ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఏమయ్యారు?

Publish Date:Dec 24, 2019

Advertisement

ఎన్నికల ముందు వరకు టిడిపిలో ఉన్న తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ ఫలితాలు ఊహించి వైసీపీ లోకి జంప్ చేశారు. ఇలా వచ్చారో లేదో అలా సీటు దక్కడం ఇలా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై గెలిచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఊహించని విధంగా ఎంపికైన దుర్గా ప్రసాద్ నియోజక వర్గ ప్రజలకు కనిపించకుండా పోయారు. ఆయన ఎప్పుడు వస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఈయన తిరుపతి ఎంపిగా గెలిచాక కూడా గూడూరుకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే సమావేశాలు, రిబ్బన్ కటింగులలో తప్ప ఎంపీ కనిపించడం లేదు. ఎంపీకి సమస్యలు చెప్పుకుందామనుకునే ప్రజల సంగతి దేవుడెరుగు, కనీసం కార్యకర్తలకు కూడా బల్లి అందుబాటులో లేకుండా పోయారు. ఏదైనా అందామా అంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. పార్టీ హైకమాండ్ కు చెప్పుకుందామంటే అది ఎవరో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వైసిపి తిరుపతి నియోజక వర్గ కేడర్. కనీసం ఎంపీకి సంబంధించినవారైనా ఉన్నారా అంటే అది లేకుండా పోయింది. ఎంపీని కలవాలంటే ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి వచ్చిందని నగరవాసుల్లోనూ చర్చ నడుస్తోంది.  ఇక ఎంపీని కలవాలని నియోజక వర్గ ప్రజలు అడిగితే కుమ్మరోడికి కుండలు కరువ అన్న రీతిలో తమకే దర్శనభాగ్యానికి దిక్కులేదని సొంత పార్టీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. 

నెలకో రెండు నెలలకో ప్రెస్ మీట్ లో తప్ప మరెక్కడా కనిపించని ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ తీరు పై తిరుపతి ప్రజలు గుర్రుగా ఉన్నారని సమాచారం. గెలిచాకే కాదు ఎన్నికల ప్రచారంలో కొన్ని ప్రాంతాల వారికి కనీసం మొహం కూడా చూపించలేదు దుర్గా ప్రసాద్. పార్లమెంట్ నియోజక వర్గంలో కీలకమైన తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తిలో ఎక్కడ బల్లి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. గెలిచాకైనా మారతారు అనుకుంటే బల్లి దుర్గా ప్రసాద్ తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రైల్వే స్టేషన్ తనిఖీలు, ఆసుపత్రి తనిఖీ అంటూ హడావుడి చేయడం తప్ప నగర వాసుల సమస్యలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే భూమనతో ఉన్న భేదాభిప్రాయాల కారణం గానే బల్లి తిరుపతి మొహం చూడటం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలిచాక తిరుపతి వాసులకు వెంకన్న దర్శనం అయినా దొరుకుతుందేమో గానీ ఎంపీగారి దర్శనం అంతంత మాత్రమే అనే చర్చ జోరుగానే సాగుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే నియోజక వర్గం ప్రజల్లో అది తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని అంటున్నారు. ఇక ఆ ఎఫెక్ట్ పార్టీ పై పడుతుందని తిరుపతి వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీగారి దర్శనం ప్రజలకు ఏ మేరకు అందుతుందో చూడాలి.

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.