గోధుమరొట్టెలతో అసలుకే మోసం!

Publish Date:Mar 9, 2017

Advertisement

 

ఆరోగ్యం గురించి బోలెడు విషయాలు తెలుసు అని మనలో ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఎవరన్నా ఏదన్నా సమస్యని చెప్పగానే ఓ వైద్యుడిలాగా మారిపోయి తెగ సలహాలు ఇచ్చేస్తుంటాం. కానీ ఇలాంటి అరకొర నమ్మకాలతోనే మన జీవితాలు పాడైపోతున్నాయని నిపుణులు తలబాదుకుంటున్నారు. అలాంటి ఓ పే...ద్ద నమ్మకమే - గోధుమ రొట్టెలు తినడం చాలా మంచిది అనే మాట!

 

ఊదరగొట్టేశారు

 

ఎవరన్నా తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధగా ఉంచేందుకు చేసే మొదటి ప్రయత్నం రాత్రివేళల్లో గోధుమ రొట్టెలని తినడం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు లేదా వయసు మీద పడినవారు ఇప్పుడు రాత్రియితే అన్నం ముట్టుకోకుండా చపాతీలనే తింటున్నారు. ఇదంతా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న మార్పు మాత్రమే. ఈ మార్పు వెనుక ఆరోగ్య కారణాల కంటే వ్యాపార సంస్థలు చేసిన ప్రకటనలే ప్రభావం చూపాయంటున్నారు నిపుణులు.

 

సమస్యలు ఎక్కువే!

 

బియ్యంతో పోలిస్తే గోధుమలని అరాయించుకోవడంలో చాలా సమస్యలు ఉంటాయి. Celiac Disease, Wheat Allergy, Gluten Sensitivity వంటి ఇబ్బందులతో మన శరీరం తెగ సతమతం అయిపోతుంది. వీటివల్ల తలనొప్పి దగ్గర్నుంచీ విరేచనాల వరకూ నానారకాల సమస్యలు తలెత్తుతాయి. దురదృష్టవశాత్తూ ఈ సమస్యల వెనుక కారణం గోధుమలతో చేసిన ఆహారం అన్న విషయం చాలామందికి తెలియదు. అసలు 90 శాతానికి పైగా జనానికి, తమకి గోధుమలు పడవు అన్న విషయమే తెలియదట.

 

ఒకవేళ సరిపడినా!

 

గోధుమలు ఒకవేళ మన ఒంటికి సరిపడతాయే అనుకుందాం. అప్పుడు కూడా అవేమంత ఆరోగ్యకరం కాదంటున్నారు. గోధుమలలో gluten, gliadin అనే ప్రొటీన్లు ఉంటాయి. గోధుమ బంకగా ఉండటానికి gluten కారణమవుతుంది. ఇది మన పేగులకు అంటుకుని ఓ పట్టాన జీర్ణం కాదట. తరచూ ఇలా గ్లుటెన్తో మన పేగులకి పరీక్ష పెట్టడం వల్ల నిదానంగా వాటి శక్తి క్షీణించిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీని వలన జీర్ణశక్తి మందగించడమే కాకుండా, శరీరానికి అవసరమయ్యే పోషకాలను శోషించుకునే గుణాన్ని కూడా పేగులు కోల్పోతాయి. ఇక గోధుమలు ఒక వ్యసనంలా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. వీటిలో ఉన్న gliadin అనే ప్రొటీన్ వల్ల రోజూ గోధుమలని తినాలని శరీరానికి అనిపిస్తూ ఉంటుందట.

 

షుగర్ కూడా హుళుక్కే!

 

గోధుమ రొట్టెలని తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుదన్నది ఓ ప్రధానమైన నమ్మకం. కానీ ఇందులో కూడా వాస్తవం లేదంటున్నారు. గోధుమలు తిన్న వెంటనే వాటిలోని చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరిపోతుందట. ముఖ్యంగా బ్రెడ్, రిఫైన్డ్ గోధుమలతో మనలోని చక్కెన నిల్వలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. ఆహారం తిన్న తరువాత అందులోని చక్కెర మన రక్తంలోకి చేరుకునే విధానాన్ని కొలిచేందుకు ‘glycemic index’ అంటారు. ఇది బియ్యంతో పోలిస్తే గోధుమ పదార్థాలలో పెద్ద తేడాగా ఏమీ కనిపించదు.

 

హైబ్రీడు విత్తనాలు - రిఫైన్డ్ పిండి

 

ఇప్పుడు మనకి లభిస్తున్న గోధుమపిండి మరో ముఖ్య సమస్య. ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందనో, పిండి మెత్తగా ఉంటుందనో... కారణం ఏదైతేనేం, ఇప్పుడంతా హైబ్రీడు గోధుమ విత్తనాలను వాడుతున్నారు. వీటివల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీసేలా ఆటోఇమ్యూన్ వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక రొట్టెలు రుచిగా, మృదువుగా ఉండేందుకు వీటిని వీలైనంత రిఫైన్ చేస్తున్నారు. ఇలాంటి గోధుమ రొట్టెలు ఎంతవరకు ఆరోగ్యమో ప్రత్యేకించి చెప్పేదేముంది!!!

 

అదన్నమాట సంగతి! అంచేతా గోధుమ రొట్టెలో గోధుమ రొట్టెలో అని తెగ తపించిపోకుండా... వేరే ప్రత్యామ్నాయాల ద్వారా తగినంత పోషకాలను సాధిస్తూ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోమని సూచిస్తున్నారు. ముతక బియ్యం, తాజా కూరగాయలు, కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు తీసుకుంటూ తగినంత వ్యాయామం చేయమన్నది నిపుణులు మాట.

- నిర్జర.

 

 

By
en-us Political News

  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.