Publish Date:Jan 27, 2026
తెలంగాణలో సంచలనం సృష్టించిన, సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రాధాకిషన్ రావు విచారణలో బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నివాసం నుంచి చేతిరాతతో కూడిన చిట్టీలు వచ్చేవనీ, ఆ చిట్టీలలోని ఫోన్ నంబర్లను తాము ట్యాప్ చేసేవారమనీ వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఆ చేతి రాత ఎవరిది అన్న చర్చకు తెరలేచింది.
అప్పటి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన సంతోష్ రావు చేతిరాతా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ కూడా ఇప్పుడు ఆయనను కూడా విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావును నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్ఇన్ ఛార్జ్ గా నియమించడంపైనా సిట్ ఆరా తీస్తోందంటున్నారు. ప్రత్యేకించి ఆయనకే ఈ బాధ్యతలు ఇవ్వడమేంటన్న దిశగా కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు. అత్యంత కీలకమైన పదవిని ఒక రిటైర్డ్ అధికారికి కట్టబెట్టడంలోని మతలబుపై సిట్ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పోతే చిట్టీలలో చేతిరాత విషయం నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ఎదుట మంగళవారం (జనవరి 27) విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు సంతోషరావుకు నోటీసులు జారీ అయ్యాయి..మంగళవారం (జనవరి 27) మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు ఇటీవల సజ్జనార్ ని చీఫ్ గా నియమించిన సంగతి తెలిసిందే. సజ్జనార్ నియామకంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ని సిట్ ఇంచార్జ్ ని చేయడమేంటని ప్రవీణ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చింది. దీంతో ప్రవీణ్ యూటర్న్ తీస్కున్నారు.
అదలా ఉంటేఇటు మాజీ మంత్రి హరీష్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కూడా ఇటీవల సిట్ విచారించింది. ఇక ఇపుడు సంతోష్ రావు వంతు వచ్చిందంటున్నారు. అదలా ఉంచితే.. బీఆర్ఎస్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అనడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నది సర్వసాధారణమనీ, అదేం పెద్ద నేరం కాదనీ అంటున్నది. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఫోన్ ట్యాపింగ్ అన్నది పోలీస్ డిపార్ట్ మెంట్ విధి నిర్వహణలో ఒక భాగం అన్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. చేతిరాత చిట్టీల వెనుక ఉన్నది సంతోషేనా? అసలు దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/who-is-behind-han-written-slips-25-213041.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.