గ్రేటర్ లో అనూహ్య ఫలితాలు! మేయర్ పీఠం ఆ పార్టీకేనా? 

Publish Date:Dec 1, 2020

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు చేంజ్ కోరుకున్నారా? అధికార పార్టీ అభివృద్ది నినాదాన్ని ఆదరించారా? పాతబస్తిలో పతంగి పార్టీ పరిస్థితి ఏంటీ?. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన  జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ  జరుగుతోంది.  పోలింగ్ సరళి అధారంగా  లెక్కలు  వేసుకుంటూ ఎవరి గెలుస్తారో అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల్లో ఈసారి విలక్షమైన తీర్పు రాబోతుందని తెలుస్తోంది. 

 

అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ భారీగా జరిగిందంటున్నారు. యువతతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులంతా కమలానికి మద్దతుగా నిలిచారని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. గతంలో నాలుగు డివిజన్లు గెలిచిన బీజేపీ ఈసారి 45 నుంచి 50 డివిజన్లు గెలవచ్చని చెబుతున్నారు. గతంలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి 60 డివిజన్లలోపే ఆగిపోతుందని తెలుస్తోంది. ఓల్ట్ సిటీలో పట్టున్న ఎంఐఎంకు కూడా షాక్ తగలనుందని, ఆ పార్టీకి గతంలో కంటే 10 సీట్ల వరకు తగ్గవచ్చని.. అక్కడ జరిగిన పోలింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కు 6 నుంచి 10 సీట్లు  గెలవొచ్చంటున్న పొలిటికల్ అనలిస్టులు.. తెలుగు దేశం పార్టీ నాలుగైదు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చిందని చెబుతున్నారు. 
                  

ఎల్బీనగర్, ఉప్పల్ , మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగిందని చెబుతున్నారు.ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా... 2016లో కారు పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి టీఆర్ఎస్ కు తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, రెండుమూడు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఎల్బీనగర్ జోన్ లో ముందు నుంచి కాంగ్రెస్ బలంగా కనిపించినా... పోలింగ్ రోజున కొంత వెనకబడిందని తెలుస్తోంది. దీంతో ఎల్బీనగర్ సెగ్మెంట్ లో  బీజేపీ ఆరు నుంచి 8 డివిజన్లు గెలవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఉప్పల్ లో  అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని తెలుస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలో మూడు పార్టీలకు సమంగా సీట్లు రావచ్చంటున్నారు. మల్కాజ్ గిరి జోన్ లో తొమ్మిది డివిజన్లు ఉండగా.. అధికార పార్టీకి నాలుగు, బీజేపీకి రెండు వస్తాయని మరో మూడు చోట్ల టఫ్ పైట్ నడించిందని అంచనా వేస్తున్నారు. ఏఎస్ రావు నగర్ లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని, ఆ సీటుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ సాగింది. ఇక్కడ పోలింగ్  కేంద్రాల దగ్గర  చాలా చోట్ల గొడవలు జరిగాయి. కుత్బుల్లాపూర్ పరిధిలో కూడా బీజేపీ. టీఆర్ఎస్ కు సమానంగా సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ కు రెండు సీట్లు రావొచ్చంటున్నారు. సెటిలర్లంతా బీజేపీ వైపు నిలిస్తే మాత్రం ఫలితం ఏకపక్షంగా ఉండవచ్చంటున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో తొమ్మిది డివిజన్లు ఉండగా.. ఇక్కడ అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. నాలుగు డివిజన్లలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండటం గులాబీ పార్టీకి కలిసి రావచ్చని లెక్కలు వేస్తున్నారు. కేపీహెచ్బీ, బాలాజీనగర్ లో మాత్రం  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ పైట్ నడిచింది. శేరిలింగం పల్లి నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉండగా.. ఇక్కడ కూడా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. ఇక్కడ సెటిలర్లే కీలకం కావడంతో ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ కు ఐదు, బీజేపీకి రెండు రావచ్చని, వివేకానంద నగర్ డివిజన్ లో టీడీపీకి అవకాశం ఉందని చెబుతున్నారు. 

 

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ సాగిందంటున్నారు. సికింద్రాబాద్ , అంబర్ పేట నియోజకవర్గాల్లో బీజేపీకి... సనత్ నగర్, జూబ్లీహిల్స్  నియోజకవర్గాల్లో అధికార పార్టీ మెజార్టీ డివిజన్లు  వస్తాయని చెబుతున్నారు.  ఖైరతాబాద్ , ముషిరాబాద్ లో మాత్రం హోరాహోరీ ఉంటుందని తెలుస్తోంది.  ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కు చీలకుండా ముస్లిం ఓట్లలో ఎక్కువ శాతం కారుకు పడితే అధికార పార్టీకి మెజార్టీ సీట్లు దక్కవచ్చు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఎంఐఎంకే మెజార్టీ డివిజన్లు వచ్చినా... గతంలో కంటే 10 సీట్లు తగ్గవచ్చంటున్నారు. నాంపల్లి, మలక్ పేట నియోజకవర్గాల్లో  కొన్ని సీట్లు బీజేపీకి .. గోషామహాల్ నియోజకవర్గంలో కొన్ని సీట్లు టీఆర్ఎస్ కు రావచ్చంటున్నారు. బీజేపీలోని విభేదాలు ఇక్కడ ఆ పార్టీకి నష్టం కలిగించాయని అంచనా వేస్తున్నారు. 

 

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నాలుగు డివిజన్లు ఉండగా.. అసదుద్దీన్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈసారి ఎంఐఎం రెండు గెలవచ్చని చెబుతున్నారు. మైలార్ దేవ్ పల్లిలో ఎమ్మెల్యే సొదరుడు, బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డికి హోరాహోరీ పోరు జరిగిందంటున్నారు. అత్తాపూర్ లోనూ  గట్టి పోటీనే జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లను గెలిపించుకోవడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించినా.. అవి గెలవడం టీఆర్ఎస్ అంత ఈజీ కాదంటున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు ఉండగా.. గ్రేటర్ వ్యాప్తంగా ఇక్కడే ఎక్కువ పోలింగ్ జరిగింది. ఇక్కడ మూడు డివిజన్లలో బీజేపీ., టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. అయితే మంత్రి హరీష్ రావు సీరియస్ గా ప్రచారం చేయడం, కేంద్ర సర్వీసు ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు.  

 

మొత్తంగా హోరాహోరీగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతంలో కంటే భిన్నమైన ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో ఊహించని రిజల్ట్స్ కూడా రావచ్చంటున్నారు. కొన్ని డివిజన్లలో 10 వేల ఓట్లు మాత్రమే పోల్ కావడంతో 4 వేల ఓట్లు వచ్చిన వారు కూడా గెలిచే అవకాశం ఉంది. అలాంటి డివిజన్లలో షాకింగ్ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో కంటే టీఆర్ఎస్ కు భారీగా సీట్లు తగ్గినా  ఎక్స్ అఫిషియో సభ్యులు.. అవసరమైతే  ఎంఐఎంతో కలిసి మరోసారి మేయర్ పీఠం సాధిస్తుందని మాత్రం చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.