలలోనూ తాళం వేయడం, తప్పట్లు కొట్టడం సంప్రదాయంగా మారిందని చెబుతున్నారు.

శాస్త్రీయ కారణాలు..

మన అరచేతుల్లో చాలా ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. చప్పట్లు కొట్టేటప్పుడు అరచేతుల ఆక్యుప్రెషర్ పాయింట్లపై ఒత్తిడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది శరీరంలోని అనేక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.  కాబట్టి చప్పట్లు కొట్టడం ఒక అద్భుతమైన వ్యాయామం. ఇది శరీరంలో  నిష్క్రియాత్మకతను తొలగిస్తుంది.  శరీర  కార్యకలాపాలను పెంచుతుంది. రక్త ప్రసరణలో అడ్డంకులు తొలగిపోయి అవయవాలు సక్రమంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. రక్త శుద్ధి పెరిగి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు నయమవుతాయి. అందువల్ల, పూజ,  కీర్తన సమయంలో లయబద్ధంగా  శక్తితో చప్పట్లు కొట్టడం వల్ల  వ్యాధులను తరిమికొట్టడం కూడా సులువు. ఇది ఏకాగ్రతను,  ధ్యానం చేయడాన్ని కూడా  సులభతరం చేస్తుంది.

                                    *నిశ్శబ్ద. 

By
en-us Political News

  
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.