ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురూ ఎవరు?.. పీటముడి పడిందా?

Publish Date:Nov 29, 2024

Advertisement

రాజ్యసభ ఉప ఎన్నికలలో ఏపీ నుంచి మూడు స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సభ్యులను బట్టి చేస్తే ఆ మూడు స్థానాలూ కూటమి అభ్యర్థులే గెలుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలా మూడు స్థానాలూ ఖాళీ ఎందుకు అయ్యాయంటే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలలో ముగ్గురు ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో  కూటమి పార్టాలలో ఎవరెవరికి స్థానం దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

అయితే సహజంగానే తెలుగుదేశం ఈ స్థానాలలో పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ మిత్రధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని బీజేపీ, జనసేనలలో ఏదో ఒక పార్టీకి వదిలివేయడానికి సుముఖంగా ఉంది. ఇక తెలుగుదేశం నుంచి పోటీ చేసే ఇద్దరూ ఎవరన్న విషయానికి వస్తే.. ముందస్తుగానే తెలుగుదేశం ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానం తాజా మాజీ బీద మస్తాన్ రావుకు ఖరారైంది. అలాగే బీద మస్తాన్ రావుతో పాటే వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న దానిపై తెలుగుదేశం అధినేత కసరత్తు చేస్తున్నారు.

ఇక ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగినా, స్వయంగా నాగబాబే అదంతా ప్రచారం మాత్రమేనని ఎక్స్ వేదిక ద్వారా స్పష్టం చేశారు. తనే సోదరుడు హస్తిన పర్యటన తనకు రాజ్యసభ స్థానం కోసమే అంటూ జరుగుతున్న ప్రచారానికి చుక్క పెట్టేస్తూ, పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నిలబడతారు కానీ స్వార్థం కోసం కాదని క్లారిటీ ఇస్తూ, ఆయన హస్తిన పర్యటనతో తనకు రాజ్యసభ స్థానం కోసం ఎలాంటి ప్రయత్నాలూ లేవని కుండబద్దలు కొట్టేశారు. 
దీంతో ఇప్పుడు ఆ మూడో స్థానం ఎవరిది అన్న విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో బలం పెంచుకునే క్రమంలో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ కోరుతోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి ఇంకా ఏ గూటికీ చేరని ఆర్. కృష్ణయ్యకు కాషాయి కండువా కప్పి రాజ్యసభకు పంచించే యోచనలో బీజేపీ ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇటీవలి హస్తిన పర్యటనలో మోడీతో జరిగిన చర్చల్లో ఈ మేరకు  అంగీకారం కూడా కుదిరిందంటున్నారు. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ కూడా.. మూడో స్థానం జనసేన, బీజేపీలలో ఎవరికైనా ఒక్కటే అన్న భావంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్.కృష్ణయ్య కమలం గూటికి చేరి రాజ్యసభకు వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

బీసీ వర్గాల్లో మంచిఇమేజ్ ఉన్న కృష్ణయ్యను బీజేపీలో చేర్చుకుని రాజ్యసభకు పంపడం ద్వారా రాజకీయంగా తమకు లబ్ధి ఉంటుందని కమలనాథులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇక బీద మస్తాన్ రావు కాకుండా మరో స్థానానికి అభ్యర్థి ఎవరన్న విషయంలో తెలుగుదేశంలో తీవ్ర పోటీ నెలకొని ఉందని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుని ఆయన సూచించిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇచ్చే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ హయాంలో పార్టీ కోసం నిలబడి కష్టనష్టాలకు గురైన వారిని రాజ్యసభకు పంపాలన్న డిమాండ్ తెలుగుదేశంలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభకు తెలుగుదేశం తరఫున టికెట్ దక్కేదెవరికి అన్న విషయంలో పీటముడి పడిందని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.  

By
en-us Political News

  
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.