ఎన్నికలకు కమలం రె‘ఢీ’.. తెలంగాణలో ముందస్తు ఖాయమని ఫిక్స్

Publish Date:May 1, 2022

Advertisement

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న నిశ్చితాభిప్రాయంలో కమలనాథులు ఉన్నారు. తెరాస ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినదానికీ, కానిదానికీ కేంద్రంపైనా, మోడీపైనా నిప్పులు చెరుగుతూ ప్రసంగాలు చేయడం వెనుక ముందస్తు వ్యూహమే ఉందన్నది కమలదళం భావిస్తున్నది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది. నాయకులు, కార్యకర్తలూ నిత్యం ప్రజలలోనే ఉండేలా పార్టీ కార్యక్రమాలను రూపొందిస్తున్నది.  బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం నిమగ్నం అయిపోయింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలకు జాతీయ నాయకత్వం ఆశీస్సులు ఉండటంతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. 

 అధికార తెరాసకు చెక్ పెట్టడానికి అందివచ్చిన ఏ చిన్న సంఘటననూ వదులుకోవడం లేదు. రాష్ట్ర నాయకత్వమే కాకుండా జాతీయ స్థాయి నాయకులు కూడా అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికీ, విమర్శించడానికి వెనుకాడటం లేదు. రాష్ట్రంలో పార్టీ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వరకు అందరికీ జాతీయ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. ఎస్సీ  రిజర్వుడు నియోజకవర్గాల్లోని నాయకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా సమావేశాలను  నిర్వహించింది. ఆయా నియోజకవర్గాలలో  పార్టీలో ఉన్న లోపాల, బలహీనతలను గుర్తించి బూత్ స్తాయిలో నుంచీ పార్టీ బలోపేతంపై శ్రద్ధ పెడుతున్నారు.

బిజెపిలో మహిళా   విజయశాంతి, డికె అరుణ, రాణి రుద్రమరెడ్డి వంటి బలమైన మహిళా నేతల సేవలను మరింత సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా అధికార పార్టీకి చెక్ పెట్టే అవకాశం ఉందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ ముగ్గురి చేతా తెలంగాణ సిఎం కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శణాస్త్రాలను సంధింప చేయడం ద్వారా తెరాస ఎదురుదాడికి దిగే అవకాశం లేకుండా చేసే వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తున్నది. మోడీ, అమిత్ షా, బండి సంజయ్ వంటి నేతల విమర్శలను దీటుగా ఎదుర్కొనే తెరాస మంత్రులు, సీనియర్లు బీజేపీ మహిళా నేతల విమర్శనాస్త్రాలను దీటుగా తిప్పి కొట్టడంలో విఫలమౌతున్నారని పరిశీలకులు సైతం అంగీకరిస్తున్నారు.  

తెలంగాణలో రాజకీయ పరిస్థితులను బట్టి తెరాసకు ప్రత్యామ్నాయం  బీజేపీయే అని భావిస్తున్న కమలనాథులు.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.  ఖమ్మంలో పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే కేంద్ర హెూం శాఖ మంత్రి నేరుగా ఆ కార్యకర్త ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను పరామర్శించడం,  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అయినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకోవడం రాష్ట్రంపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దష్టి పెట్టిందనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అసలింతకీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అన్న ప్రశ్నకు సాధికారిక సమాధానం దొరకదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ‘ముందస్తు’ ఉంటుందా, ఉండదా అన్నది తేలుతుంది. ఆయన ఇప్పటికే ముందస్తు ఉండదని ఖరాకండీగా చెప్పినా, కమల నాథులు మాత్రం విశ్వసించడం లేదు. వేగంగా టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందనీ, అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా ప్రజలలో ఇంకా పలుచన కాకముందే...ముందస్తుకు వెళ్లి సత్ఫలితం రాబట్టాలన్నది కేసీఆర్ వ్యూహమనీ కమలనాథులు అంచనా వేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అందుకే ముందస్తు లేదు లేదంటూనే కేసీఆర్ ముందస్తు గంట మోగించే అవకాశాలున్నాయన్నది బీజేపీ అభిప్రాయం. అందుకే ఇప్పటి నుంచీ ఎన్నికల సన్నాహాలలో నిమగ్నమైపోయింది. 

ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తుకు ముహూర్తం పెట్టే అవకాశాలున్నాయన్న అంచనాతో బీజేపీ.. ఇప్పటి నుంచే జాతీయ నాయకులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార శంఖారావం మోగించే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల సమయంలో అయితే బీజేపీ అగ్రనేతలకు రాష్ట్రంపై దృష్టి పెట్టే సావకాశం ఉండదనీ, అందుకే కేసీఆర్ ముందస్తుకు అప్పుడే ముహూర్తం పెడతారనీ బీజేపీ ఊహిస్తోంది. దాంతో ఇప్పటి నుంచే రాష్ట్ర పర్యటనకు పార్టీ జాతీయ నాయకులను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఏది ఏమైనా కమల నాథుల ఎన్నికల సన్నాహాలూ, కేంద్రంపై తెరాస విమర్శల జోరూ వెరసి రాష్ట్రంలో ఇప్పుడే ఎన్నికల హీట్ పెరిగిపోయింది.  మరో వైపు రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ లో కూడా ఎన్నికల సమరోత్సాహం కనిపిస్తున్నది. 

By
en-us Political News

  
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.