మంగళగిరిలో పోటీకి ఆర్కే నో!.. ఈ సారి విజయం కష్టమననేనా?

Publish Date:May 18, 2022

Advertisement

గత ఎన్నికల్లో జెయింట్ కిల్లర్స్ గా నిలిచి వైసీపీ విజయంలో కీలక రోల్ ప్లే చేసిన నేతలెవరూ ఈ సారి వైసీపీ అభ్యర్థులుగా ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధ పడటం లేదు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ పై విజయం సాధించిన గ్రంథి శ్రీనివాస్ జగన్ తీరుపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేదే లేదంటూ తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కోవలోకే మరో జెయింట్ కిల్లర్, మంగళగిరి స్థానం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై విజయం సాధించిన ఆర్కే (ఆళ్ల రామకృష్ణారెడ్డి) చేరారు.

ఈ సారి తాను పోటీలో ఉండననీ, మంగళగిరి స్థానాన్ని బీసీలకు వదిలేస్తాననీ ప్రకటించారు. అయితే  ఆయన పోటీ చేయనని ప్రకటించడానికి కారణం బీసీలపై ప్రేమ కాదనీ, పోటీలో దిగినా పరాజయం తప్పదన్న భయమేననీ పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికలలో ఆర్కే తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ పై దాదాపు 5 వేల ఓట్లతో విజయం సాధించారు.

అయితే అప్పటికీ, ఇప్పటికీ నియోజకవర్గంలో పరిస్థితిలో బాగా మార్పు వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికలలో లోకేష్ విజయం సాధిస్తే ఏమేం జరుగుతాయని జనాలను భయపెట్టి ఓట్లు దండుకున్నారో.. అవన్నీ జగన్ హయాంలో జరగడంతో ఈ సారి ఆర్కేకు ఓట్లు రావడం అంత సులువు కాదని అంటున్నారు. ఆ గ్రహింపుతోనే బీసీలకు వదిలేస్తానంటూ పోటీ నుంచి తప్పుకుని పరువు కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఆర్కే ఈ నిర్ణయానికి వచ్చారని వివరిస్తున్నారు. నిజానికి గత ఎన్నికలలో ఆర్కే విజయానికి ఆయన సత్తా కంటే.. ఫ్యాన్ గాలి, ప్రత్యర్థి పార్టీలలో ఓట్ల చీలిక కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేయాలని లోకేష్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని అప్పట్లోనే పరిశీలకులు పేర్కొన్న సంగతి విదితమే. ఎందుకంటే మంగళగిరి స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి నిలబడిన స్థందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడూ పొత్తులలో భాగంగా ఆ స్థానాన్ని వామపక్ష పార్టీలకు కేటాయించడాన్ని తెలుగుదేశం ఒక ఆనవాయితీగా కొనసాగిస్తూ వచ్చింది. ఎందుకంటే అక్కడ వామపక్ష పార్టీలకు ఒకింత పట్టు ఉంది.

వామపక్ష పార్టీలు, జనసేన పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికలలో పోటీ చేయడంతో ఓట్లు భారీగా చీలాయి. అంతే కాకుండా మంగళగిరిలో తెలుగుదేశం విజయావకాశాలు సంక్షిష్టమన్న నివేదికలను సైతం ఖాతరు చేయకుండా లోకేష్ సాహసం చేసి అక్కడే పోటీకి సిద్ధ పడ్డారు. ఆ ఎన్నికలలో 5 వేల ఓట్లతో లోకేష్ పరాజయం పాలయ్యారు. అక్కడ జనసేన, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థికి పది వేల ఓట్లు వచ్చాయి. అంటే ఆర్కే విజయానికి ఓట్ల చీలికే కారణమని నిర్ధారణ అయ్యింది. అయితే ఇప్పుడు నాటికీ నేటికీ పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది.

విజయం తరువాత ఆర్కే ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కరకట్టపై ఇళ్లు కూల్చేస్తారంటూ జనాలను అప్పట్లో భయపెట్టి విజయం సాధించిన ఆర్కే.. తాను గెలిచిన తరువాత ఇళ్ల కూల్చివేతను దగ్గరుండి చేయించడంతో ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు లోకేష్.. ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించి.. ఓ నియోజకవర్గ ఇంచార్జిగా మంగళగిరిలో ప్రజలలో మమేకమౌతున్నారు.  అలాగే   గ్రామాల వారీగా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు.  గతంలో సీఎం కుమారుడిగా.. మంత్రిగా ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉండేది.. దాంతో ఆయన జనంతో ఇప్పటిలా మమేకం కాలేకపోయారు. అయితే ఇప్పుడు అలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో లోకేష్ జనంతో మమేకమై నేరుగా వారితో ఇంట్రాక్ట్ అవుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇది రానున్న ఎన్నికలలో లోకేష్ కు సానుకూలతను పెంచిందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.