తస్సాదియ్యా.. తుస్సుమంది!

Publish Date:Dec 1, 2020

Advertisement

‘గ్రేటర్’ పోలింగ్ శాతం గోవిందా

 

తగ్గిన పోలింగ్ కారుకే లాభమా?

 

‘అప్ప ఆర్భాటమే గానీ బావ బతికుంది లేద’న్నట్లుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ వ్యవహారం. అమిత్‌షా నుంచి యోగి ఆదిత్యనాధ్ వంటి అతిరధమహామహులంతా దిగివచ్చి, కేటీఆర్ నుంచి కేసీఆర్ వరకూ ప్రచారం చేసినా గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన పోలింగ్  40 శాతమే.  బాగా చదువుకున్న వారు, అస్సలు చదువుకోని వారు, అత్తెసరు చదువుల మేలుకలయిక అయిన భాగ్యనగరంలో నమోదయిన ఈ పోలింగ్..   ‘భాగ్యనగర బద్ధకానికి’ ఓ తీపిగుర్తు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ, పోలింగ్‌బూత్‌ల వద్ద భూతద్దం పెట్టి వెతికినా ఓటర్లు కనిపించలేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, మియాపూర్‌లో నివసించే సినిమాస్టార్లు,  పాపం అప్పటికీ.. మేము ఓటేశాం. మరి మీ సంగతేమిటని మేల్కొలిపేలా ట్వీట్లు చేసినా,  భాగ్యనగర బద్ధకిస్టుల్లో చలనం లేదు మరి! వచ్చిన సెలవులను టెకీలు, ప్రైవేటు ఉద్యోగులు హాయిగా జాలీ ట్రిప్పులు వేసుకుని నగరం దాటి... ఆరకంగా ముందుకెళ్లారు.

 

చదువుకున్న వాళ్లకంటే చదువులేనోళ్లే నయమన్న సామెత, గ్రేటర్ ఎన్నికల్లో అక్షరసత్యమయింది. కాళ్లు లేని వికలాంగులు.. ఒక్క కాలున్న వికలాంగులు, చేతికి కర్రను ఊతంగా చేసుకున్న పండు వృద్ధులకున్న ఓపిక... తీరిక, ‘మహానగర సకలాంగులకు’ లేకుండా పోయింది. తమ ఓటు హక్కు  వినియోగించుకున్న వికలాంగులే.. ‘ సకలాంగుల’నిపించుకున్నారు. కాలనీ బూత్‌లలో మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఓటరు జాడ మిణుకుమిణుకుమంటూనే కనిపించింది. అదే మురికివాడలు, బస్తీల్లోని పోలింగ్ బూత్‌లలో కనీసం 20, 30 మందితో ఉన్న క్యూలయినా కనిపించాయి. అడ్డగుట్ట ఒక్కటే ఓటర్లతో ఫుల్లయింది. అసలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడూ 50 శాతం వరకూ చేరిన దాఖలాలే లేవు. 2002లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 ఇప్పుడు 37 శాతానికి దగ్గరగా చేరింది. ఇక ఈ ఎన్నికలే ఇలా ఉంటే..  రానున్న గ్య్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు,  ఇంకెంత సక్కదనంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మేధావులు, మేతావులకు కొదువ లేని మహానగర దుస్థితి ఇది.

 

ఇంతోటి దానికి.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ-టీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ, ధర్నాలు, దౌర్జన్యాలు ఆరోపణలు, బురద రాజకీయాలు ఎందుకో అర్ధం కాదు. పాపం అమిత్‌షాలు, నద్దాలు, యోగులూ స్పెషల్‌ఫ్లైట్లు వేసుకుని వచ్చినా,  వారికి ఆయిల్‌ఖర్చు కూడా దండగే. నగరంలో ఆ మందం ఓట్ల శాతం  కూడా గిట్టుబాటుకాలేదు పాపం!   పోలింగ్ సరళి పరిశీలిస్తే.. బస్తీలు, మురికివాడలున్న ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు మొగ్గు కనిపించింది. ఇక కాలనీల్లో ఉన్న పోలింగ్ బూత్ ప్రాంతాల సరళి మాత్రం, బీజేపీ వైపే సానుకూలత వ్యక్తమయింది. కానీ కాలనీల్లోని పోలింగ్ బూత్‌లలో పోలింగ్ శాతం దారుణంగా కనిపించింది.  అయితే కమలం వికాసం పోలింగ్ బూత్ ప్రాంతాల కంటే,  బయటే ఎక్కువగా కనిపించింది.

 

కాగా.. తాజా సరళి తమకే అనుకూలమని తెరాస వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము కనీసం 90 నుంచి 95 స్థానాలు సాధిస్తామన్న అంచనాతో ఉన్నారు. అటు మజ్లిస్ హవా ఉన్న ప్రాంతాల్లో కూడా,  పోలింగ్ శాతం తగ్గినప్పటికీ.. తాము 40 నుంచి 45 స్థానాలు సాధిస్తామన్న ధీమా మజ్లిస్ నేతల్లో కనిపిస్తోంది. బీజేపీ మాత్రం తగ్గిన ఓటింగ్ శాతంతో, కొంత గందరగోళంలో పడినట్లు నేతల వ్యాఖ్యల బట్టి అర్ధమవుతోంది. తగ్గిన పోలింగ్ శాతం.. సహజంగా అధికారపార్టీకే అనుకూలంగా ఉంటుందని, అయినా తాము తీవ్రస్థాయిలోనే పోటీ ఇచ్చామని కమలదళాలు చెబుతున్నాయి.

 

ఇక పోలింగ్ సరళి తొలి నుంచీ మందకొడిగానే మొదలయింది. సహజంగా ఏ ఎన్నికల్లోనయినా... ఒక పార్టీపై ఆగ్రహం ఉంటే, ఓటర్లు  పోలింగ్ కేంద్రానికి ఉత్సాహంగా  తరలివస్తారు. ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో ప్రదర్శిస్తారు. సహజంగా ప్రజలకు అధికార పార్టీలపైనే   ఆగ్రహం ఉంటుంది కాబట్టి.. దానిని ఓడించాలని భావిస్తే, పోలింగ్‌బూత్‌లు ఓటర్లతో నిండిపోతాయి. ఆ పరిస్థితి, అలాంటి ఆగ్రహం ప్రదర్శించాలన్న కసి-పట్టుదల,  ‘గ్రేటర్’ ఎన్నికల్లో కనిపించలేదు. ఇక సహజంగా ఒక పార్టీకి మద్దతునివ్వాలనుకునే ఓటరు, తాపీగా.. సమయం చూసుకుని, తమ పనులు ముగించుకున్న తర్వాతనే  పోలింగ్ కేంద్రానికి వస్తారు. ఈలోగా తమ ప్రాధాన్యపరమైన పనులుంటే, పోలింగ్‌బూత్‌కూ రారు. కాకపోతే టీవీలు చూస్తూ, తమకు తెలిసిన వారికి ఫలానా పార్టీకి ఓటేయమని, లేకపోతే రాష్ట్రం నాశనమవుతుందంటూ  హితోక్తులు చెబుతుంటారు.

 

ఇది సహజంగా ఏ రాష్ట్రంలోనయినా కనిపించే ఓటర్ సైకాలజీనే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అదే కనిపించింది. ఫలితమే మందకొడి పోలింగ్. మిగిలినదంతా ‘షేమ్’ టు ‘షేమ్’!  పదండి ముందుకు.  పదండి తోసుకు.. పోదాం పోదాం హాలిడే ట్రిప్పులకు!! ప్రజాస్వామ్యం ఎటు పోతే మాకెందుకు? ఏమైపోతే మనకెందుకు? అయినా మన ఒక్క ఓటుతోనే రాజ్యాలు తారుమారవుతాయా ఏంటీ? మనకు హాలిడే ఇచ్చారా.. ఎంజాయ్ చేశామా అన్నదే కదా ముఖ్యం? అంతే కదా.... బ్రో?

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.