మై గుడ్ ఫ్రెండ్ అంటూ చంద్రబాబుకు మోడీ జన్మదిన శుభాకాంక్షలు

Publish Date:Apr 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం  అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం (ఏప్రిల్ 20)  తన 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ దిగ్గజాలు, సినీ ప్రముఖులు,  వివిధ రంగాలకు చెందిన వారు  ఆయనకు  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుండి మొదలుకొని రాష్ట్ర గవర్నర్ వరకు అందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపారు.

ప్రధాని నరేంద్ర మోడీ..  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో  మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు. చంద్రనబాబు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండి, ప్రజలకు మరింత సేవ చేయాలని  ఆకాంక్షించారు. 

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు అందజేశారు. చంద్రబాబు నాయుడు దార్శనికత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో అవసరమనీ,  ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని గవర్నర్ ఆకాంక్షించారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ..  చంద్రబాబును  అనితర సాధ్యుడి'గా అభివర్ణించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగే సత్తా కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని పేర్కొన్న పవన్ కల్యాణ్..  ఒక సమర్థుడైన పరిపాలకుడిగా చంద్రబాబు సేవలు చిరస్మరణీయమన్నారు. 

కాగా  వైసీపీ అధినేత  జగన్ మోహన్ రెడ్డి కూడా  చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సుదీర్ఘమైన, ప్రశాంతమైన జీవితం లభించాలని కోరుతూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబుకు ఫోన్ , సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు.

ఇక సినీ ప్రముఖుడు చిరంజీవి, పలువురు అగ్ర నటులు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.   ఇక రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు పుట్టిన రోజును   సేవా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  చంద్రబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే తన పుట్టినరోజు కానుక అనిపేర్కొన్నారు.  ప్రజల నుంచి అందుతున్న ఈ అపారమైన ప్రేమ తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు.  

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.