అంబటి రాంబాబుపై రాజమహేంద్రవరంలో కేసు

Publish Date:Feb 21, 2026

Advertisement

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాజమహేంద్రవరంలో తాజాగా  కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసులు నమోదు చేశారు. కారణమేంటంటే.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో   18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు బెయిలుపై జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఈ నెల 19న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీ రాజమహేంద్ర వరం నుంచి గుంటూరు వరకూ సాగింది. అయితే రాజమహేంద్రవరంలో భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించరాదంటూ పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక  సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా  రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018 ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా ధాఖలు చేసిన పరువునష్టం కేసు సుల్తాన్ పూర్ లోని ప్రజాప్రతినిథుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.
రాజకీయాల్లో నానాటికీ తీసికట్టుగా మారుతున్న సంస్కారంపై డోలేంద్ర ప్రసాద్ గుర్రానికి, గాడిదకి తేడా ఏంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో గత జగన్ పాలనలో చోటుచేసుకున్న పరిణామాలు, భాషా ప్రయోగం, రాజకీయాలలో హుందాతనాన్ని తిరిగి తీసుకురావడంలో ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతలపై పలు సూచనలు చేశారు.
ఈ ఏడాది మే మొదటి వారంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.