మహమ్మద్ ప్రవక్త మేకలు ఎందుకు పెంచుకున్నాడు?
Publish Date:Sep 27, 2024
Advertisement
జాఫర్ బాయ్ ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చాడు. మౌలానా: అల్లా సందేశాన్ని మానవాళికి చేరవేసిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఇటీవలె ఆయన జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. మహమ్మద్ ప్రవక్త దగ్గర అనేక రకాల పెంపుడు జంతువులు ఉండేవి. . వీటిలో కుక్క లేదు. కుక్క విశ్వాసం గల జంతువు కాని పెంచుకునే జంతువు కాదు. కుక్క వల్ల మనిషికి అనర్థాలు కూడా ఎక్కువే. కుక్క మాంసాహారి. మాంసాహార జంతువుల్లో కోపం కూడా ఎక్కువ. కోపం ఎక్కువైతే యజమానినే కొరుక్కు తింటుంది. చాలాదేశాల్లో కుక్క వల్ల యజమాని చనిపోయిన వార్తలు పత్రికల్లో చూస్తున్నాం. కుక్క మల మూత్రాల వల్ల దాన్ని పెంచుకున్న యజమానులు అనారోగ్యపాలవుతారు. మహమ్మద్ ప్రవక్త మేకల మందను మేపే వాడు. మేకల వల్ల అనేక లాభాలున్నాయి. మేకలు పెంచుకోవడం వల్ల ఓపిక, సహనం పెరుగుతుంది. అల్లాతో ప్రేమ పెంచుకున్నవాళ్లమవుతాం. మేకలు పెంచుకోవడం వల్ల ఇంట్లో చెత్తా చెదారం మాయమవుతుంది. కిచెన్ వేస్ట్ తిని పెట్టి మేకలు మనకు మేలు చేస్తాయి. మేక వ్యర్థాల వల్ల అనారోగ్యం చెందే అవకాశం లేదు. మేకలు పెంచుకునే క్రమంలో సహనం పెంచుకునే అవకాశముంది. ప్రకృతికి ఎంత దూరం ఉంటే అనారోగ్యాలు అంత దగ్గర అవుతాయి. మేకలు ప్రకృతి ఇచ్చిన వరం. మేకలు అన్ని రకాల ఆకు కూరలు, గడ్డి తింటాయి. కాబట్టి అన్ని రకాల పోషకాలు మేకలకు అందుతాయి. పేద కుటుంబాలు అవసరం కొద్దీ అమ్ముకుంటే ఆర్థిక చేయూత నిస్తాయి. మేకలు ఉన్నాయంటే ఎటిఎమ్ కార్డు మన వద్ద ఉన్నట్టు భావించాలి. కోళ్లు పెంచుకోవడం కూడా ఇస్లాంలో హలాల్ అని చెప్పొచ్చు. వేకువ జామున కోడిపుంజు పెట్టే కూతకు మేలుకుంటాం. ఫజర్ నమాజు (ప్రాత: కాల నమాజు) చేసుకోవచ్చు. కోడిగుడ్ల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. పౌల్ట్రీ ఫాంలో లక్షలాది కోళ్లు చనిపోయినా మనిషి ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు మేకలు, కోళ్లు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. షోకుల కోసం కుక్కలను పెంచుకుంటున్నారు. దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ. ఇస్లాం కేవలం ఎనిమిది రకాల పెంపుడు జంతువులకు అనుమతించింది. అందులో కుక్క , పిల్లి వంటి జంతువులు లేవు. మహమ్మద్ ప్రవక్త కూడా మేకలు పెంచుకున్నాడు. కాబట్టి మహమ్మద్ ప్రవక్త బాటలో మనమూ వెళ్లాలి. ప్రతీ ముస్లిం ఐదుసార్లు నమాజు చేయాలి. అల్లాకు దగ్గరవ్వాలి. ఇస్లాం మే హలాల్ జాన్వర్ కో పాలో, హరామ్ జాన్వర్ కో మత్ పాలో . బక్రీ అప్నీ కిద్మత్ కే లియే హై... కుదాఫీస్ అంటూ మౌలానా తన తక్రీర్ ముగించాడు. బదనపల్లి శ్రీనివాసాచారి
జాఫర్ భాయ్: సలాం వాలేకూం మౌలానా సాబ్
మౌలానా: వాలేకూం సలాం జాఫర్ భాయ్
జాఫర్ భాయ్: నా చిన్న కొడుకు సిరాజ్ సతాయిస్తున్నాడు. కుక్క కోసం నాతో గొడవపడుతున్నాడు మౌలానాసాబ్
మౌలానా దివాన్ ఖానాలో జాఫర్ భాయ్ ను కూర్చోబెట్టి తన తక్రీర్ ప్రారంభించాడు.
http://www.teluguone.com/news/content/why-did-prophet-muhammad-raise-goats-25-185742.html





