రాజ్య సభకు కృష్ణయ్య జగన్ రెడ్డి వ్యూహం ఏమిటో ?
Publish Date:May 18, 2022
Advertisement
పొరుగు రాష్ట్రానికి చెందిన. అది కుడా తమ పార్టీకి రాజకీయ ఉనికి, స్టేక్ లేని తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్యకు వైసీపీ రాజ్య సభ టికెట్ ఆఫర్ చేశారు. (షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సమయంలో వైసీపీకి తెలంగాణలో పార్టీ విస్తరించే ఆలోచన లేదని సజ్జల రామ కృష్ణా రెడ్డి స్పష్టం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది). ఇదొక అనూహ్య పరిణామం అనిపించినా, కాదు. వ్యూహాత్మకంగానే జగన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని, కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనక జగన్ రెడ్డి వ్యూహం ఏమిటి? ఏమై ఉంటుంది? అంటే, అందుకు ప్రధానంగా, వినిపిస్తున్న విశ్లేషణ ఓటమి భయం. అవును, జగన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ‘మూడేళ్ళ క్రితం ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గడచిన మూడు సంవత్సరాలలో పేదల ఆదాయ మార్గాలకు గండి కొట్టి, తాయిలాలు ఎరగా వేసి, మళ్ళీ ఎన్నికల్లోనూ విజయం సాధించవచ్చనే ఎత్తుగడతో సాగించిన పాలన పూర్తిగా బెడిసి కొట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే బూమ్రాంగ్ అయింది. జగన్ రెడ్డి సంక్షేమం పేరుతొ తమను మోసం చేస్తున్నారనే నిజాన్నిసామాన్య జనం ఎప్పుడోనే గ్రహించారు. మరో వానక ఇప్పుడు గడపగడపకు కార్యక్రమంలో వ్యక్తమవుతున్న నిరసనలు. మంత్రులు, ఎమ్మెల్యేలు అని చూడకుండా ప్రజలు వైసీపీ నాయకులను ప్రతి గడపన నిలదీస్తున్న తీరుతో, జగన్ రెడ్డికి తత్త్వం బోధ పడింది. ఓటమి తథ్యం అనే సత్యం తెలిసొచ్చింది. అందుకే బీసీల ఓటల్కు గాలం వేసేందుకు, పొరుగు రాష్ట్రం నుంచి అరువు తెచ్చుకుని మరీ ఆర్. కృష్ణయ్యకు, అలాగే మరో బీసీ నేత బీరం మస్తాన్ రావుకు, రాజ్యసభ టికెట్ ఇచ్చి బరిలో దింపారు. అంతవరకు బానే వుంది. అయితే, ఈ వ్యూహం ఫలిస్తుందా, అంటే, అందరినీ అన్ని వేళల మోసం చేయడం, జగన్ రెడ్డికి అయినా, చివరకు ‘మహా’ నేతకు అయినా అయ్యే పని కాదని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అది నుంచి తెలుగు దేశం పార్టీకి, అండగా ఉన్న బీసీ సామాజిక వర్గాలు, 2019 ఎన్నికల్లో, జగన్ రెడ్డి, ‘ఒక్క ఛాన్స్’ నినాదాన్ని నమ్మి మోస పోయారు. కొంచెం చాలా అలస్యంగానే అయినా, చేసిన తప్పు తెలుసు కున్నారు. అదే తప్పు మళ్ళీ చేయరాదనే నిర్ణయానికి వచ్చారు. బీసీల మాతృ సంస్థ టీడీపీ వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముదస్తు ఎన్నికలకు వెళ్ళినా, గడువు ప్రకారమే ఎన్నికలు వెళ్ళినా, వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని బీసీలే కాదు, అన్నివర్గాల ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. చివరకు సాధారణ మహిళలు కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఓడించి తీరుతామని బహిరంగగా సవాలు విసురుతున్నారు. అంటే, పరిస్థితి ఎంత భయంకరంగా వుందో వేరే చెప్పనక్కరలేదు. సో.. సొంత రాష్ట్రంలోనే స్వయంగా ఓడిపోయిన ఆయన పొరుగు రాష్ట్రంలో, పొడిచేది ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు, జగన్ రెడ్డికి, ఎవరు ( పీకే కాదు కదా) ఈ అద్భుత సలహ ఇచ్చారో ఏమో కానీ, ఇది కూడా బూమ్రాంగ్ అవుతుందని అంటున్నారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’ స్వరాష్ట్రంలో, సొంతంగా గెలవలేని , స్వయం ప్రకటిత బీసీ నేత కృష్ణయ్య వలన వైసీపీకి రాజకీయ ప్రయోజనం కంటే, నష్టమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. బీసీలను అడ్డుపెట్టుకుని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన కృష్ణయ్య వలన వైసీపీ మూడేళ్ళ ముదనష్ట పాలనలో సొంతం చేసుకున్న యాంటీ బీసీ ఇమేజ్ మారిపోదని అంటున్నారు. అంతే కాకుండా, కృష్ణయ్య ట్రాక్ రికార్డులో మరకలు మచ్చలు చాలానే ఉన్నాయని అంటారు. అలాగే, నిజానిజాలు ఎలాఉన్నా ఆయన బీసీ ఉద్యమాన్ని ఒక వ్యాపారంగా నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా లేక పోలేదు. కృష్ణయ్య 1994లో సిన్సియర్’గానే బీసీ సంక్షేమ సంఘం స్థాపించినా, అనంతర కాలంలో ఆయన దాన్నొక వ్యాపార సంస్థగా మార్చడంతో పాటుగా బ్లాక్’ మెయిల్ రాజకీయాలు చెశారనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి, కరుడు కట్టిన నేరస్తుడు, నయీంతో తనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, నయీం తన శిష్యుడని కృష్ణయ్య స్వయంగా ప్రకటించుకున్నారు. సో.. జగన్ రెడ్డి, ఏపీలో అర్హులైన బీసీలే లేనట్లు, ఏమి ఆశించి పొరుగు రాష్ట్రం నుంచి కృష్ణయ్య ఎరువు తెచ్చుకున్నారో గానీ, ఆయన ఆశించిన ప్రయోజనం మాత్రం అంది ద్రాక్షగానే మిగిలిపోతుందని అంటున్నారు. నిజమే, వైసీపీకి మంద బలం ఉంది కాబట్టి, కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడు అవుతారు.
అదలా ఉంటే, ఆర్. కృష్ణయ్య పేరుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడే అయినా, అదొక స్వయం ప్రకటిత పాడవే కానీ, ఆయన్ని బీసీలు అందరూ తమ నేతగా గుర్తించి ఇచ్చిన పదవి కాదు. ఆయన్ని ఎవరూ ఎన్నుకోలేదు. ఆయనకు ఆయనే నేను అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నారు. నిజానికి, ఆయన బీసీలు అందరూ ఆయన వెంట నడిచేంత గొప్పనాయకుడు కాదు. అంతే కాదు, అయన రాజకీయంగా ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఒక్కసారి మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది కుడా తెలుగు దేశం పుణ్యానే ఆయన 2014లో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఒక్కసారి కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అదే కృష్ణయ్య 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా, మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు తెలిపారు.
అందులో సందేహం లేదు. కానీ, బీసీలను మెట్టులుగా చేసుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామని కలలు కంటున్న జగన్ రెడ్డి కలలు కలుగానే మిగిలిపోతాయని అంటున్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం అయ్యే పనికాదని, పైగా, జగన్ రెడ్డి నిర్ణయానికి సొంత పార్టీ నుంచి కూడా ఎదురుదెబ్బ తప్పదని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-jagans-stratagy-in-sending-krishnayya-to-rajyasabha-25-136056.html





