'దీపావళి ఒక వెలుగుల పండగ' అంటూ విమర్శలు చేస్తున్న వేది పండితులు...
Publish Date:Oct 22, 2019
Advertisement
దీపావళి అంటే దీపాల వరుస అంతేగానీ టపాసుల మోత కాదంటున్నారు కొందరు వేదపండితులు. సనాతన ధర్మం ఏ రోజు కాలుష్యాన్ని ప్రేరేపించిందని చెబుతున్నారు. నరకాసుర వధ జరిగిన తరువాత దేవ దుందుభులు మోగించి హర్షాతిరేకాలు చేసి నర్తించారని గుర్తుచేస్తున్నారు. ఈ టపాసులన్నీ మధ్యలోనే వచ్చిన ఆడంబరంగా అభివర్ణిస్తున్నారు. వాస్తవంగా టపాకాయలు కాల్చడం వల్ల ఎక్కడా పురాణాల్లో వర్ణింపబడలేదు. నృత్యాలు చేశారని, దేవదుందుభులు వాయించారని, కరతాళ ధ్వనులు చేశారని హర్షాతిరేకాలు ప్రదర్శించారని ఒకప్పుడు అవన్నీ వగైరాలు చేశారని వర్ణనలు ఉన్నాయి. కానీ ఈ విధంగా టపాకాయలు కాల్చమని ఎక్కడా కూడా పురాణాల్లో వర్ణన లేదు. ఈ మధ్య కాలంలో ఇది క్రమంగా పెరిగి పెరిగి ఇది ఎట్లా తయారయ్యిందంటే నేషనల్ ఇన్ కమ్ వేస్ట్ కింద వస్తున్నట్టుగా ఉంటోంది. దీపావళి నాడు అమ్మవారికి పూజ చేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు దీపాల రంగవల్లులు పేరుస్తారు. కానీ ఇంట్లో అమ్మవారిని భక్తితో పూజించి బయటకొచ్చి అదే అమ్మవారి ప్రతిమ ఉన్న బాణసంచాను కలుస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో పడి పండుగల పేరుతో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం మంచిది కాదన్నది పెద్దల సూచన. నరకాసురుని సంహరించడానికి ఎంత ఇబ్బందుల అయ్యాయో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఈ రోజులలో కాలుష్యం వల్ల జరుగుతుంది. ఇది గమనించి ప్రజలందరూ మన సనాతన ధర్మంలో చెప్పినట్లు ధర్మాలు ఆచరించినపుడు మనకు క్షేమంగా ఉంటుంది. అప్పుడే నిజమైనటువంటి నరక చతుర్దశి చేసుకున్నటువంటి ఆనందం మనకు కలుగుతుంది అని పండితులు వర్ణిస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా రసాయనాలతో చేసినటువంటి టపాసులను వాడుతున్నారు. అలాగ కాకుండా చక్కగా ఇల్లంతా దీపాలు, వీధంతా దీపాలను పెట్టుకుంటే మొత్తం కూడా కాంతితో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. దీపావళి నాడు నువ్వుల నూనె, ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తారు. అయితే ఈ స్వచ్ఛమైన వెలుగుల స్థానంల్లో కళ్లు జిగేలుమనే కలర్ ఫుల్ లైట్స్ వచ్చాయి. కొవ్వొత్తులు చేరిపోయాయి. దీపం సుభాలను సూచిస్తే కొవ్వొత్తి శోకాన్ని ఆహ్వానిస్తుందని చెబుతున్నారు కొందరు. బాణసంచ సంబరమే కానీ సంప్రదాయం కాదని అంటున్నారు. ఈ దీపాన్ని వెలిగించడం ఎందుకంటే మనలో ఉన్న పాపం హరించడం కొరకు కాబట్టి అలాంటి దీపాన్ని గనక వెలిగిస్తే "సంధ్యాదీపం నమోస్తుతే" ఏ సమయంలో వెలిగించాలంటే సంధ్యాకాల సమయంలో వెలిగిస్తే హరిస్తుంది అనడానికి నిదర్శనం ఈ దీపావళి పండుగ. టపాసుల కాల్చివేతతో ప్రమాదం ఉందనేది కొందరి మాట. దీనిలో మరో కోణం కూడా ఉంది. బాణసంచా కాల్చడం సంబరం కాదని సంప్రదాయమని అంటున్నారు బంగారయ్యశర్మ. నరకాసురుడి వధ తర్వాత గంధకంతో చేసిన పదార్థాన్ని పేల్చారని వివరిస్తున్నారు. టపాసుల్ని పెట్టడము వెలిగించటం అనేటటువంటి ఆచారము మనకి ఎప్పడి నుంచో ఉంది అదేమీ కొత్తగా ఇవాళ ఏదో ఈ కంపెనీస్ అన్నీ వచ్చిన తరువాత వచ్చినటువంటిది కాదు. కాబట్టి భారతదేశంలో ఈ రకమైనటువంటి విజ్ఞానం గంథకం వాడీ ఎలా స్ఫోటకం చేయొచ్చో అనేటటువంటి విద్య ఎప్పటి నుంచో ఉంది. రససిద్ధులు మనకి రకరకాలుగా చెప్పబడే ఉన్నాయి. ఎవరి మాట ఎలాగున్నా ఎవరివాదన ఏదైనా రసాయనాలు నిండిన టపాసులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి అన్నది నిజం. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా అన్నది వాస్తవం.మరి ఈ దీపావళి వెలుగుల పండుగగా ఉండబోతోందా లేక మోతలు మోగించేలా ఉండబోతోందా అన్నది చూడాలి.
http://www.teluguone.com/news/content/what-is-diwali-and-how-to-celebrate-the-festival-25-90417.html





