అమరావతిపై వైసీపీ విషం... పెట్టుబడులు పెట్టొద్దంటూ ఇన్వెస్టర్లకు సజ్జల హెచ్చరిక

Publish Date:Apr 10, 2026

Advertisement

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి గిట్టదని ఆ పార్టీ నేతలు తమ ప్రకటనలతో పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్నారెడ్డి మాటలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైసీపీకి సుతరామూ ఇష్టం లేదని  మరో సారి ప్రస్ఫుటంగా రుజువైంది. అమరావతిలో పెట్టుబడులు పెడితే కృష్ణ నదిలో కలిసినట్లేనని పెట్టుబడి దారులను హెచ్చరించింది. ఈ పార్టీ కీలక నేత, జగన్ హయాంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుబడిదారులను అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ హెచ్చరిక జారీ చేశారు.   రాజధాని అమరావతి పేరుతో సాగుతున్నదంతా అబద్ధపు ప్రచారమేనన్నారు.  

అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల. 

సజ్జల, వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నా.. వాస్తవానికి అక్కడ పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణం చేపట్టాయి. అవి దాదాపు తుది దశకు వచ్చాయి. ఇక స్టార్ హోటళ్లు, పలు వాణిజ్య, వ్యాపార సంస్థలు కార్యకలపాల నిర్వహణకు రెడీ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో అమరావతిలో పెట్టుబడులు పెడితే ఆ సొమ్ములు కృష్ణా నదిలో పారబోసినట్లే నంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమరశలు వెల్లువెత్తుతున్నాయి.

అమరావతి అభివృద్ధిని, అక్కడ వచ్చే పెట్టుబడులు అడ్డుకోవడమే వైసీపీ ధ్యేయంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మావిగన్ ప్రతిపాదనతో వైసీపీ అధినేత జగన్ ఒక ట్రోల్ మెటీరియల్ గా మారినట్లుగానే అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ సజ్జన చేసిన హెచ్చిరకపై కూడా నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడమే వైపీపీకి తెలుసుననీ, అభివృద్ధి అంటే గిట్టదనీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వైపు ప్రపంచం మొత్తం అమరావతివైపు చూస్తుంటే వైసీపీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని అక్కడ ఏమీ లేదని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.  

 జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేసి, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసిన సంగతిని జనం మరిచిపోలేదని, ఇప్పుడు మళ్లీ అమరావతిపై వైసీపీ కక్కుతున్న విషం ఆ పార్టీనే కబలించేస్తుందని అంటున్నారు పరిశీలకులు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ తీసుకున్న వైఖరి ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేకుండా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. 

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.