నితీష్ ఐక్యతా యత్నాలు ఫలించేనా?.. కేసీఆర్ కలుస్తారా?

Publish Date:Apr 24, 2023

Advertisement

విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ప్రయత్నాలను పట్టువదలని విక్రమార్కుడిలా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఆర్జేడీనేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ తో కలిసి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం తగదని ఆయన అంటున్నారు.

కోల్ కతాలో మమత బెనర్జీతో భేటీ అయిన నితీష్ దీదీతో చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయని చెప్పారు. విపక్ష నేతలంతా కలిసి వ్యూహరచన చేస్తే మంచిదని మమత చెప్పారనీ, బీజేపీని జీరో చేయడమే లక్ష్యంగా విపక్షాల ఐక్యత ఉండాలన్నదే లక్ష్యం కావాలని అన్నారు. లోక్ నాయక్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ఉద్యమం కూడా బీహార్ నుంచే ప్రారంభమైందన్న నితీష్ కుమార్, ఇప్పుడు కూడా విపక్షాల ఐక్యతా యత్నాలకు బీహార్ నుంచే నాది పలకాలని ఆకాంక్షించారు. విపక్షాల ఐక్యతకు సంబంధించి అఖిల పక్షం బీహార్ లో నిర్వహించాలని మమతా బెనర్జీ కూడా సూచించారని నితీష్ కుమార్ తెలిపారు.

ఐతే.. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటే ఇటీవలే అఖిలేష్, మమతలు సంయుక్త ప్రకటన చేసిన నేపథ్యంలో బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న జేడీయే అధినేత నితీష్ కుమార్   కాంగ్రెస్‌ సారథ్యంలో విపక్షాల ఐక్యత కోసం చేస్తున్న ప్రయత్నాలకు మమత సుముఖంగా స్పందించారని చెప్పడం విశేషం. అయితే నితీష్ ఇప్పటి వరకూ చేసిన ఐక్యతా యత్నాలన్నీ ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగానే సాగాయి. ఈ నెల 12న జయప్రకాశ్ నారాయణ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలో కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీల ఐక్యతకు సంఘీభావం ప్రకటించిన కేజ్రీవాల్ ఆ తరువాత వారం వ్యవధిలోనే ఆప్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇప్పుడు నితీష్ తో భేటీకి చాలా రోజుల ముందే బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం అని ప్రకటించిన మమత ఇప్పుడు నితీష్ సమక్షంలో కాంగ్రెస్ సహా విపక్షాల ఐక్యతకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.  

కోల్ కతా నుంచి నేరుగా  లక్నోవెళ్లి  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో భేటీ అయిన నితీష్, తేజస్వి ప్రసాద్ లు ఆయనతోనూ ఐక్యతపై చర్చించారు.  కాగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏలో కొనసాగుతున్నారు. ఎన్సీపీ, ఉద్దవ్‌ శివసేన ఇప్పటికే కాంగ్రెస్‌ కూటమిలోనే ఉన్నాయి. స్టాలిన్‌ కూడా యూపిఏ భాగస్వామిగానే ఉన్నారు. బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక దాదాపు అన్ని కూటములకూ దూరంగా ఉన్నారు.  అసలు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమి అంటూ తొలుత అడుగులు వేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయంలో నోరు మెదపడం లేదు. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమి అన్నది ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ శక్తులను అనివార్యమైన అవసరంగా మారిందనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.