తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ... ఇదీ ఫోన్ ట్యాపింగ్ ప్రభాకరరావు తీరు
Publish Date:Jul 11, 2024
Advertisement
ఫోన్ ట్యాపింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ బిఐ మాజీ చీఫ్ ఇప్పట్లో ఇండియాకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ కేసులో దర్యాప్తు అధికారులకు ఆయన సహకరించే అవకాశాలు సన్నగిల్లినట్టు తెలుస్తోంది. అమెరికా నుంచే జూబ్లిహిల్స్ పోలీసులకు లేఖలు రాస్తున్న ప్రభాకర్ రావు ఇక మొహం చాటేస్తున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తనకు ఆరోగ్యం బాగా లేదని చెబుతూ ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ప్రభాకర్ రావు చేస్తున్నట్టు కనబడుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయంలో అనధికారికంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రతిపక్ష పార్టీల నేతలు, పలువురు వ్యాపారులు, కీలక వ్యక్తులఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆయన దేశం వదిలి అమెరికాకు వెళ్లిపోయారు. కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని లేఖలో వెల్లడించారు. జూన్ 26న తాను ఇండియాకు తిరిగి రావాల్సి ఉందని.. ఆరోగ్యం బాగోలేక యూఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. తాను క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాని.. అమెరికా డాక్టర్ల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
క్యాన్సర్ తో బాధపడుతున్న తనకు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని ప్రభాకర్ రావు తెలిపారు. ఒక పోలీసు అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని... తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చట్టపరంగా విచారణ జరపాలని కోరుతున్నానని.... విచారణలో పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అయినా, మెయిల్ ద్వారా అయినా సమాచారం ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోనని... పూర్తిగా కోలుకున్న తర్వాత దర్యాప్తు అధికారుల ముందు హాజరై, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలతో తాను, తన కుటుంబ సభ్యులు మానసిక వేదన చెందుతున్నామని చెప్పారు
http://www.teluguone.com/news/content/who-is-running-away-this-is-prabhakara-rao-style-of-phone-tapping-25-180511.html





