గుట్టపై సీన్ రివర్స్..సీఎం చెప్పిందొకటి..జరుగుతున్నది మరొకటి!

Publish Date:May 1, 2022

Advertisement

తిరుపతిని తలపించేలా యాదగిరి గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే లక్ష్యంతో ఆయల పునర్నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే.. ఆలయ దర్శనాలు ప్రారంభమైన తరువాత అక్కడ సీన్ రివర్స్ అయ్యిందన్న విమర్శలు వినవస్తున్నాయి.

కేసీఆర్ లక్ష్యాలు, ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా అక్కడి పరిస్థితి ఉందని యాదగిరిగుట్ట జేఏసీ ఆరోపిస్తున్నది. ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా? లేక దేవాదాయ శాఖాధికారుల ఇష్టారాజ్యంగా సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.

గుట్టపైకి వాహనాల అనుమతి, దుకాణాలకు అనుమతి దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు జేఏసీ ఆరోపించడమే కాకుండా ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేసి సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. అయితే వారి ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలకూ ఉపక్రమించకపోవడంతో అంతా సీఎం కనుసన్నలలోనే జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


యాదగిరిగుట్ట  కొండపైన దుకాణాలు ఉండవద్దని కేసీఆర్ చెబితే..అదుకు భిన్నంగా అధికారులు దుకాణాలకు టెండర్లు పిలవడం, ఆ తరువాత వాటిని రద్దు చేసి వ్యాపార కేంద్రాల తెరిచేందుకు మౌఖిక ఆదేశాలివ్వడం,సీఎం వస్తున్నారనగానే  వాటిని మూసివేయించడం మరల మూసివేయించడం, ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ముగించుకుని వెళ్లగానే  వ్యాపార కేంద్రాలను తెరిపించడం వంటి సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. జేఏసీ ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వాస్తవాలు వెలికి తీసేందుకు ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నది. ఉన్నతాధికారులు తమ ఫిర్యాదుపై స్పందిచకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించాలని యోచిస్తున్నది.  తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయి వంటి యాదాద్రి పవిత్రతను మంటగలిపే విధంగా అక్కడి కార్యక్రమాలు ఉన్నాయన్న భావన సామాన్య భక్తులలో సైతం కలుగుతోంది. ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఒకింత ఇరుకుగా ఉండి అసౌకర్యం ఉన్నప్పటికీ భక్తులకు వసతి, సౌకర్యాల విషయంలో ఇప్పటి కంటే గతంలోనే ఎంతో మెరుగ్గా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొండపై ఎండ బారిన పడకుండా తలదాచుకునేందుకు నీడ కూడా కరవైన పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికకు, ప్రకటనలకు భిన్నంగా జరుగుతున్న కార్యక్రమాలపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు కొందరు  బినామీల పేరిట శానిటేషన్, మరమ్మతులు, నిర్మాణపు పనులు చేపడుతూ దేవస్థానం నిధులను  ప్రణాళికా బద్ధంగా దుర్వినియేగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఆధారాలతో సహా  లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు జేఏపీ తెలిపింది. అసలింతకీ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందాల్సిన యాదగిరి గుట్టపై ఏం జరుగుతోంది? భక్తులలో, స్థానికులలో ఎందుకు ఇంత అసహనం వ్యక్తం అవుతోంది.  గుట్ట విషయంలో భారీ స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? నిజంగానే గట్టు పునర్నిర్మాణం, అనంతర పనుల నిర్వహణలో భారీ అవినీతి జరిగిందా? ఈ అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించి అవకతవకలు జరిగినట్లు రుజువైతే సంబంధితులపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.