సోరెన్ కో న్యాయం , జగన్ కో న్యాయం .. ఇదెక్కడి అన్యాయం ?
Publish Date:Aug 27, 2022
.webp)
Advertisement
చట్టం ముందు అందరూ సమానమే, కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టిలో కొందరు ఎక్కువ సమానం.అవును,ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్’ అధికార దుర్వినియోగానికి పాల్ప డ్డారనే ఆరోపణపై, కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పై కొరడా ఝుళిపించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.
అయితే, ఇంతకీ సోరెన్ చేసిన నేరం ఏమిటి? ఎన్నికల సంఘం ఆయనపై వేటుకు ఎందుకు సిఫార్సు చేసింది? అంటే, ముఖ్యమంత్రి సోరెన్ తనకు తానే మైనింగ్ కేటాయించుకుని,అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారనే ఆరోపణపై ఎన్నికల సంఘం విచారణ జరిపింది. ఆరోపణలు నిజమని తేలడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈసీ ఆ రాష్ట్ర గవర్నర్’ కు సూచించింది. గవర్నర్ సోరెన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.
ఇంతవరకు అంతా బాగుంది. కానీ, సోరెన్’కు వర్తించే చట్టం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదు అనేదే, ఇప్పుడు అందరిముందున్న ప్రశ్న. నిజానికి, జగన్ రెడ్డి, ముఖ్య మంత్రిగా కాదు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమారుడి హోదాలోనే అనేక అక్రమాలకు పాల్పడ్డానే ఆరోపణలున్నాయి. పదికి పైగా అక్రమాస్తుల కేసుల్లో ఆయన ‘ఎ వన్’ గా ఉన్నారు. అరెస్టయ్యారు. పదహారు నెలలు జైల్లో ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జగన్ రెడ్డి ఆస్తులు కొన్నింటిని జప్తు చేసింది. ఈరోజుకు కూడా ఆయన బైలు మీదనే ఉన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసి ఉన్నా, ఏదో ఒక సాకున వ్యక్తిగత హజరు నుంచి మినహాయింపు పొదుతు న్నారు.
అదెలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి, సోరెన్ బాటలోనే పయనిస్తున్నారు. నిజానికి, సోరెన్ బాటలో జగన్ కాదు జగన్ బాటలోనే సోరెన్ తప్పటడుగులు వేస్తున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడు సంవత్సరాల కాలంలో, జగన్ రెడ్డి ఫ్యామిలీ వ్యాపారాలకు ప్రభుత్వ నిధుల కేటాయిం పులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పత్రిక సాక్షికి.. నేటికీ నెలకు రూ. ముఫ్పై కోట్ల వరకూ ప్రజాధనం ప్రకటనల రూపంలో పంపిణీ అవుతూ ఉంటుంది.
పల్నాడులో ఇంత వరకూ కట్టని సరస్వతి పవర్ పరిశ్రమకు పెద్ద ఎత్తున గనుల కేటాయింపులు చేసుకున్నారు. నీటి కేటాయింపులు కూడా చేసుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున కొంటున్న సిమెంట్ లో అత్యధికం భారతీ సిమెంట్‌దే. ఇలా చెప్పుకుంటూ పోతే..జార్ఖండ్ సీఎం సోరెన్ చేసింది చాలా చిన్న తప్పు.
అందుకే, ఒక్క తప్పు చేసిన సోరెన్ అనర్హుడు అయితే, జగన్ ఎలా అర్హుడవుతారు? సోరెన్’కు ఒక రూలు జగన్ రెడ్డికి మరో రూలు, ఏమిటి? ఇదెలా న్యాయం అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రధాని మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులోట్టు తున్నారు, కాబట్టి ఆయన జోలికి రావడం లేదని, సోరెన్ విపక్ష శిబిరంలో ఉన్నారు కాబట్టే ఈసీ,ఆయన మెడ మీద కట్టి పెట్టిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-difference-in-justice-25-142750.html












