చెల్లెళ్లకు మిగిలేది దిగులేనా?
Publish Date:Oct 19, 2022
Advertisement
అన్నీ, అందరూ ఉన్నా కొందరికి జీవితం ఏమాత్రం సుఖంగా సాగదు. అధికారం, పిలిస్తే పలికే మనుషు లు అంతా ఉన్నట్టే ఉంటుంది కానీ ఎవరూ, ఏదీ తమవి కావన్న బాధ మనసుని తినేస్తుంటుంది. ఎవరికి ఎవరు చివరికి ఎవరు.. వంటి గీతాలే బాగా ఇష్టంగా పాడుకోవాల్సిన ఒంటరితనంలో మిగిలి పోతుంటారు. ఇపుడు ఇలాంటి వెలుగు జారిపోతున్న రాజకీయ గదుల్లో ఇద్దరు ఆడపడుచులు బెంగె ట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు. ఒకరు ఆంధ్రా, మరొకరు తెలంగాణాకి చెందినవారు. వారే ఆర్.కె. రోజా, కల్వకుంట్ల కవిత. ఆర్.కె. రోజా అనేకంటే ఒకనాడు టాలీఉడ్‌ని ఏలిన సూపర్ హీరోయిన్ రోజా అంటేనే ఠక్కున గుర్తుకు వస్తుంది. వివాహం తర్వాత సినిమాలు తగ్గించుకున్న రోజా మెల్లగా రాజకీయాల్లో ఆసక్తితో అడుగిడినా తన వాక్చాతుర్యం, ధైర్యసాహసాలతోనే అందరికీ బాగా ఎరుక. ఏమాత్రం భయంలేని ప్రకటనలు చేయడం, విపక్షాలవారితో అంతే స్థాయిలో విరుచుకుపడటంలో ఆమె ప్రత్యేకత ఆమెది. రోజా బీఎస్సీ చదువుతున్న ప్పుడే ప్రేమ తపస్సు సినిమా ద్వారా సినిమాలకు పరిచయమైంది. అంతకు ముందు ఆర్కే రోజా తమిళ చిత్రం చంబరతిలో నటించారు. ఈ చిత్రం కోలీవుడ్‌లో మ్యూజికల్ హిట్ అయ్యింది తెలుగులోకి చేమంతి అనే టైటిల్ తో డబ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఆర్కే సెల్వమణి ఈ చిత్రాన్ని రూపొం దించారు. రోజా అతనిని వివాహం చేసుకున్నారు. ఆర్కే రోజా 2004లో నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆమె చెంగారెడ్డి రెడ్డివారిపై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆమె మళ్లీ పోటీ చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో చేరిన రోజా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. రోజా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలి చా రు. 2014 అసెం బ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్, దివంగత సీనియర్ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు పై రోజా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్‌పై విజ యం సాధించారు. వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా.. ప్రతిపక్షాలను సైతం వదలడం లేదన్న విషయం తెలిసిం దే. రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెది తనదైన శైలి. 2020 నుంచి రెండేళ్లపాటు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం లో మంత్రిగా చేస్తున్నారు. కానీ వాడిగా, వేడిగా మారిపోతున్న రాజకీయాల్లో ఆమె నమ్ముకున్న పార్టీగాని, అన్న సీఎం జగన్ గాని ఆమె రాజకీయ భవి ష్యత్‌కు ఢోకా లేదని మాత్రం చెప్పలేకపోతున్నారు. కారణం పార్టీ పరిస్తితులు అధోగతకి మళ్లాయి. సినిమాల్లో, టీవీ షోల కంటే ప్రజలకు సేవచేయాలంటే రాజకీయాల్లోనే ఉండాలన్న నిర్ణయం తో వైసీపీలో చేరినప్పటికీ, ఆమెకు మొదటి నుంచి తగినంత గుర్తింపు లభించలేదనే అనాలి. కేవలం విప క్షాలవారి మీద విరుచుకు పడటం తప్ప పార్టీవారు, సీఎం జగన్ చెల్లమ్మా అనడం తప్ప ఆమెకు తగ్గ స్థాయిని తొలి విడత కల్పించలేదు. క్రమేపీ ప్రభుత్వ విధానాలు, పాలన పట్ల ప్రజలు విసిగెత్తి ప్రభుత్వ వైఖరిని దుయ్యపట్టడం ఆరంభించారో అప్పటికి మంత్రివర్గంలో మార్పులు ఎంతో అవసరమన్న జ్ఞానం కలిగి రోజాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ ఇది మూడేళ్ల ముచ్చట కూడా కాదన్నది ఆమెకు తెలు సు. మూడేళ్ల పాలన తర్వాత కూడా ప్రజలు ప్రభు త్వం పట్ల ఏమాత్రం ఆసక్తి లేకపోవడం, పార్టీలో నాయ కులకు, అధినేతకు మధ్య పనితీరులో వచ్చిన వ్యత్యాసాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన అన్నీ వెరసి రెండోవిడత మంత్రివర్గంలోకి వచ్చిన మంత్రులకు ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాని వంటి వారు నోటి దురుసుతో ప్రతిపక్షం మీద, నాయకుల మీద భాషలో లేని మాటలతో చాలా ఛండాలమైన తిట్లపురాణాం అందుకోవడంతో పార్టీ పరువు బజారున పడింది. ఇలాంటి పరిస్థితులు రోజా వంటి కొత్త మంత్రులకు మరి జనాల్లోకి వెళ్లడానికి ఇబ్బందికరంగానే మారాయనాలి. రాబోయే ఎన్నికలనాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని, భారీ మెజారిటీతో గెలవాలంటే తనతోపాటు అందరూ కష్టించి పని చేయాలని జగన్ ప్రవచనం లాంటి హెచ్చరికలు చేయడం రోజా వంటి కొత్త మంత్రులకు మనసు కష్ట పెట్టింది. మూడేళ్లన్నా సుఖంగా ఉండాలనుకుంటే విప క్షాల తిట్లు తినాల్సి వస్తోందన్న బాధ కక్కలేక మింగలేకుండా ఉన్నారు. పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసికెళ్లి గతంలో కంటే నాలుగు ఓట్లు ఎక్కువచ్చేట్టు చేయాలని ప్రయత్నించడంలో లోపం లేకపోవ చ్చు. కానీ ప్రయత్నాలన్నీ ఆలస్యంగా ఆరంభిం చడం తోనే విపక్షాలు లబ్దిపొందేందుకు మార్గం కల్పించినట్ల యింది. ఊహించనివిధంగా మళ్లీ టీడీపీ ని, చంద్ర బాబు నాయకత్వాన్ని ప్రజలు ఆశిస్తున్న ఈ తరుణంలో జగనన్న ఇక నిలవలేని స్థితిలో ఉన్నారు. చెల్లి రోజాను గట్టిగా హెచ్చ రించలేని స్థితి ఆ అన్నది. చెల్లి రోజా కేవలం నవ్వడం తప్ప ఇంకేమీ చేయలని పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోతోంది. పర్యటక మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటగానే అయింది. జబర్ దస్త్ సీన్లు రిపీట్‌గా చూపించినా అస్సలు నవ్వు చిలికే పరిస్థితి లేదు. ఇక తెలంగాణా ముద్దుబిడ్డ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ జెఎన్‌టీయూలో ఇంజనీ రింగ్ చేసిన కవిత రాజకీయాల్లోకి రావడానికి ముందు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. 2006లో నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి తోడ్పడ్డారు. ఆమె భర్త అనిల్ కుమార్ ఇంజనీర్. కల్వకుంట్ల కవిత అనేక కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల తరఫు న కూడా కొంత కాలం పనిచేశారు. 2014లో తెలంగాణా ఆవిర్భావం, కావడంతో ఆమె నిజా మాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఏకంగా లక్షా 70వేల మెజారిటీతో గెలిచారు. ఎంపీగా తెలంగాణా, ఇతర జాతీ య సమస్యల్ని పార్లమెంటులో చర్చించి జాతీయస్తాయిలో అన్ని పార్టీలూ ఆలోచించేలా చేశారు. పార్లమెంటులో అనేక ప్రముఖ కమిటీలకు గౌరవ సభ్యురాలుగానూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా సాగి పోతున్న ఆమె రాజకీయ జీవితానికి ఊహించని విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మాయని మచ్చగా తయారయింది. ఆమెను అప్పటివరకూ ఎంతో మంచి స్నేహితురాలిగా, అక్కగా, చెల్లి గా భావించుకున్న రాజకీయనాయకులు, సన్నిహితులంతా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇది స్వయంకృతమా అంటే అవుననే అంటున్నాయి వార్తలు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణా నికి సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తు న్నా యి. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని, మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని, ఈ విధానం రూపకల్పనకు సంబంధిం చిన భేటీ లకు కేసీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారని పర్వేశ్ వర్మ ఆరోపిం చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంతో నేరుగా సంబంధం ఉందని, ఎక్సైజ్ కమిషనర్‌తో పాటు కేసీఆర్ కుటుంబం కూడా డీల్ రూపకల్పనలో భాగస్వామమై ఉందన్నారు. తర్వాత డొంక కదిలి హైదరాబాద్‌లోనూ ఈడీ, సీబీఐ దాడులు, సోదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆర్.ఎస్. బ్రదర్స్ వంటి పెద్ద పెద్ద మాల్స్ ల్లోనూ సోదాలు జరగడం సాధారణ మధ్యతరగతి వర్గాన్నీ ఆశ్చర్య పరిచింది. ఇపుడు కవితకు తప్పించు కునేందుకు సమయం తగ్గింది. ఉచ్చుబిగుస్తోందన్న వార్తలే వినబడుతున్నాయి. ఒకవంక మునుగోడు ఉప ఎన్నిక, మరో వంక కుమార్తె కవిత రాజకీయ భవిత రెండూ తెలంగాణా ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కడు ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాయి. కూతురిని కాపాడుకోవడానికి ఢిల్లీలోనే కేసీ ఆర్ మకాం వేశారు. కేంద్రం మీద విరుచుకు పడే కేసీఆర్ ఇపుడు కేంద్రంలోని కీలక బీజేపీ నాయకులతో మంతనాలు చేస్తున్నారు. కూతురుని ఆ ఉచ్చునుంచి తప్పించాల ని వేడుకుంటు న్నారనే అనాలి. తనను తన తండ్రి రక్షించాలి, బీజేపీ మాట వినే ఆర్ ఎస్ ఎస్ నేతలు రక్షించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నారు. అన్ని దారులూ మూసుకుపోయి తాను రాజకీయాలకు మరీ దూరమయి సాధా రణ మహిళగా మిగిలిపోవడం కంటే తండ్రి సహకారంతో కేంద్రంలో వారిచేత సరే రక్షిస్తామని పించుకోవడమే ఇక కవితకు మిగిలింది. కానీ అది అంత సులువుగా జరు గుతుందా అన్నదే అను మానం. తెలంగాణా రాజకీయ నాయ కులు అందరూ కేంద్రం మీద ప్రతీ అంశంలోనూ విరుచుకు పడుతున్నారు. మునుగోడులో గెలవాలన్నా, పోనీ పరువు దక్కించుకోవాలన్నా ఈ కుంభకోణం ఉచ్చునుంచీ కవిత యమర్జంట్‌గా బయట పడాలి. కేసీఆర్ సొంతగా విమానం కొనడం మంచిదయిం దనే అనుకోవాలి. ఢిల్లీ, హైదరాబాద్ చక్కర్లకు ఇబ్బంది లేకుం డా పోయింది. లేకుంటే ప్రతీ విమానాశ్రయంలోనూ కూతురు గురించి ప్రతీవారూ ప్రశ్నించి వేధిం చే అవకాశమే ఉంటుం ది.కేసీఆర్ తన పరువు ప్రతిష్ట పక్కనపెట్టి కూతురు కష్టాలు తీర్చడానికి తండ్రిగా వ్యవహరిస్తారా, బీఆర్ ఎస్ అధినేతగానా, తెలంగాణా ముఖ్యమంత్రిగానా అన్నది వేచి చూడాలి. కానీ కల్వకుంట్ల కవిత మాత్రం లోలోపల దుఖిస్తూ ఆట్టే రోజులు వేచి ఉండలేక పోవ చ్చు. తండ్రి నుంచే సహాయం ఏమాత్రం అందు తుంది, ఆయన ఏమాత్రం కాపాడుతాడన్నదే భీతితో ఆమె ఎదురుచూస్తోంది. తమ్ముడు కేటీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నాడన్న ప్రచారం బాగా ఉంది. ఆయనకు ఈ ప్రయత్నాలు ఫలిస్తే మరో ఉన్నత పదవికి దారి సుగమమవుతుందన్న గొప్ప ఆనందం ఆయనది.
http://www.teluguone.com/news/content/whats-left-to-sisters-25-145675.html





