వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్టు సరే.. తరువాతెవరు?

Publish Date:Apr 24, 2023

Advertisement

వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు అనివార్యమని తేలిపోయింది. అయితే సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో మరో కీలక నిర్ణయం కూడా వెలువరించింది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు తాను విధించిన గడువును తానే సడలించి మరో రెండు నెలల గడువు ఇచ్చింది. ఇక్కడ ప్రస్తావించి తీరాల్సిన విషయం ఏమిటంటే.. సీబీఐ గడువు పెంచాలని సుప్రీం కోర్టును కోరలేదు. కానీ సుప్రీం కోర్టు గడువును పొడిగించింది.

అంటే ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డి అరెస్టుతో సీబీఐ దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్లేనని ఇక వరుస చార్జిషీట్లు ఉంటాయనీ అంతా భావించారు. అందుకు భిన్నంగా సుప్రీం కోర్టు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టి వేస్తూ విస్పష్ట తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తప్పుపట్టింది. ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ప్రతి అంశాన్నీ సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తప్పుపట్టింది.  ఒక దశలో ఆ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటామని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు సుప్రీంను అభ్యర్థించినా, అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. చివరకు హైకోర్టులో వాదనలు పూర్తయ్యే వరకైనా అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదుల అభ్యర్థనను సైతం సుప్రీం తోసి పుచ్చింది.  

ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సీబీఐ దర్యాప్తు గడువును పెంచడం చూస్తుంటూ.. ఈ కేసుకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించిందని భావించాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ ను సీబీఐ ఇప్పటికే విచారించింది. మరో సారి వారిరువురికీ నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని పిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే అవినాష్ రెడ్డి అరెస్టుతో సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చిందని భావించడానికి లేదనీ, ఈ కేసు మూలాల అన్వేషణలో భాగంగా సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టే అవకాశాలున్నాయనీ అంటున్నారు. కాగా వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తాడేపల్లి ప్యాలెస్ పూర్తిగా ఇరుక్కుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవర్న విషయంలో ఇంత కాలంగా వ్యక్తమౌతున్న అనుమానాలు ఇప్పుడు దాదాపుగా నివృత్తి అయిపోయాయని అంటున్నారు. ఎందుకంటే తొలి సారి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచినప్పటి నుంచీ వైసీపీ అగ్రనేతల్లో గాభరా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఆ తరువాత ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ లను సీబీఐ విచారించడంతో ఈ కేసులో వెనుక తాడేపల్లి మూలాలున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లోనే బలపడిందని చెబుతున్నారు. అన్నిటికీ మించి  సీబీఐ విచారణ పూర్తియన తరువాత కృష్ణ మోహన్ రెడ్డి, నవీన్ అలను స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో కడప విమానాశ్రాయానికి,  అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చేర్చడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయని అంటున్నారు. అందుకే సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తును మరో రెండు నెలలు పొడిగించడంతో సీబీఐ దర్యాప్తు మరింత లోతుకు సాగేందుకు మార్గం సుగమమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అలాగే 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన సమయంలో అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను సీబీఐ తాజాగా విచారించడం సంచలనం సృష్టించింది. ఎందుకంటే వివేకా హత్య కేసులో అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హత్యా స్థలంలో వేలి ముద్రల గురించి, వివేకా శరీరంపై ఉన్న గాయాల గురించి మీడియాకు చెప్పారు. వివేకా నివాసానికి వెళ్లి మరీ విచారణ జరిపారు.  ఆయననుంచి తాజాగా సీబీఐ కీలక సమాచారాన్ని రాబట్టిందని అంటున్నారు. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.