నేనేమీ చేశాను నేరం.. శోక సంద్రంలో మాజీ హోంమంత్రి

Publish Date:Apr 29, 2022

Advertisement

మేకతోటి సుచరిత... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మాజీ మంత్రి. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉండి కూడా ఈ సుచరిత... ఏనాడు.. ఎఫ్పుడు... ఎక్కడా.. అధికారం అడ్డం పెట్టుకుని.. హల్‌చల్ చేయలేదు. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ఆమె.. ఎన్ని ప్రెస్‌మీట్లు పెట్టిందంటే మాత్రం వెళ్ల మీద లెక్క పెట్టి మరీ చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే.. అంతా కామ్ గోయింగే. తన పనేదో తనదే... ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు వస్తేనే కానీ ఈ హోం మంత్రిగారు ప్రెస్ మీట్ పెట్టీ నోరు విప్పిరంటూ సుచరిత మీద ప్రతిపక్ష టీడీపీ అయితే ఓ అపవాదు కూడా వేసి పారేసింది. 


అయితే జగన్ కేబినెట్ ఇటీవల కొత్తగా కొలువు తీరడం.. ఆ క్రమంలో సుచరిత కామెంట్స్ చేయడం.. ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ.. రంగంలోకి దిగి ఆమె ఇంటికి వెళ్లడం.. ఆయన చేతినే సుచరిత.. తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖ ఇవ్వడం.. ఇదే విషయాన్ని సుచరిత కుమారుడు, కుమార్తె స్వయంగా మీడియాకు వెళ్లడించడం... ఆ క్రమంలో సుచరిత నివాసం వద్ద ఆమె అనుచరులు అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఓ రెంజ్‌లో ఫైర్ కావడం.. ఆ తర్వాత సీఎం జగన్‌తో సుచరిత భేటీ అవడం.. అనంతరం ఆమె కూల్‌గా మీడియా ముందుకు వచ్చి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేదు.. ఏమీ లేదు.. అంటూ ముక్తాయింపు ఇవ్వడం జస్ట్ మూడు నాలుగు రోజుల్లో అంత సద్దుమణిగిపోయింది. 


అయితే మేకతోటి సుచరిత హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె మాజీ మంత్రి అయ్యే వరకు.. సొంత పార్టీలోనే చాలా సమస్యలు ఎదుర్కొన్నారని సమాచారం. హోం మంత్రిగా ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్నా.. ఆమెకు ఈ జగన్ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదని మేకతోటి సుచరిత తరచు తన సన్నిహితుల వద్ద వాపోయే వారట. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి అయినా ఆమెకు సరైన ప్రోటోకాల్ కూడా పాటించేవారు కాదని సుచరిత సొంత నియోజకవర్గ ప్రజలే గుసగుసలాడుకోవడం గమనార్హం. ఇక ఆమె ప్రెస్‌మీట్ పెట్టాలంటే.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావాలని.. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో ఆమె తీవ్ర  నిరాశా నిస్పృహాలోకి వెళ్లిపోయారని పత్తిపాటులోని కేడర్‌లో ఓ టాక్ అయితే నేటికి వైరల్ అవుతోంది. 


అంతేకాదు.. మంగళగిరి నియోజవకర్గంలో అయితే కొన్నిప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సైతం శిలాఫలకాలపై ఆమె పేరు ఉండేది కాదట... ఈ విషయం ముందుగానే తెలుసుకుని.. ఆయా కార్యక్రమాలకు సుచరిత డుమ్మా కొట్టేవారని నియోజకవర్గ ప్రజలే చెప్పుకోవడం గమనార్హ:. మరోవైపు తన శాఖను అనదికారికంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా సార్లు నిర్వహించడం పట్ల సుచరిత.. లోలోపల రిగిలిపోయే వారని సమాచారం.  అంతేకాదు.. జగన్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహించే ప్రపంచ మహిళా దినోత్సవం తదితర కార్యక్రమాల్లో విడుదల రజినీ, రోజా, వాసిరెడ్డి పద్మ, తానేటి వనిత తదితరులు ఉన్నా.. అక్కడ సుచరిత లేక పోవడం పట్ల .. పార్టీ మహిళల్లోనే ఓ సందేహాలు వ్యక్తమయ్యేవని సమాచారం. 

అదీకాక సుచరిత భర్త మేకతోటి దయాసాగర్. ఆయన ఐఆర్ఎస్ అధికారి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఆయన కీలక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి.. భార్య కీలక మంత్రి పదవిలో ఉండి.. భర్త మరో కీలక పదవిలో ఉండడం చట్టాలకు విరుద్దమంటూ సదరు కీలక నేతలు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేయడమే కాదు..నాటి హోం మంత్రి సుచరిత భర్తను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీపై సాగనంపే వరకు సదరు ఫ్యాన్ పార్టీ నేతలు విశ్రమించిందే లేదని సమాచారం. ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకున్న సుచరిత.. తనలో తానే కన్నీరుమున్నీరు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఎప్పుటికప్పుడు మిన్నకుండి పోవడం తాను చేసిన పెద్ద తప్పని సుచరిత తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.