అమ్మో మాంసమా! తస్మాత్ జాగ్రత్త....
Publish Date:Oct 22, 2019
Advertisement
కొందరికి ముక్క లేనిదే ముక్క దిగదు అంటారు,కానీ ఈ మధ్య మాంసాన్ని విక్రయిస్తుంటే ప్రజలు అనేక రోగాల భారీ పడుతున్నారు.సాధారణంగా మాంసాన్ని విక్రయించాలంటే ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ ఖచ్చితంగా నిర్ధారించాల్సి వస్తోంది. అది తినటానికి పనికొస్తుందో లేదో ఆయనే నిర్ధారించాలి ఆయన నిర్ధారించిన తరువాతే విక్రయించాలి. కానీ విజయవాడ కబేళాల్లో మాత్రం అలా జరగట్లేదు. అకడ మీట్ స్టాంపింగ్ దందా జరుగుతోంది. ఓ మేకను గానీ,గొర్రెను గానీ స్లాటర్ చేయాలంటే రూల్స్ ప్రకారం ఇరవై నాలుగు గంటల పాటు పర్యవేక్షణలో పెట్టాలి. అది ఆరోగ్యంగా ఉన్నాయని తేలిన తర్వాతే స్లాటర్ చేయాలి. ప్రతి కబేలా సెంటరులో పశువైద్యాధికారి పరిశీలించాకే మునిసిపల్ అధికారులు స్టాంప్ వేయాలి. కానీ విజయవాడ కబేళాల్లో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం కాసుల కక్కుర్తితో ఇక్కడ స్టాంపింగ్ యధేచ్ఛగా సాగుతోంది. అపరిశుభ్ర ఏరియాలలో ఇష్టం వచ్చినట్టు స్లాటర్ చేస్తున్నారు. దీనివల్ల రోగాల ప్రభావం పడే అవకాశముంది. మేక, గొర్రె అనారోగ్యంగా ఉన్నా కూడా షాపులకు తరలించేస్తున్నారు. ఇక షాపుల్లో పరిస్థితి చెప్పేదేముంది, రోడ్ల పక్కనే ఉంటాయి, ఆరు బయటే మాంసం వేలాడుతూ ఉంటుంది. వాహనాల దుమ్ము, ధూళి అంతా మాంసంపై పడుతూ ఉంటుంది. అసలే నాణ్యత లేని మాంసం వాటి పై దుమ్ము ఇలాంటి మాటన్ తింటున్న వారి పరిస్థితి ఏమిటి అని పరిస్థితి ఆలోచిస్తేనే అమ్మో అనిపిస్తోంది. అక్కడ ఒక రికార్డు కూడా మేంటైన్ చేస్తుంటారు. ఎవరెవరు ఎన్ని మేకపోతులు కావచ్చు,ఎన్ని గొర్రెపోతులు కావచ్చు, బీఫ్ కావచ్చు ఇవన్నీ కూడా పరిశీలించి స్టాంపింగ్ చేసిన తరవాత మాత్రమే విక్రయ కేంద్రాలకు వెళ్తూ ఉంటాయి.ఇలాంటి మాంసాన్ని అధికారులు విక్రయానికి ఎలా అనుమతిస్తారు ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోని పరిస్థితిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
http://www.teluguone.com/news/content/are-you-eating-adult-mutton-be-careful-25-90415.html





