రాజగోపాలా.. ఆసలు రాజీనామా ఎందుకు చేశావయా?

Publish Date:Aug 4, 2022

Advertisement

కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రోజుల తరబడి కొనసాగించిన సస్పెన్స్ కు తన రాజీనామాతో తెర దించేశారు. మునుగోడు శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసేశారు. మునుగోడు ఉప ఎన్నిక జరగడం ఖాయమని తేల్చేశారు.

అయితే రాజగోపాలరెడ్డి రాజీనామా రాజకీయంలో ఆయనకు ఎలాంటి క్లారిటీ లేదని తేటతెల్లమైపోయింది. రాజీనామా ఫీలర్ల సమయంలోనూ, రాజీనామాకు ముందూ, ఆ తరువాత ఆయన మీడియా సమావేశాలలో చెప్పిన అంశాలు, మాట్లాడిన మాటలూ వింటే అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకైనా తెలుసా అన్న అనుమానం రాక మానదు. ఎందు కంటే ఆయా సందర్బాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయనలో ఉన్న అయోమయాన్ని, కన్ఫ్యూజన్ ని ఎత్తి చూపాయి. ఒక సారి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని పీసీసీ చీఫ్ చేస్తే ఆయన కింద మేం పని చేయాలా? అని ప్రశ్నించిన రాజగోపాల్ కేవలం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించినందునే తాను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మరో సారేమో రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తున్నాననీ, అయితే కేసీఆర్ ను ఢీ కొనే సత్తా కాంగ్రెస్ లో లేదు కనుకనే పార్టీని వీడి కమల దళంలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు.

తీరా రాజీనామా చేసేసిన తరువాత ఇంత కాలంగా తన మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనీ, ఉప ఎన్నిక వస్తేనైనా నియోజకవర్గ అభివృద్ధి పనులను కేసీఆర్ సర్కార్ చేపడుతుందన్న ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. ఇలా ఆయన తన రాజీనామాకు ఒకటి కాదు ఏకంగా మూడు రకాల కారణాలు చెబుతున్నారు. పోనీ ఆ మూడు కారణాలతోనే తాను రాజీనామా చేశానని స్పష్టత ఇచ్చారా అంటే అదీ లేదు. ఒక్కో కారణాన్నీ ఒక్కోసందర్భంలో చెప్పారు. దీంతో అసలు ఆయన రాజీనామాకు కారణమేమిటా అని నియోజకవర్గం ప్రజలే తలలు గోక్కుని అయోమయంలో పడ్డారు. ఇక నెటిజనులైతే రాజగోపాల రెడ్డి అయోమయం, కన్ష్యూజనే మునుగోడు ఉప ఎన్నికకు దారి తీసిందన్నారు. ఇక షబ్బీర్ అలీ అయితే ఆయన ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని ఆరోపిస్తూ.. దాని నుంచి బయటపడడానికే కమలాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. సరే ఇప్పుడు ఇక ఎలాంటి సందేహం లేదు. మునుగోడు ఉప ఎన్నిక ఖాయం. రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేశారు. కమలం తీర్థం పుచ్చుకుంటారు.

అందులోనూ సందేహం లేదు. కనీసం బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికలో నిలబడి నియోజకవర్గ ప్రచారానికి వచ్చినప్పుడైనా తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులేమిటన్నది క్లారిటీ ఇవ్వగలరా అంటే అదీ అనుమానమేనంటున్నారు పరిశీలకులు.  ఎందుకంటే ఒకటి రెండు నెలలు అటూ ఇటూగా ఏడాదిలోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపుగానే ఇప్పుడు హడావుడిగా రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెరతీయడమెందుకని ఆయన అనుచరులే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది.రాజగోపాల రెడ్డి కన్ఫ్యూజన్ కారణంగా ఈ ఉప ఎన్నికలో బీజేపీకి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న అనుమానాలు కమలం శ్రేణుల్లోనే కలుగుతున్నాయి. అసలు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు, ఆయన బీజేపీలో చేరికకు పార్టీ అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారని కమలం శ్రేణులు భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో అయితే గాంధీ భవన్ లో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుని మరీ రాజగోపాల్ రెడ్డి రాజీనామాను సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ రాజీనామా ప్రకటనతో చల్లబడిపోయిందనే చెప్పాలి. అందుకు ఆయన కన్ఫ్యూజనే కారణమని అంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా ఆ రాజీనామా బీజేపీకి ఏం ప్రయోజనం అన్నది పక్కన పెడితే ఆయనకైనా ఉపయోగపడుతుందా అన్నదే.

By
en-us Political News

  
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.