కౌన్ బనేగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ?

Publish Date:Sep 20, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు ప్రకారం, మరో రెండు రోజులో  అంటే గురువారం (సెప్టెంబర్‌ 22) నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. సెప్టెంబర్‌ 25 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అవసరం అయితే, అక్టోబర్‌ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలింగ్ నిర్వహిస్తారు.అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.  

అయితే, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అసలు ఎన్నికంటూ జరుగుతుందా?  ఆ అవసరం ఉంటుందా? అంటే, పార్టీ కీలక నేతలు సహా ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ తెలియక పోవడంతో, అధ్యక్ష ఎన్నికల వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అయితే, సోనియా గాంధీ ఎట్టి పరిస్థితిలోనూ, పగ్గాలు పరాయి చేతికి ఇవ్వరని, అవసరం అయితే, మళ్ళీ ఆమే బాధ్యతలు చేపట్టినా చేపడతారని అంటున్నారు.

నిజానికి, సోనియా గాంధీ విదేయ వర్గం ఇప్పటికే, ఆ దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు. ఆదలా ఉంటే, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపధ్యంలో,  రాహుల్ గాంధీ మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ బలాన్ని పుంజు కుంటోంది. పార్టీ కీలక నేతలు కొందరు రాహుల్ గాంధీకి, విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు.పీసీసీ తీర్మానాలు చేస్తున్నాయి. అలాగే, రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నికోవాలని సీనియర్ నేతలు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరో వంక  మరో వంక కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగతమైన సంస్కరణలు అవసరమంటూ రెండేళ్ళ క్రితం నుంచి డిమాండ్ చేస్తున్న జీ23 గ్రూప్ కు మద్దతు పెరుగుతోంది. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు జరగాలని కాంగ్రెస్‌ యంగ్‌ గ్రూప్‌ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిటిషన్ కు ఇంచుమించుగా ఓ వెయ్యి మంది వరకు యువనేతలు మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుందా? ఏకగ్రీవం అవుతుందా అనే విషయంలో,పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వ్యక్తమవుతోంది. అదలా ఉంటే కాంగ్రెస్‌ యంగ్‌ గ్రూప్‌  పిటిషన్ స్వాగతించిన పార్టీ సీనియర్‌ నేత,  తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌’ పోటీకి సై అంటున్నారు. ఆయన  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తమ మనసులోని మాటను ఆమె ముందుంచారు. అందుకు ఆమె కూడా  సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాదు, అంతర్గత ప్రజాసామ్యం అవసరమని,పార్టీకి మేలు చేస్తుందని సోనియా గాంధీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే ఈ అన్నిటినీ మించి, పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దంగా ఉన్నారా? లేదా? అనేది, ఇంకా ఆయన మనసులోని మాటగానే ఉంది. ఇటీవల కన్యాకుమారి నుంచి  భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సమయంలోనూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో తమ మనసులో స్థిరమైన అభిప్రాయం ఉందని చెప్పారు,  కానీ  అదేమిటో మాత్రం బయట పెట్టలేదు. నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వత తాను పోటీ చేసేది లేనిది తెలిసి పోతుందని, సస్పెన్స్ ను మరింత పెంచారు. 

నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి ఓడిపోయిన నేపధ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మరో మారు అధ్యక్ష పదవి చేపట్టాలనే డిమాండ్ అప్పటి నుంచి వినిపిస్తూనే వుంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారని అంటున్నారు. మరోమారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరనే ప్రచారం బలంగానే సాగుతోంది. ఇప్పటికీ ఆయన అదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. 

అదలా ఉంటే  రాహుల్ గాంధీ చివరి వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వద్దే వద్దనే మాట మీద నిలబడితే, సోనియా విదేయ వర్గం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  ను పోటీకి సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది.  నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగానే, గెహ్లాట్ నామినేషన్ వేస్తారని, అంటున్నారు. అలాగే, రాహుల్ గాంధీ నిర్ణయంతో సంబంధం లేకుండా శశిథరూర్‌ కూడా నామినేషన్ వేస్తారని అంటున్నారు. అయితే చివరకు రాహుల్ గాంధీ, ఓకే అంటే ఇద్దరూ ఉపసంహరించుకునే అవకాశమే ఉందనీ అలాగే  గెహ్లాట్, శశిథరూర్‌లలో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనేది కూడా, చివరకు సోనియానే నిర్ణయిస్తారని అంటున్నారు.ఆ అవగాహనతోనే సోనియా గాంధీ, శశిథరూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.నిజంగా అదే జరిగితే, చాంతాడంత రాగం తీసి, అదేదో పాట పడినట్లుగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక క్రతువు, మరో ప్రహసనంగా ముగుస్తుందని అంటున్నారు.

By
en-us Political News

  
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.