వైసీపీ నేతలకు జగన్ భయంపోయిందా?

Publish Date:Jan 27, 2026

Advertisement

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తీరుపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. పార్టీలో వన్ నుంచి హండ్రడ్ వరకూ అన్నీ ఆయనే అన్న చందంగా వ్యవహరిస్తుండటం, సీనియారిటీకి తగిన గుర్తింపు లేకపోవడం పట్ల వైసీపీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయి, అప్పటి ప్రతిపక్ష, ప్రత్యర్థి పార్టీలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న వైసీపీ నాయకులకు మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేక, తప్పని సరి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగాల్సిన పరిస్థితి. అందుకే అధికారంలో ఉండగా నోటిని ఒక దూషణల కర్మాగారంగా మార్చుకుని మరీ చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు నోరు కట్టేసుకున్నారు. మాట్లాడడానికే జంకుతూ సైలెంటైపో యారు. 

అదలా ఉంచితే.. వైసీపీ ఎకో సిస్టమ్ లో ప్రత్యర్థి పార్టీల నేతలతో మాట్లాడకూడదన్న అనధికార బ్యాన్ ఉంటుంది. అది జగన్ గీసిన లక్ష్మణ రేఖగా ఆ పార్టీ నేతలు భావిస్తారు. అందుకే ఇప్పటికీ అంటే.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న ఘోర పరాజయం తరువాత కూడా  వైసీపీయులెవరూ కూటమి నేతలు తెలుగుదేశం కూటమి పార్టీల చెందిన నాయకులను కనీసం పలకరించను కూడా పలకరించరు. అయితే మౌనం, లేకుంటే తిట్ల పురాణం అన్నట్లుగా వారీ తిరు ఉంటుంది.  అయితే ఇప్పుడిప్పుడే పార్టీలో ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తున్నది. జగన్ భయం నుంచి  వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా సోమవారం (జనవరి 26) గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు (ఎట్ హోం) కార్యక్రమానికి శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. అలా హాజరైన బొత్స సత్యనారాయణ.. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి,  మంత్రి లోకేష్ వద్దకు స్వయంగా వెళ్లి, కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించి ముచ్చటించారు. రెండు నిముషాలకు పైగా బొత్స సత్యనారాయణ నారా లోకేష్ తో సరదాగా సంభాషించారు. లోకేష్, బొత్స ఇరువురూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  

ఇదే ఇప్పుడు జగన్ అంటే వైసీపీ నేతలకు భయం పోయిందా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఎందుకంటే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ నేతలు ప్రత్యర్థులతో మాట్లాడటం అసలు రుచించదు. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత శత్రువులేనన్నట్లుగా జగన్ భావిస్తారు. వారితో తమ పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా,  వాళ్లని దూరం పెడతారు. ఈ విషయం బొత్స సత్యనారాయణకు తెలియంది కాదు.  గతంలో ఒక సారి జనసేనాని పవన్ కల్యాణ్ తో మాట్లాడి సందర్భంగా ఆయన ఆ పరిస్థితి ఎదుర్కొన్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయినా కూడా బొత్స సత్యనారాయణ లోకేష్ తో ఆత్మీయంగా పలకరించడం చూస్తుంటే.. జగన్ లెక్కేమిటన్నట్లుగా ఆయన వ్యవహరించినట్లు కనిపిస్తోందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. అంతే కాదు.. ఇటీవల నియోజకవర్గ మార్పు విషయంలో మాజీ మంత్రి విడదల రజని సైతం తన అసంతృప్తిని ఒకింత బాహాటంగానే వ్యక్తం చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే పేర్ని నాని సైతం తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనా పరంగా విఫలమవ్వడమే ఘోర పరాజయానికి కారణమని ఇటీవల వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తుంటే.. వైసీపీపై జగన్ పట్టు సడలుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.