మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే బీజేపీకే కీలకం

Publish Date:Aug 4, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకమే అయినా.. ఈ ఉప ఎన్నికను ఎన్నికల సంవత్సరంలో ఆహ్వానించడానికి బీజేపీ వినా మిగిలిన రెండు పార్టీలూ అంత సిద్ధంగా లేవు. ముఖ్యంగా టీఆర్ఎస్. మరో 14 నెలలలో షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తు ఎన్నికలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కొద్ది రోజుల కిందట ఫీలర్లు వదిలినా తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనించి ఆ ఊసెత్తడం లేదు.

అయినా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ కు ఇదేమీ రుచించే విషయం కాదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ఎన్నికలో విజయం సాధించి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఎంత మాత్రం లేదు.  ఇక  కాంగ్రెస్  విషయానికి వస్తే  మూమూలుగా అయితే ఉప ఎన్నికను పట్టించుకోవలసిన అవసరం ఆ పార్టీకి పెద్దగా లేదు. ఆ పార్టీ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. కానీ మునుగోడులో రాజీనామా చేసినది సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతికూల ఫలితం వస్తుందన్న జంకు ఆ పార్టీకి ఉంటుంది.

అందు కోసం బలమైన అభ్యర్థిని ఉప ఎన్నికలో నిలబెట్టి సానుకూల ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తేంది అందులో సందేహం లేదు. కానీ మునుగోడు ఉప ఎన్నికలో నిజమైన సవాల్ మాత్రం బీజేపీకే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలో విజయం సాధించినా, పరాజయం పాలైనా టీఆర్ఎస్ కు ఒరిగేదీ లేదు, పోయేదీ లేదు. అంతోటి దాని కోసం మునుగోడుపై శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి సొమ్ములు గుమ్మరించే పని ఆ పార్టీ చేసే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఆ పార్టీ సమాయత్తమౌతోంది. శక్తియుక్తులన్నీ ఆ ఎన్నికల కోసమే వినియోగిస్తుంది కానీ ఓ ఆరు నెలల భాగ్యానికి మునుగోడులో చమటోడ్చే పని చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. అయినా ఉప ఎన్నికల సవాళ్లు, దాని వెనుక ఉండే వ్యూహాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే మొదలయ్యాయి.

అందుకు ఉప ఎన్నిక సవాల్ ను స్వీకరించి బీజేపీ టీఆర్ఎస్ పడే అవకాశాలు లేవు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. మునుగోడు ఉప ఎన్నికకు దారి తీసిన పరిస్థితులు రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసమేనని పరిశీలకులే కాదు, సామాన్య జనం కూడా గుర్తించేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ బలోపేతం అయ్యిందంటే అందుకు పీసీసీ చీఫ్ గా రేవంత్ కష్టమే కారణం. అందుకే కేవలం రేవంత్ టార్గెట్ గా బీజేపీ రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి  ఉప ఎన్నికలలో ఆయననే గెలిపిస్తామన్న హామీ ఇచ్చిందని చెబుతున్నారు.

సో.. మునుగోడులో కాంగ్రెస్ కు ఫలితం అటూ ఇటూ అయినా అది కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు. ఆ వెంటనే జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే కాన్సన్ ట్రేట్ చేయమని రేవంత్ కు చెబుతుంది తప్ప అంతకు మించి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. ఇక మిగిలింది బీజేపీ. బీజేపీకి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక చావో రేవుతో సమానం. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఫలితం అటూ ఇటూ అయితే ఆ పార్టీ ఇంత కాలం రాష్ట్రంలో ఇచ్చిన బిల్డప్ అంతా గాలి బుడగలా తేలిపోతుంది. ఒక వేళ ఫలితం అనుకూలంగా వచ్చినా బీజేపీకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఏ మాత్రం కార్యకర్తల బలం లేని మునుగోడులో విజయం సాధించామని సంబరపడే అవకాశం కూడా ఆ పార్టీకి ఉండదు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవ్వాల్సి ఉంటుంది. అయినా సరే ఏ మాత్రం ఉపయోగం లేని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వచ్చేందుకు బీజేపీ శక్తియుక్తులన్నీ ఒడ్డక తప్పని పరిస్థితి. పరాజయం పాలైతే తెలంగాణలో అధికారం అన్న ఆశను ఆ పార్టీ ఇక వదిలేసుకోవలసిందే. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఆ పరిస్థితి లేదు. మునుగోడు ఫలితం ఎలా వచ్చినా ఆ పార్టీల ప్రధాన లక్ష్యం మాత్రం అసెంబ్లీ ఎన్నికలే అన్న స్పష్టత ఆ పార్టీలలో ఉంది. బీజేపీ మాత్రం తెలంగాణలో తిరుగులేని బలం ఉందన్నది చాటుకోవడానికే ఒక విధంగా చెప్పాలంటే బలవంతంగా తీసుకువచ్చినది మునుగోడు ఉప ఎన్నిక కనుక ఇక్కడ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఆ పార్టీది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఆ పార్టీకి సానుకూలంగా వచ్చినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు బీజేపీకి నల్లేరు మీద బండి నడక అవుతుందని భావించడానికి వీల్లేని పరిస్థితి.  

By
en-us Political News

  
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.