పీకే ఎపిసోడ్ లో బీజేపీ మౌనం.. కమలంతో జనసేన కటీఫ్?
Publish Date:Sep 30, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం మహా జోరుగా సాగుతోంది. సినిమా టికెట్ల వ్యవహరంగా మొదలైన మాటల యుద్ధం, మలుపులు తిరిగి రాజకీయ రచ్చకు దారి తీసింది. ఒక్కసారిగా రాజకీయ మలుపు తీసుకుంది. మరో వంక పోసానీ కృష్ణ మురళీ ఎంట్రీతో మాటల యుద్ధం బూతుల యుద్ధంగా మారిపోయింది. మొత్తానికి,రెండు పార్టీల మధ్య సాగుతున్నమాటల యుద్ధంలో వ్యక్తిగత విమర్శలు, వికారాలు అన్నీ బయటకు వస్తున్నాయి. మంత్రులు కూడా మర్యాద గీతను దాటి పవన్ కళ్యాణ్’పై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగజారారు. దేవుని సన్నిది అని కూడా చూసుకోకుండా ఏడూ కొండల పైన సాక్షాత్తు అమాత్యులు బూతులు మాట్లాడేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అందులోనూ మంత్రివర్గ పక్షాళన, సమయం సమీపిస్తున్నదేమో, మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు. మరో వంక పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ ఫాన్స్ మాత్రమే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి, ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న మాటాల యుద్దంలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పే పరిస్థితి లేదు. దొందూ ..దొందే ...ఇద్దరూ బూతు భాగోత్తుములే అందులో ఏ సందేహం లేదు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా జనసేన మిత్ర మిత్రపక్షం బీజేపీ స్పందించక పోవడం దేనికి సంకేతం? బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందనే విషయంలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి, బీజీపీ, జనసేన మిత్ర పక్షాలే అయినా రెండు పార్టీల మధ్య సంయోధ్యత లేదనే విషయం తిరుపతి ఉప ఎన్నికలలోనే తేలిపోయింది. ఆ తర్వాత కూడా రెండు పార్టీలు కలిసి కూర్చున్న సందర్భాలు కూడా ఇంచుమించుగా లేవనే చెప్ప వచ్చును. మారిన పరిస్థితులలో బీజేపీ, వైసీపీకి దగ్గరవుతోందనే అనుమానలున్నాయి.తెలుగు దేశం పార్టీ నాయకులు పలు సందర్భాలలో, ఇందుకు సంబందించిన కొన్ని ఆధారాలను బయట పెట్టారు. మరోవంక బీజేపీతో లాభం లేదని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించిన జనసేన, 2024 ఎన్నికల్లో టీడీపీతోకలిసి పోటీచేసే అవకాశం ఉందని ఉభయ పార్టీల్లోనూ వినవస్తోంది. నిజానికి,మొన్నటి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య స్థానిక స్థాయిలో లోపాయికారీ ఒప్పందాలు కుదిరాయి. ఫలితంగా జనసేన వోటు షేర్ పెరిగింది. సో .. ఈకారణంగా కూడా బీజేపీ మౌనం వహించిందనే అనుమానాలు కూడా లేక పోలేదు. మరో వంక పోసానికృష్ణ మురళీ హద్దులు దాటి చేసిన దాడిని, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గట్టిగా ఖండించారు. పోసాని మురళి పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. పోసాని భాష,. ఆయన మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న టీడీపీ నేత.. పోసాని చేత ప్రశాంత్ కిషోర్ టీమ్ మాట్లాడిస్తోందనే అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగంగా ఎందుకు వారించడంలేదని ప్రశ్నించారు. అయితే ఇంత కథ నడిచిన తర్వాత, ఏమనుకున్నారో ఏమో, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సీన్ ‘లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్’పై వైసీపీ నాయకులు చేసినవ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ నాయకులు గీత దాటి దుర్భాషకు దిగుతున్నారని అన్నారు. విమర్శను తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలన్నారు. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకమని చెప్పారు. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలని సెటైర్లు వేశారు జీవీఎల్ నరసింహారావు.ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జీవీఎల్ వ్యాఖ్యలను సమర్ధించారు. ఆయన చేసిన ట్వీట్ ను ఈయన రీట్వీట్ చేశారు. అయితే బీజేపీ, జనసేనల మధ్య ఇప్పటికే పెరిగిన దూరం తాజా దుమారంతో మరింత పెరిగింది. నిజానికి, జనసేన బీజేపీతో విడాకులకు ఎప్పుడోనే సిద్దమైంది. ముహూర్తం ఖరారు కావడమే మిగిలిందని.. ఆరెండు పార్టీలలో కీలక పదవుల్లో ఉన్నవారే అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-bjp-leaders-silent-in-pawan-kalyan-issue-25-123775.html





