Publish Date:Sep 27, 2024
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు పట్ల ఒంగోలు తెలుగుదేశం శ్రేణులు రగిలిపోతున్నాయి. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు బాలినేని అరాచకాలు, దౌర్జన్యాలను ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచిన తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు అదే బాలినేనిని కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన గూటికి చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి తెలుగుదేశంతో పాటు జనసేన శ్రేణులూ నేతలూ కూడా బాలినేని దాష్టీకాన్ని చవి చూసిన వారు. అయినా తెలుగుదేశంతో కనీస మాత్ర చర్చ లేకుండా ఏకపక్షంగా బాలినేనికి జనసేన తీర్థం ఇచ్చేయడాన్ని తెలుగుదేశం తప్పుపడుతోంది. జనసేన గూటికి చేరడానికి ముందు బాలినేని తెలుగుదేశం తలుపు తట్టారు. అయితే పార్టీ కేడర్ మనోభావాలను గుర్తించి ందుకు అనుగుణంగా చంద్రబాబు బాలినేని ఎంట్రీకి నో చెప్పారు.
అయితే బాలినేని ఎంట్రీకి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆయనకేమీ రెడ్ కార్పెట్ పరచలేదు. జనసేన గూటికి చేరితే బాలినేని స్థానం ఏమిటి? స్థాయి ఏమిటి అన్నది చేరికకు ముందే చెప్పారు. బాలినేని కోరినట్లు పవన్ కల్యాణ్ ఒంగోలు వెళ్లి భారీ బహిరంగ సభవేదికగా పార్టీ కండువా కప్పలేదు. పోనీ మంగళగిరి భారీ ర్యాలీగా వచ్చి చేరుతానని బాలినేని కోరినా నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఒంటరిగా, ఎలాంటి హంగూ, ఆర్భాటం, హడావుడీ లేకుండా సింపుల్ గా వచ్చి జనసేన కండువా కప్పించుకుని సైలెంట్ అయిపోవాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇ
ది కచ్చితంగా బాలినేనికి మింగుడుపడని అంశమే. ఎందుకంటే.. ఆయన జనసేనలో చేరిక ఖరారు అయిన క్షణం నుంచీ ప్లెక్సీల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టేదిగానే ఉంది. అదే ఫ్లెక్సీల చించివేతకు కారణమైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ బాలినేనికి తన స్థానమేంటో చూపారు. అంత వరకూ బానే ఉన్నప్పటికీ, ఒంగోలు నియోజకవర్గంలో తెలుగేదేశం శ్రేణులు అసంతృప్తికి గురి కాకుండా వారిని ఒప్పించి బాలినేనిని చేర్చుకునే ప్రయత్నం చేసి ఉండాల్సిందని పరిశీలకులు అంటున్నారు.
బాలినేని జగన్ తో విభేదించి బయటకు వచ్చినట్లు బయటకు చెబుతున్నా.. పబ్బం గడుపుకుని వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ జగన్ పంచనే చేరుతారని బాలినేని అనుచరులే చెబుతున్నారు. జగన్ బాలినేనికి సమీప బంధువు కావడం, గతంలో ఎన్నిసార్లు జగన్ తో విభేదాలు తలెత్తినా, పార్టీలో కనీస గౌరవం దక్కకపోయినా బాలినేని వైసీపీని వీడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన జగన్ కోవర్ట్ గానే తెలుగుదేశం, జేనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించే వ్యూహంలో భాగంగానే పార్టీ మారారని జనసేన శ్రేణులే చెబుతున్నాయి.
అంతే కాకుండా వరుసగా జనసేన మాజీ ఎమ్మెల్యేలను పవన్ కల్యాణ్ పిలిచి మరీ జనసేన కండువా కప్పడాన్ని కూటమి పార్టీల శ్రేణులు సైతం తప్పుపడుతున్నాయి. చేరికల విషయంలో కూటమిలోని మూడు పార్టీల అధినేతలూ కూర్చుని మాట్లాడుకుని ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-violates-kutami-25-185739.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.