పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా... జగన్ రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్?

Publish Date:Jul 11, 2024

Advertisement

గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో జగన్ పులివెందుల శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనీ, కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందు కోసం జగన్ కడప లోక్ సభ సభ్వత్యానికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి, ఆయనను తాను రాజీనామా చేసిన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దింపుతారన్నవార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు వైసీపీ నుంచి కానీ జగన్ నుంచి కానీ ఎటువంటి స్పందనా లేదు. పార్టీ వర్గాలు జగన్ కడప నుంచి లోక్ సభకు ఎన్నిక కావాలన్న ఉద్దేశంతోనే ఉన్నారనీ, అలా అయితేనే తనకు తన అక్రమాస్తుల కేసులను డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటందని భావిస్తున్నారనీ అంటున్నారు. 

అయితే కొంచం లాజిక్ తో ఆలోచిస్తే జగన్ పులివెందుల అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి కడప నుంచి లోక్ సభకు పోటీ చేస్తే అక్కడ గెలుస్తారా?  అలాగే అవినాష్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే ఆయనకు విజయం సాధించే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉప ఎన్నికలలో సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి తోడు తాజా ఎన్నికలలో పులివెందులలో జగన్ మెజారిటీ బాగా తగ్గింది. అలాగే కడప లోక్ సభ నియోజకవర్గంలో జగన్ కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి, సొంత చెల్లెలు షర్మిల రంగంలోకి దిగడం ఖాయం. అటువంటప్పుడు జగన్ ఆమెను నేరుగా ఢీకొని గెలవగలరా? తాజా ఎన్నికలలో కడప జిల్లాలో తెలుగుదేశం అద్భుత ప్రదర్శన కనబరిచింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ తరుణంలో పులివెందుల అసెంబ్లీ, కడప లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఆ పార్టీకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఒక వేళ ఉప ఎన్నికలలో పులివెందుల నుంచి అవినాష్ పోటీ చేసి ఓడిపోయినా, కడపలో జగన్ స్వయంగా పరాజయం పాలైనా ఇక జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లే అవుతుంది.  

నిజంగానే జగన్ పులివెందుల స్థానానికి, అవినాష్ రెడ్డి కడప లోక్ సభ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తెరతీస్తే.. కడపలో జగన్ విజయం సంగతి ఎలా ఉన్నా పులివెందులలో అవినాష్ రెడ్డి విజయం సాధించడం మాత్రం అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగన్ కు మెజారిటీ తగ్గింది. ఇక్కడ తెలుగుదేశం తరఫున బీటెక్ రవి రంగంలోకి దిగుతారు. సీఎం హోదాలో పోటీలో ఉన్న జగన్ నే దీటుగా ఎదుర్కొన్న బీటెక్ రవికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో  అవినాష్ పై విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు. 

ఇక కడప విషయంలోనూ తెలుగుదేశం అంత తేలిగ్గా తీసుకోదనీ, అవసరమైతే జగన్ ఓటమి లక్ష్యంగా ఉప ఎన్నికలో ఆయనకు ప్రత్యర్థిగా నిలిచే షర్మిలకు లోపాయికారీ మద్దతు ఇచ్చే అవకాశాలే మెండుగా ఉంటాయనీ చెబుతున్నారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికలో ఏం జరిగిందో  పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే  జగన్ చేజేతులా తన రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్లేనని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకూడదని హెచ్చరించడమే ఆయన చేసిన నేరమైంది.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం అరికట్టేందుకు, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
దీపావళి పండుగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
ఇటీకాల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ఉద్యోగుల పని వాతావరణంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పండుగ వేళ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.